సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner

53వ ఐఎఫ్ఎఫ్ఇ లో ప్రముఖ యువ స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్‌ జీవితం ఆధారంగా తెలుగులో నిర్మించిన చిత్రం ప్రదర్శన


ఖుదీరామ్ బోస్‌ గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలి.. చిత్ర దర్శకుడు విద్యాసాగర్ రాజు

స్వాతంత్య్ర పోరాటం గురించి అంతగా తెలియని వాస్తవాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి : విద్యాసాగర్ రాజు

53వ ఐఎఫ్ఎఫ్ఇ    ప్రముఖ యువ స్వాతంత్ర్య సమరయోధుడు, చిన్న వయస్సులో ప్రాణత్యాగం చేసిన  ఖుదీరామ్ బోస్‌ జీవితం ఆధారంగా తెలుగులో నిర్మించిన చిత్రాన్ని ఈరోజు  53వ ఐఎఫ్ఎఫ్ఇ ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించారు. 

శ్రీ విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఖుదీరామ్ బోస్‌ మూడవది. ' ఖుదీరామ్ బోస్‌ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చిత్రాన్ని నిర్మించడం జరిగింది ' అని విద్యాసాగర్ రాజు అన్నారు. 

   ఐఎఫ్ఎఫ్ఇ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన రాజు కథను సిద్ధం చేయడానికి ముందు పెద్ద కసరత్తు చేసి పరిశోధన చేశామని తెలిపారు.  ఖుదీరామ్ జీవితం, ఆయనకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు బెంగాల్ విభజన మరియు రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, సోదరి నివేదిత, బరేంద్రనాథ్ ఘోష్  వంటి ప్రముఖ వ్యక్తులు,  స్వాతంత్ర్య ఉద్యమం ముఖ్యమైన సంఘటనలతో  ముడిపడి ఉన్నాయని వివరించారు. స్వాతంత్ర్య పోరాటం గురించి అంతగా తెలియని కొన్ని వాస్తవాలను  కూడా తమ చిత్రంలో చూపించామని  అన్నారు. ఖుదీరామ్ బోస్‌ తరఫున  ఆరుగురు న్యాయవాదులు వాదించడం లాంటి సంఘటనలు చిత్రంలో ఉన్నాయని తెలిపారు. ఖుదీరామ్ బోస్‌ కేసును  ఆనాటి కాలంలో ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందిన నరేంద్ర కుమార్ బాసు వాదించారు. అయితే, కేసులో ఖుదీరామ్ బోస్‌ ఓడిపోతారు. భారత జాతీయ పతాకాన్ని సిస్టర్ నివేదిత రూపొందినట్టు చిత్రంలో చూపించామని, ఈ ఘటన చిత్రంలో ముఖ్య ఘటనగా ఉంటుందని వివరించారు. 1906లో దేశంలో జరిగిన సౌండ్ రికార్డింగ్ సన్నివేశం కూడా చిత్రంలో ఉందని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతరం గీతాన్ని ఆలపించి నట్టు చిత్రంలో చూపించారు. 

 

 

' ఖుదీరామ్ బోస్‌ చరిత్ర గురించి తెలుసుకోవడానికి కృషి చేసిన చిత్ర బృందం ఆయనకు సంబంధించిన అనే అంశాలను చూపించాల్సి ఉందని గుర్తించింది.' అని విద్యాసాగర్ రాజు అన్నారు. ' బెంగాల్ విభజన సందర్భంగా చోటు చేసుకున్న దారుణాలు చిత్రంలో కనిపిస్తాయి. బెంగాల్ విభజనతో అనేక చారిత్రాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. జీవిత కథ పరిధిని విస్తరించి చిత్రాన్ని నిర్మించాను' అని దర్శకుడు విద్యాసాగర్ రాజు వివరించారు. 

అంచనాల మేరకు చిత్రం రూపుదిద్దుకుందని పేర్కొన్న దర్శకుడు దీని వెనుక చిత్ర బృందం, నటులు, సాంకేతిక నిపుణులు పూర్తి సహకారం అందించారని అన్నారు. 'వారు తెర వెనుక ఉన్నారు. అయితే, వారు తెర ముందు ఉన్నట్టు నేను భావిస్తాను' అని అన్నారు. 

చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన  నటుడు రాకేష్ జాగర్లమూడి  తన మొదటి సినిమాలోనే స్వాతంత్ర్య సమరయోధునిగా నటించడం  పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక నిజ జీవిత పాత్రను చిత్రీకరించడం తనకు కొంచెం సవాలుగా మారిందని అన్నారు.   కానీ, చిత్ర బృందం అందించిన సహకారంతో  సులువుగా నటించి పాత్రకు న్యాయం చేశానని అన్నారు.  వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నసీర్ వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం తన లాంటి నూతన నటులకు   కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం కలిగిస్తాయని  అని రాకేష్ అన్నారు.

చిత్ర నిర్మాణంలో అంకిత భావం, ప్రతి చిన్న విషయాన్ని గుర్తించడం, సంస్కృతి, నటీనటులు ముఖ్యమైన అంశాలు అని విద్యాసాగర్ రాజు అన్నారు. ప్రాంతీయ చిత్రాల గురించి ఆయన మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా  భావోద్వేగాలు ఒకే విధంగా  ఉంటాయి. అందుకే, ప్రాంతీయ సినిమాలు అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తున్నాయి.' అని అన్నారు. 

 

దేశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకోవడం ప్రారంభించినప్పుడు స్వాతంత్ర్య సమరయోధులపై సినిమా చేయాలని భావించాము. ఖుదీరామ్‌తో మా  ప్రయాణం ప్రారంభించాము" అని విద్యాసాగర్ రాజు అన్నారు. 
ఈ సినిమా ఏడు భారతీయ భాషల్లో విడుదల కానుంది. పార్లమెంట్‌లో జరగనున్న శీతాకాల సమావేశాల్లో హిందీ వెర్షన్‌ను ప్రదర్శించాలని అనుకుంటున్నామని   ఖుదీరామ్ బోస్  తెలిపారు.

 

***

iffi reel

(Release ID: 1878165) Visitor Counter : 220