నౌకారవాణా మంత్రిత్వ శాఖ
నిరంతర సముద్ర నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన - జె.ఎన్.పి.ఏ.
సుస్థిరతలో నాయకత్వాన్ని సాధించడానికి సహాయపడే విద్యుత్ పర్యావరణ పర్యవేక్షక వాహనాన్ని ప్రారంభించిన - జె.ఎన్.పి.ఏ.
Posted On:
23 NOV 2022 11:20AM by PIB Hyderabad
భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఓడరేవుగా పేరుగాంచిన, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జె.ఎన్.పి.ఏ), ఐ.ఐ.టి. మద్రాస్ లోని సివిల్ ఇంజినీరింగ్ శాఖతో కలిసి నిరంతర సముద్ర నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాన్ని (సి.ఎమ్.డబ్ల్యూ.క్యూ.ఎమ్.ఎస్) అభివృద్ధి చేసి, విద్యుత్ పర్యావరణ పర్యవేక్షక వాహనాన్ని, 2022 నవంబర్, 21వ తేదీన, పోర్టు వద్ద ప్రారంభించింది. ఈ పర్యవేక్షణ కేంద్రాన్ని, వాహనాన్ని, జె.ఎన్.పి.ఏ. డిప్యూటీ చైర్మన్, శ్రీ ఉన్మేష్ శరద్ వాఘ్ తో పాటు, జె.ఎన్.పి.ఏ. కి చెందిన శాఖాధిపతులందరి సమక్షంలో జె.ఎన్.పి.ఏ. చైర్మన్, శ్రీ సంజయ్ సేథి, ఐ.ఏ.ఎస్., ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ సంజయ్ సేథీ మాట్లాడుతూ, "ఆర్థిక, సామాజిక, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా - స్థిరత్వంలో నాయకత్వాన్ని సాధించడానికి, వాణిజ్యానికి విలువను సృష్టించడానికి, జె.ఎన్.పి.ఏ. కట్టుబడి ఉంది. జె.ఎన్.పి.ఏ. ఎల్లప్పుడూ పర్యావరణ బాధ్యత కలిగిన ఓడరేవుగా అభివృద్ధి చెందుతోంది. నిరంతర సముద్ర నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రం, ఈ-వాహనాల ప్రారంభం స్థిరమైన అభివృద్ధి కి నిబద్ధత దిశగా మరో అడుగు." అని పేర్కొన్నారు.
ఓడరేవు ప్రాంతంలోని సముద్రపు నీరు, గాలి నాణ్యతను నిర్వహించడంలో, ఓడరేవు ప్రాంతంలో పర్యావరణ నాణ్యతను నియంత్రించడంలో, నిరంతర నీటి నాణ్యత వ్యవస్థ, విద్యుత్ పర్యవేక్షణ వాహనం సహాయపడతాయి. దీని ద్వారా, నీటి నాణ్యత కేంద్రాల సమాచారం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం, కరిగిన ఆక్సిజన్, అమ్మోనియా, వాహకత, నైట్రేట్, లవణీయత, మాలిన్యాలు వంటి పోర్ట్ ఎస్టేట్ చుట్టూ పర్యావరణ నాణ్యతకు అనుగుణంగా తనిఖీ చేయడంతో పాటు, వాహనాల గ్రీన్ హౌస్ వాయువు తీవ్రతను జె.ఎన్.పి.ఏ. తగ్గించగలుగుతుంది. అదేవిధంగా, సముద్ర వాతావరణంలో పరిశుభ్రమైన ప్రమాణాలను నిర్వహించడానికి సముద్ర నీటి నాణ్యత పై సమాచారం సముద్రపు నీటి టి.డి.ఎస్. కు ఎంతైనా అవసరం. జె.ఎన్.పి.ఏ. వద్ద కొనసాగుతున్న పరిసర గాలి, శబ్ద పర్యవేక్షణ కార్యకలాపాలను కూడా, ఈ-వాహనం దృఢపరుస్తుంది.
వివిధ పర్యావరణ నవీకరణలు, మురుగునీటి శుద్ధి కర్మాగారం, నిరంతర పరిసర గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రం (సి.ఏ.ఏ.క్యూ.ఎం.ఎస్), సమగ్ర ఘన వ్యర్ధాల నిర్వహణ సదుపాయం, పోర్ట్ ఏరియా, టౌన్‌షిప్ లలో ఎల్.ఈ.డి. దీపాల భర్తీ, ఈ-ఆర్.టి.జి.ఎస్., తీరంలో విద్యుత్ సరఫరా, జె.ఎన్.పి.ఏ. వద్ద శివాలయం, షేవ ఫుట్ హిల్ సమీపంలోని నీటి వనరుల పునరుద్దరణ, కేంద్రీకృత పార్కింగ్ ప్లాజా వద్ద ట్రాఫిక్ సౌలభ్యం కోసం కృషి, మడ అడవుల నిర్వహణతో సహా పోర్ట్ గ్రీన్ కవర్, ఆయిల్ స్పిల్ రెస్పాన్స్, మొదలైనటువంటి వంటి గ్రీన్ పోర్ట్ ఇనిషియేటివ్‌లను, జె.ఎన్.పి.ఏ. ప్రారంభించింది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ కు చెందిన ప్రాంతాల్లో దాదాపు 4.10 ఎం.డబ్ల్యూ.పి., సగటులో 38 శాతం సామర్ధ్యం గల, సౌర విద్యుత్ ప్యానెల్స్ ను కూడా ఏర్పాటు చేసింది. విద్యుత్ అవసరాలను పునరుత్పాదక శక్తి నుంచి ఉపయోగించుకుంటూ, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఓడరేవు ప్రాంతాన్ని ఎల్.ఈ.డి. లైట్ల తో భర్తీ చేయడం జరిగింది.
*****
(Release ID: 1878536)
Visitor Counter : 162