రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
భారత్‌మాల ప్రాజెక్ట్ కింద హరియాణాలో రూ.1322.13 కోట్ల విలువైన ఎన్‌హెచ్-148బి సెక్షన్‌లోని 4 వరుసల భివానీ-హంసీ రహదారికి శ్రీ నితిన్ గడ్కరీ ఆమోదం
Posted On:
24 NOV 2022 2:17PM by PIB Hyderabad
భారత్‌మాల ప్రాజెక్ట్ కింద, హరియాణాలోని భివానీ-హంసీ జిల్లాల్లో ఎన్‌హెచ్-148బి సెక్షన్‌లో కింద ఉన్న 4 వరుసల రహదారికి హెచ్‌ఏఎం పద్ధతిలో ఆమోదం లభించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ వరుస ట్వీట్ల ద్వారా వెల్లడించారు. ఈ రహదారి ప్రాజెక్టు విలువ రూ.1322.13 కోట్లు. ఈ ప్రాజెక్టు వల్ల హరియాణాలో వేగవంతమైన రవాణా & అంతర్ జిల్లాల అనుసంధానం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
ఈ సెక్షన్‌ను అభివృద్ధి చేయడం వల్ల, సుదీర్ఘ ప్రయాణాలు, సరకు రవాణా సామర్థ్యం మెరుగుపడుతుందని మంత్రి చెప్పారు. ఫలితంగా ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగడంతోపాటు, ప్రయాణ సమయం, వాహనాల నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల హరియాణాలో ప్రాథమిక మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహాం లభిస్తుంది, ఆ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి ఊపందుకుంటుందని మంత్రి ట్వీట్ చేశారు.
***
(Release ID: 1878570)
Visitor Counter : 217