సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మణిపురి సినిమా 50 వసంతాల వేడుకలు
'జ్యువెల్ సిటీ ఆఫ్ ఇండియా' గా గుర్తింపు పొంది, 8 ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ 53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈశాన్య రాష్ట్రాల సినిమా రంగానికి తగిన గుర్తింపు, ప్రచారం లభించేలా చేయనున్నది.
మణిపూర్ సినిమా రంగానికి 50 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. మణిపురి సినిమా చరిత్రకు అద్దం పట్టే విధంగా ఆసియాలో అతి పెద్ద చలన చిత్ర ఉత్సవంగా గుర్తింపు పొందిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహిస్తుంది. మణిపూర్ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఎంపిక చేసిన ఐదు ఫీచర్లు మరియు ఐదు నాన్-ఫీచర్ చిత్రాలు ఉత్సవం ఇండియన్ పనోరమా లో ప్రదర్శించబడతాయి. తొలి మణిపురి సినిమా 1972 ఏప్రిల్ 9న విడుదల అయ్యింది.తొలి మణిపురి సినిమా 'మాతంగి మణిపూర్' కు దేబ్ కుమార్ బోస్ దర్శకత్వం వహించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ ని మణిపూర్ చలన చిత్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత అరిబామ్ శ్యామ్ శర్మ దర్శకత్వం వహించిన ఇషానౌ ఫీచర్ ఫిలిం తరగతిలో, ప్రదర్శనతో; ఇతర చిత్రాలతో పాటుగా నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగంలో రతన్ థియామ్ దర్శకత్వం వహించిన ది మ్యాన్ ఆఫ్ థియేటర్ ప్రదర్శనతో మణిపురి చిత్రాల ప్రదర్శన ప్రారంభం అవుతుంది. ఈ రెండు చిత్రాలతో పాటు ఉత్సవంలో ప్రదర్శించే మిగిలిన చిత్రాలు మణిపూర్ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం, ఉత్కంఠ కలిగించే కథలు, నృత్యం, సంగీతం, సినీ సంప్రదాయాలను సినీ ఔత్సాహికులు ఆస్వాదించవచ్చు.
అరిబామ్ శ్యామ్ శర్మ, ఓకెన్ అమాక్‌చమ్, నిర్మలా చాను, బోరున్ తోక్‌చోమ్, రోమీ మెయిటీ వంటి మణిపురి చలనచిత్ర మార్గదర్శకులు 50 సంవత్సరాల మణిపురి సినిమా ప్రతినిధులుగా గోవా 53వ ఐఎఫ్‌ఎఫ్‌ఐ లో పాల్గొంటారు.
ఇషానౌ
ఇషానౌ చిత్రానికి అరిబామ్ శ్యామ్ శర్మ దర్శకత్వం వహించారు. తంఫా అనే మహిళ, ఆమె భర్త మరియు ఆమె పిల్లల చుట్టూ ఇషానౌ కథ తిరుగుతుంది. మైబిస్ తెగకు చెందిన మాతృస్వామ్య మత శాఖ తనను ఎంచుకున్నట్లు భావించి మైబి గురువును వెతకడానికి తంఫా తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లడంతో ఆకస్మిక మార్పు చోటుచేసుకుని వారి జీవితంలో అనూహ్య మార్పులు వస్తాయి.
బ్రోజేంద్రగీ లుహోంగ్బా
బ్రోజేంద్రగీ లుహోంగ్బా చిత్రానికి ఎస్.యెన్.చాంద్ సజాతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రోజేంద్ర అనే డాక్టర్ తన తల్లికి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, కానీ పెళ్లయిన తర్వాత ఆమె ముఖం చూడడు. తరువాత, ఒక సంగీత ప్రదర్శనలో బ్రోజేంద్ర ఒక అందమైన అమ్మాయి చూసి ఆమె పట్ల ఆకర్షితుడు అవుతాడు. అపరాధ భావంతో ఇంటికి తిరిగి కాచిన బ్రోజేంద్ర తాను చూసిన అమ్మాయి తన భార్య కావడంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు.
లోక్టాక్ లైరెంబీ
ఒక కవితాత్మక చిత్రంగా లోక్టాక్ లైరెంబీ చిత్రం రూపుదిద్దుకుంది. మణిపూర్‌లోని తేలియాడే సరస్సు ఆయిన లోక్‌తక్ సరస్సు స్థానికుల చుట్టూ కథ తిరుగుతుంది. అనుకోకుండా ఒక మత్స్యకారుడు ఒక ఆయుధాన్ని పొందుతాడు. ఆయుధాన్ని పొందిన మత్స్యకారుడు కొత్త విశ్వాసాన్ని పొందుతాడు. ఈ సంఘటన హింసకు హారి తీస్తుంది. లోక్టాక్ లైరెంబీ చిత్రానికి హౌబం పబన్ కుమార్ దర్శకత్వం వహించారు.
మాతమ్గి మణిపూర్
ఒక మధ్య తరగతి కుటుంబం జీవన విధానానికి మాతమ్గి మణిపూర్ అద్దం పడుతుంది. రిటైర్ అయిన టోన్సా, అతని ముగ్గురు పెద్దల పిల్లల కథ మాతమ్గి మణిపూర్.కుటుంబ సభ్యులు సమాజంలో కొత్త మరియు పాత విలువలకు తమ తమ అభిప్రాయాల మేరకు గౌరవిస్తారు. దీంతో వారి కుటుంబం విచ్ఛిన్నం అయినట్లు అనిపిస్తుంది, కానీ ఒకరినొకరు వారు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత సంతోషంగా కలిసి జీవించాలని నిర్ణయించుకుంటారు. మాతమ్గి మణిపూర్ చిత్రానికి దేబ్ కుమార్ బోస్ దర్శకత్వం వహించారు.
ఫిజిగి మణి
ఫిజిగి మణి చిత్రానికి ఓయినమ్ గౌతమ్ దర్శకత్వం వహించారు. ఫిజిగి మణి లో ప్రధాన పాత్ర యైఫాబి. తన కుటుంబాన్ని తిరిగి ఒక్కటిగా చేయాలన్న లక్ష్యంతో యైఫాబి బయలుదేరింది. ఆమె తన తల్లిదండ్రులకు మరియు వారిని విడిచి పెట్టిన తన సోదరుడు సనాజయోబాకు మధ్య బెడిసి కొట్టిన సంబంధాలు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది. మణిపూర్ సామాజిక-రాజకీయ పరిస్థితికి అద్దం పట్టే విధంగా గత మరియు ప్రస్తుత జీవన శైలిని చలన చిత్రం మన ముందుకు తెస్తుంది.
రతన్ థియం: ది మ్యాన్ ఆఫ్ థియేటర్
ఈ చిత్రం మణిపూర్‌లోని కోరస్ రిపర్టరీ థియేటర్ వ్యవస్థాపకుడు-దర్శకుడు రతన్ థియామ్ జీవితం ఆధారంగా రూపొందింది. రతన్ థియం ప్రఖ్యాత మణిపురి కవి, నాటక రచయిత, చిత్రకారుడు, సంగీతకారుడు, రంగస్థల గురువు. 2013-2017 వరకు ప్రతిష్టాత్మక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్‌పర్సన్‌గా రతన్ థియం పనిచేశారు. 1987 నుండి 1989 వరకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డైరెక్టర్‌గా కూడా రతన్ థియం వ్యవహరించారు. ఈ చిత్రానికి ఓకెన్ అమక్చమ్ మరియు నిర్మలా చాను దర్శకత్వం వహించారు.
ఇలిషా అమగి మహావో
నేషనల్ అకాడమీ అవార్డు గెలుచుకున్న ఎన్ కుంజమోహన్ రచించిన చిన్న కథ ఆధారంగా ఇలిషా అమగి మహావో రూపొందింది. చావోబా నదిలో చేపలు పట్టడం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చావోబా కష్టపడతాడు. చాలా రోజుల తర్వాత చావోబా మరియు అతని కొడుకు హిల్సా ను పట్టుకుంటారు. హిల్సా కూర వండడానికి సంతోషంగా ఇంటికి వస్తారు. కానీ చావోబా తన వేట అమ్మి కొంత బియ్యం కొనవలసి వస్తుంది. ఈ చిత్రానికి నింగ్‌థౌజ లాంచా దర్శకత్వం వహించారు.
లుక్ ఎట్ ది స్కై
ఎన్నికల సమయంలో జనాదరణ పొందిన అభ్యర్థికి మద్దతు ఇవ్వనందుకు గ్రామస్తులచే బహిష్కరించబడిన మణిపూర్‌లోని మారుమూల గ్రామంలో 40 ఏళ్ల గ్రామస్థుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇబ్బందులు ఎదురైనప్పటికీ హై తన వ్యక్తిగత ఓటు హక్కు కోసం పోరాడుతాడు. తనకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుంటాడు. ఈ చిత్రానికి అశోక్ వీలూ దర్శకత్వం వహించారు.
ది సైలెంట్ పోయెట్
ది సైలెంట్ పోయెట్ చిత్రానికి బోరున్ థోక్‌చోమ్ దర్శకత్వం వహించారు. ‘ఆత్మహత్యకు ప్రయత్నించినందుకు’ మణిపూర్‌లో అత్యంత కట్టుదిట్ట కాపలా ఉన్న ఆసుపత్రి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిలా చాను రాసిన కవితల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
ది టైంటెడ్ మైనర్
పాఠశాలకు వెళ్తున్న కుర్రాడు తన స్నేహితురాలు సనాను జట్టు కెప్టెన్‌గా ఫుట్‌బాల్ కోచ్ చేయడంతో అసూయపడతాడు. సనాకు రసాయనాలు కలిపి తినడానికి కూరగాయలు ఇచ్చి నేరానికి పాల్పడతాడు. కూరగాయలు తిన్న సనా మరుసటి రోజు . ఇవ్వడం ద్వారా చెడు చర్యలో మునిగిపోయాడు మరియు మరుసటి రోజు సనా కనిపించదు. . ఈ చిత్రానికి రోమి మైతే దర్శకత్వం వహించారు.
****
(Release ID: 1877805)
Visitor Counter : 183