మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కాశీ తమిళ సంగమం 5వ రోజు , కాశీ సంస్కృతి ,కళలు, సంప్రదాయం గురించి తెలుసుకున్న రెండవ బ్యాచ్‌ తమిళ ప్రతినిధి వర్గం.


హనుమాన్‌ ఘాట్‌, సుబ్రమణ్యభారతి నివాసం, ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ లోని మ్యూజియం,సారనాథ్‌,బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ ఆంఫీథియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు 5 వరోజు ఆకర్షణగానిలిచాయి.

Posted On: 23 NOV 2022 2:47PM by PIB Hyderabad

కాశీలో నెలరోజులపాటు జరుగుతున్న కాశీ తమిళ సంగమం ఉత్సవాలలో పాల్గొనేందుకు తమిళనాడు నుంచి కాశీ వచ్చిన తమిళ ప్రతినిథుల రెండవ బృందసభ్యులు ఈరోజు 5 వ రోజు, గంగానది ఒడ్డున ఉన్న హనుమాన్‌ ఘాట్‌లో ఉదయం పవిత్ర స్నానాలు ఆచరించారు.ఇంతకుముందు దీనిని రామేశ్వర్‌ ఘాటÊ అనే వారు.వారణాశి కి వచ్చినవారు సందర్శించే ముఖ్యమైన ఘాట్‌లలో ఇది ఒకటి. ఈ ఘాట్‌ చుట్టుపక్కల దక్షిణాదికి చెందిన చాలా మఠాలు ఉండి జనసమ్మర్ధంగా ఉంటుంది. ఇక్కడే కేరళమఠం, కంచి మఠం, శంకరమఠం, శృంగేరి మఠం తదితరాలు ఉన్నాయి.

ఘాట్‌ లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం తమిళ బృందసభ్యులు హనుమాన్‌ ఘాట్‌ వద్ద ఉన్న సుబ్రహ్మణ్యభారతి నివాసాన్ని సందర్శించారు. తమ సంప్రదాయాలు,ఆచారాలను , సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించేందుకు అవకాశం కల్పించినందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.తమిళప్రతినిధి వర్గం రెండో బృందంలో చేతివృత్తులవారు, వ్యాపారులు ఉన్నారు. అనంతరం వారు ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ కు వెళ్లి మ్యూజియంను సందర్శించారు.మ్యూజియంలో పూర్వాంచల్‌ ప్రాంతానికి చెందిన అద్భుత హస్తకళారూపాలను వారు తిలకించారు. అలాగే సారనాథ్‌లో లభ్యమైన పురావస్తువులను చూశారు. టిఎఫ్‌సి సెంటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో కొందరు ప్రతినిధులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమం అనంతరం , మధ్యాహ్నం నుంచి ఈ ప్రతినిధి బృందం సారనాథ్‌ సందర్శించింది.

ఈ ప్రతినిధి బృందం సాయంత్రానికి సారనాథ్‌నుంచి బిహెచ్‌యు ఆంఫీ థియేటర్‌ కు చేరుకుంటుంది. అక్కడ వారు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను వారు సందర్శిస్తారు. ఇక్క్డడ ఉత్తరాది, దక్షిణాదికి చెందిన 75 చేతివృత్తుల, హస్తకళల, చేనేత, సంప్రదాయ దుస్తుల స్టాల్స్‌, వివిధ ప్రాంతాల ఆహార అలవాట్లను ప్రతిబింబించే స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిని స్థానిక ప్రజలు, తమిళప్రతినిథుల సందర్శనకు ఏర్పాటు చేశారు.

***



(Release ID: 1878533) Visitor Counter : 100