చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

ఉపాధి కల్పన కు అత్యంత అధిక ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలన్న ప్రధాన మంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశలో భాగంగా దేశంలో 45 చోట్ల రోజ్ గార్ మేళాల నిర్వహణ


వసంత్ కుంజ్ లో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో నియామక పత్రాలు అందజేసిన న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్

Posted On: 22 NOV 2022 1:39PM by PIB Hyderabad
ఉపాధి కల్పనకు అత్యంత అధిక ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలన్న ప్రధాన మంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశలో భాగంగా దేశంలో ఈ రోజు 45 చోట్ల రోజ్ గార్ మేళాలు జరిగాయి. కొత్త ఉద్యోగాలు పొందిన 71,000 మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నియామక పత్రాలు. 
 
 
 న్యూఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌లోని సీఆర్ఫీఎఫ్  శౌర్య ఆఫీసర్స్ ఇన్‌స్టిట్యూట్‌లోని  జరిగిన  రోజ్‌గార్ మేళాలో  కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్‌పి సింగ్ బఘెల్పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొఫెసర్ సింగ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నేతృత్వంలో ప్రభుత్వం ప్రభుత్వం యువత సంక్షేమ కోసం అమలు చేస్తున్న  కార్యక్రమాలను వివరించారు. 
ఉద్యోగాలు పొందేందుకు సంస్థ నుంచి 224 మంది అర్హత సాధించారు. వీరికి ప్రొఫెసర్ సింగ్ నియామక పత్రాలు అందజేశారు. 
 
 
 
ఉద్యోగాలు పొందిన వారిని అభినందించిన కేంద్ర మంత్రి దేశానికి సేవ చేయడానికి పొందిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఉన్నత పదవులు పొందడానికి కృషి చేయాలని  అన్నారు.  రక్షణ, ఆర్థిక, విద్య, ఆరోగ్యం, రైల్వే, గృహ, విద్యుత్, జలవనరులు మొదలైన రంగాలలో అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు.
ప్రధానమంత్రి  ప్రసంగం ముగిసిన తర్వాత కొంతమంది అభ్యర్థులకు  మంత్రి స్వయంగా నియామక పత్రాలు అందించి వారితో మాట్లాడారు. 

 

 
కొత్తగా నియమితులైన వారు ప్రభుత్వంలో చేరి దేశానికి సేవ చేస్తారు. వారు దేశ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.  భారతదేశం@47 నిర్మాణానికి  సాక్షిగా ఉంటారు. వచ్చే ఏడాది కాలంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ప్రధానమంత్రి నిర్ణయించిన లక్ష్యం సాధించడానికి నిర్వహిస్తున్న రోజ్ గార్ కార్యక్రమాల్లో  ఈ రోజు  రోజ్ గార్ రెండవది (మొదటి  రోజ్ గార్ 22 అక్టోబర్ 2022న 50 ప్రాంతాల్లో జరిగింది).
 
***


(Release ID: 1878011) Visitor Counter : 117