యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

జెఎల్ఎన్ స్టేడియంలో విజ‌య‌వంతంగా ముగిసిన ఫిట్ ఇండియా ఫ్రీడం రైడ‌ర్ బైక్ ర్యాలీలు

Posted On: 25 NOV 2022 11:09AM by PIB Hyderabad

కీల‌కాంశాలు

సుమారు 75 రోజుల పాటు, 11 మంది మ‌హిళ‌లు స‌హా 75 రైడ‌ర్లు  75 ప‌ట్ట‌ణాలు/ న‌గ‌రాలలో 18000+ కిలోమీట‌ర్ల వ్యాప్తంగా 34 రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాలలో క‌న్యాకుమారి నుంచి వార‌ణాసి వ‌ర‌కు, గాంధీన‌గ‌ర్ నుంచి షిల్లాంగ్ వ‌ర‌కు ప్ర‌యాణించారు. 

ఫ్రీడం రైడ‌ర్ బైక‌ర్ ర్యాలీల ముగింపు వేడుక గురువారం నాడు న్యూఢిల్లీలోని జెఎల్ఎన్ స్టేడియంలో జ‌రిగింది. ఈ ప్ర‌త్యేక యాత్రను భార‌త ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మ‌మైన ఫిట్ ఇండియా మ‌ద్ద‌తుతో ఆలిండియా మోట‌ర్ బైక్ ఎక్స్‌పెడిష‌న్ (ఎఐఎంఇ) నిర్వ‌హించింది. 

ఈ ముగింపు వేడుక‌కు యువ‌జ‌న వ్య‌వ‌హారాలు& క్రీడ‌ల మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి (క్రీడ‌లు) శ్రీ‌మ‌తి సుజాత చ‌తుర్వేది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్ట‌ర్ - జ‌న‌ర‌ల్ శ్రీ సందీప్ ప్ర‌ధాన్‌, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ‌, భార‌త క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. సుమారు 75 రోజుల పాటు, 11 మంది మ‌హిళ‌లు స‌హా 75 రైడ‌ర్లు  75 ప‌ట్ట‌ణాలు/ న‌గ‌రాలలో 18000+ కిలోమీట‌ర్ల వ్యాప్తంగా 34 రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాలలో క‌న్యాకుమారి నుంచి వార‌ణాసి వ‌ర‌కు, గాంధీన‌గ‌ర్ నుంచి షిల్లాంగ్ వ‌ర‌కు ప్ర‌యాణించారు.
ఈ ప్ర‌యాణంలో భాగంగా, రైడ‌ర్లు కేవ‌డియాలోని స్టాట్య్చూ ఆఫ్ యూనిటీ, సిమ్లాలోని వైస్‌రీగ‌ల్ లాడ్జ్‌, గువాహ‌తిలో కామాఖ్య ఆల‌యం, మ‌ధురైలో మీనాక్షి ఆల‌యం వంటి ప్ర‌దేశాల‌ను కూడా సంద‌ర్శించారు. వారు ఉత్త‌ర ప్రాంతంలోని మైదానాలు, ప‌శ్చిమాన ఇసుక దిబ్బ‌లు, ఈశాన్యంలో ప‌ర్వ‌త‌శ్రేణులు, ద‌క్షిణాన తీర‌ప్రాంతాలు, సియాచిన్ వంటి మంచు ప్ర‌దేశాల‌లో భిన్న‌మైన‌, తీవ్ర‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, భౌగోళిక ప్రాంతాల‌లో ప్ర‌యాణాన్ని సాగించారు. 

ఈ అసాధార‌ణ సాహ‌సం చేసిన 75మందినీ అభినందిస్తున్నాను, మీరంతా సుర‌క్షితంగా తిరిగి వ‌చ్చినందుకు, చాలామందికి స్ఫూర్తినిచ్చినందుకు ఆనందిస్తున్నాను, అని శ్రీ‌మ‌తి సుజాతా చ‌తుర్వేది పేర్కొన్నారు. ఆరోగ్యంగా, స్వ‌స్థంగా ఉండేందుకు, అంద‌రూ ఈ జాతీయ విధి కోసం ప‌ని చేస్తూ, ఆరోగ్యం, స్వ‌స్థ‌త‌లో ఉత్త‌మంగా ఉండాల‌న్నారు.  
ఈ కార్య‌క్ర‌మాల‌కు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌, గుజ‌రాత్ స్థానిక ఎంపీలు, జిల్లా మేజిస్ట్రేట్లు, ఇత‌ర ప్ర‌ముఖులు హాజ‌రై, పాల్గొన్నారు. ఈ ఈవెంట్ల సంద‌ర్భంగా, ఈ బైక‌ర్ల ద‌ళం త‌మ యాత్ర గురించి మాట్లాడ‌డ‌మే కాక త‌మ అనుభ‌వాల‌ను పంచుకుంటూ ప్రేక్ష‌కుల‌కు ఫిట్‌నెస్ విష‌యంలో ప్రేర‌ణ‌నిచ్చేందుకు ఉత్తేజ‌ప‌రిచే ఉప‌న్యాసాన్ని ఇచ్చారు. రైడ‌ర్లు గుజ‌రాత్‌లో గార్బా వంటి ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌లో పాల్గొన‌డం అన్న‌ది ఈ యాత్ర కీల‌కాంశాల‌లో ఒక‌టి. 
అంద‌రిలోనూ అతి పాత మ‌హిళా రైడ‌ర్‌, నీతా ఖండేక‌ర్ (59) మాట్లాడుతూ, నా తోటి రైడ‌ర్ల నుంచి మార్గ‌ద‌ర్శ‌నం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో భూభాగం పూర్తిగా భిన్నం. అక్క‌డ మ‌ట్టి, బుర‌ద‌తో కూడిన రోడ్లు ఉన్నాయి. మేం ప్ర‌తిసారీ ప‌డ్డాం, కానీ పైకి లేచాం. మేం సోద‌ర‌భావం గురించి కూడా నేర్చుకున్నాం. ఒంట‌రి రైడ‌ర్‌గా ఉండ‌టం నుంచి మేం రైడర్ల బృందంగా ఏర్ప‌డి, తేలిక‌పాటి భారంతో ప్ర‌యాణించ‌డం నేర్చుకున్నాం.  
ఈ ప్ర‌యాణం గురించి కొన్ని ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటూ, దాదాపు 20 ఏళ్ళ‌పాటు న‌డిపిన త‌ర్వాత అఖిల భార‌త రైడ్‌లో పాల్గొనేందుకు ఎంపిక కావ‌డం అన్న‌ది, మ‌న‌కు అభిరుచి ఉంటే అది మ‌న‌ల్ని ఏదో ఒక ఉన్న‌త స్థాయికి తీసుకువెడుతుంద‌న‌డానికి నేనే ఒక నిద‌ర్శ‌నం అని   సిక్కిం కి చెందిన బైక‌ర్ అయిన రోష‌న్ ఛెత్రీ చెప్పారు. మా భాగ‌స్వామి అయిన మోట‌ర్‌సైకిల్ కార‌ణంగా ఈ  ప్ర‌యాణం ద్వారా మా క‌ళ్ళ‌తో మొత్తం దేశాన్ని చూశాం అన్నారు. 
ఈ 75 రైడ‌ర్లు దేశంలోని ప్ర‌తి రాష్ట్రం నుంచి రావ‌డంతో మినీ- ఇండియాని త‌ల‌పించారు. అది మండే ఎండ‌లు, వాన‌లు, చ‌లి అయినా, మేం ఒక‌రికొక‌రం స్ఫూర్తిని ఇచ్చుకుని ముందుకుసాగాం. ఈ ప్ర‌యాణంలో మేం కొన్ని హృద‌యాల‌ను స్ప‌ర్శించ‌గ‌లిగాం. సందేశం ఫిట్‌నెస్ కు సంబంధించిందే అయినా సాధ్య‌మైనంత‌గా జ్ఞానాన్ని అందించి, సౌభ్రాతృత్వం అనే భావ‌న‌ను వ్యాప్తి చేశాం. మేం మంచి జ్ఞాప‌కాల‌తో తిరిగి వెడుతున్నాం అని పేర్కొన్నారు. 

 

****



(Release ID: 1878883) Visitor Counter : 106