సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా 'మెగాస్టార్' చిరంజీవి
53 వ ఐఎఫ్ఎఫ్ఐ లో జీవన సాఫల్య అవార్డు స్వీకరించనున్న చిరంజీవి
సినిమా నిర్మాణ, నిర్మాణ అనంతర కార్యక్రమాలకు భారతదేశం కేంద్రంగా అభివృద్ధి చెందాలి.. శ్రీ అనురాగ్ ఠాకూర్
వసుధైక కుటుంబం స్పూర్తితో ఐఎఫ్ఎఫ్ఐ నిర్వహణ.
ప్రతి ఏడాది నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల వరకు ' 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో' నిర్వహణ
Posted On:
20 NOV 2022 7:34PM by PIB Hyderabad
ప్రముఖ తెలుగు నటుడు శ్రీ చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా గుర్తించామని కేంద్ర సమాచార ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ రాకూర్ ప్రకటించారు. చలన చిత్ర రంగానికి శ్రీ చిరంజీవి అందించిన సేవలకు గుర్తింపుగా జీవన సాఫల్య అవార్డు బహూకరిస్తామని శ్రీ ఠాకూర్ ప్రకటించారు. 53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభ వేడుకల్లో శ్రీ ఠాకూర్ చిరంజీవికి జీవన సాఫల్య అవార్డు ప్రధానం చేస్తామని అన్నారు. చిరంజీవి నాలుగు శతాబ్దాలుగా చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. 150కి పైగా చిత్రాల్లో చిరంజీవి నటించారని శ్రీ ఠాకూర్ అన్నారు.
' చిరంజీవి గుర్తింపు పొందిన భారతీయ నటుడు, డాన్సర్, చలన చిత్ర నిర్మాత, పరోపకారి, ఒక రాజకీయవేత్త. ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించిన చిరంజీవి హిందీ, కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించారు' అని శ్రీ ఠాకూర్ వివరించారు. పద్మభూషణ్, రఘుపతి వెంకయ్య అవార్డు, నంది లాంటి అనేక అవార్డులను చిరంజీవి అందుకున్నారని తెలిపిన . ప్రేక్షకుల అభిమానం చిరంజీవికి మెగాస్టార్ గుర్తింపు తెచ్చిందని శ్రీ ఠాకూర్ అన్నారు.
1978లో 'పందిరిల్లు' సినిమాతో చిరంజీవి చలన చిత్ర రంగంలో ప్రవేశించారు. 1982 లో చిరంజీవి ' ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో సామాన్య ప్రజల హీరోగా మారారు. సినిమాల్లో చిరంజీవి డాన్సులు, ఫైటింగ్ దృశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి. వివిధ సంస్థల ద్వారా చిరంజీవి సమాజానికి సేవలు అందిస్తున్నారు. 1998లో ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నెలకొల్పారు.
తొమ్మిది రోజుల పాటు జరిగే చలన చిత్రోత్సవాలను కేంద్ర సమాచార,ప్రసార, యువజన వ్యవహారాలు,క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సినిమా నిర్మాణ, నిర్మాణ అనంతర కార్యక్రమాలకు భారతదేశం కేంద్రంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని శ్రీ ఠాకూర్ తన ప్రారంభ ఉపన్యాసంలో పేర్కొన్నారు. దేశంలో అపారంగా ఉన్న శక్తి సామర్ధ్యాలు, వినూత్నంగా ఆలోచించే మేధస్సు, పరిశ్రమ సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటామని శ్రీ ఠాకూర్ ప్రకటించారు. ' ఐఎఫ్ఎఫ్ఐ ఒక కార్యక్రమ నిర్వహణకు పరిమిత కాకూడదు. భారతదేశం తన స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఐఎఫ్ఎఫ్ఐ తన కార్యక్రమాలను విస్తృతం చేయాలి. అమృత్ మహోత్సవ్ నుంచి అమృత కాలంలోకి భారతదేశం అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ ఉత్సవాలను పెద్ద సంఖ్యలో నిర్వహించి సినిమా రూపకల్పన, నిర్మాణం రంగాల్లో భారతదేశం ప్రపంచంలో అగ్ర స్థానంలో సాధించాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది" అని శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ వివరించారు.
తాను స్వయంగా రూపొందించిన ' 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో' కార్యక్రమం కార్యాచరణ ప్రణాళికను శ్రీ ఠాకూర్ వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది ఒక ఆలోచన శక్తిని గుర్తిస్తుందని శ్రీ ఠాకూర్ తెలిపారు. ఆలోచనలకు పదును పెట్టి తమ లక్ష్యాలు, ఆశయాలు సాధించేలా యువతను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రసార సమాచార మంత్రిత్వ శాఖ ' 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
వసుధైక కుటుంబం స్ఫూర్తిగా ఐఎఫ్ఎఫ్ఐ :
తన ప్రసంగంలో శ్రీ ఠాగూర్ ఆసియాలో అతిపెద్ద చలన చిత్ర ఉత్సవంగా గుర్తింపు పొందిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల చరిత్రను ప్రస్తావించారు. 1952 నుంచి అంతరాయం లేకుండా వసుదైక కుటుంబం స్పూర్తితో నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రపంచం ఒక కుటుంబంలా శాంతితో పరిఢవిల్లాలి అన్నది భారతదేశ ఆకాంక్ష అని మంత్రి వ్యాఖ్యానించారు. ' ఒక ప్రపంచం, ఒక కుటుంబం, అందరికి ఉజ్వల భవిష్యత్తు అన్నది జీ 20 అధ్యక్ష హోదాలో పనిచేస్తున్న భారతదేశం సిద్ధాంతమని శ్రీ ఠాకూర్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తమ ప్రభుత్వం లక్ష్య సాధన దిశలో సాగుతున్నదని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన విధంగా 53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమ, ప్రపంచ సినిమా, నివాళులు, గత స్మృతులు విభాగాలతో పాటు భారత చిత్రాల ప్రీమియర్ ప్రదర్శన, విదేశీ చిత్రాలు, ఓటీటీ వేదికలు నిర్మించిన కొత్త సిరీస్ లను ప్రదర్శిస్తామని శ్రీ ఠాకూర్ వివరించారు. చిత్ర నిర్మాణానికి సహకరించిన నటులు కూడా ఉత్సవంలో పాల్గొంటారు. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ప్రముఖ నటుడు ఈ ఉత్సవంలో పాల్గొంటారని అన్నారు. జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఫిల్మ్ బజార్ పెవిలియన్‌లు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ మల్టీమీడియా ఎగ్జిబిషన్ మరియు '75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో' కోసం 53-గంటల ఛాలెంజ్ లాంటి అనేక ఇతర కార్యక్రమాలు ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు.
ఆస్ట్రియా దేశానికి చెందిన "అల్మా ఆస్కార్"తో ప్రదర్శనతో చలన చిత్రోత్సవాలు ప్రారంభం కావడం పట్ల శ్రీ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సత్యజిత్‌రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును గెలుచుకున్నందుకు ప్రముఖ స్పానిష్ చిత్ర నిర్మాత కార్లోస్ సౌరాను మంత్రి అభినందించారు. "శ్రీ. సౌరా 6 దశాబ్దాలకు పైగా సినిమాలు తీస్తున్నారు. 90 సంవత్సరాల వయస్సులో కూడా చలన చిత్ర రంగంలో సౌరా చురుకుగా కొనసాగుతున్నారు. సౌరా తన జీవితకాలంలో అనేక అవార్డులు మరియు నామినేషన్లను గెలుచుకున్నారు. సౌరా తరఫున ఆయన కుమార్తె అన్నా సౌరా అవార్డును 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో స్వీకరిస్తారు.' అని ఠాకూర్ అన్నారు. ఐఎఫ్ఎఫ్ఐ తో పాటు నిర్వహిస్తున్న ఫిల్మ్ బజార్ ప్రాధాన్యతను శ్రీ ఠాకూర్ వివరించారు. “ప్రపంచ సినిమా రంగం అనుసంధానానికి ఫిల్మ్ బజార్ ఒక గొలుసుగా పనిచేస్తుంది. 'సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ' లో కీలకమైన లింక్ గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు ఫిల్మ్ బజార్ ద్వారా ఒక వేదికపైకి వస్తారు. చలనచిత్ర నిర్మాణం, పంపిణీలో అన్ని దేశాలు ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు దీనివల్ల ప్రయోజనం పొందుతాయి. చిత్ర నిర్మాతలకు తమ పనిని పరిచయం చేయడానికి మరియు వారి చిత్రాలలో చిత్రీకరించబడిన అంశాలను లోతుగా చర్చించడానికి ఫిలిం బజార్ ఒక ప్రత్యేక వేదిక అందిస్తుంది,' అని శ్రీ ఠాకూర్ వివరించారు. “మొదటిసారిగా, ఐఎఫ్ఎఫ్ఐ కంట్రీ పెవిలియన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఫిల్మ్ బజార్ పరిధిని పెంచింది. 15వ ఫిల్మ్ బజార్ లో 40కి పైగా పెవిలియన్‌లు ఏర్పాటు అయ్యాయి. సినిమా ప్రపంచం నుండి సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించడానికి తొలిసారిగా ఐఎఫ్ఎఫ్ఐ లో ఒక టెక్నాలజీ హబ్ కూడా ఏర్పాటు అయ్యింది ”అని మంత్రి వివరించారు.
ఐఎఫ్ఎఫ్ఐ విభిన్న అవకాశాలు అందిస్తుందని శ్రీ ఠాకూర్ అన్నారు. చలన చిత్ర రంగం, మీడియా, వినోద రంగాల్లో పనిచేస్తూ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మహిళలను ఐఎఫ్ఎఫ్ఐ గుర్తించి గౌరవిస్తుందని శ్రీ ఠాకూర్ అన్నారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగిన మహిళలు తమ నైపుణ్యాలను ఐఎఫ్ఎఫ్ఐ వేదికగా ప్రదర్శిస్తారన్న ఆశాభావాన్ని శ్రీ ఠాకూర్ వ్యక్తం చేశారు. ఐఎఫ్ఎఫ్ఐ మహిళా దర్శకులు, రచయిత్రులు, నటీమణులు, కళాకారులకు ప్రత్యేక స్థానం కల్పించి ప్రోత్సహిస్తుందని శ్రీ ఠాకూర్ హామీ ఇచ్చారు.
చిత్రోత్సవాలను అన్ని వర్గాలు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీ ఠాకూర్ వివరించారు. దీనిలో భాగంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. దివ్యాంగుల ప్రత్యేక అవసరాలు దృష్టిలో ఉంచుకుని దృశ్య శ్రవణ విధానంలో చిత్రాలు ప్రదర్శిస్తారని శ్రీ ఠాకూర్ తెలిపారు. స్మార్ట్ ఫోన్ ఫిల్మ్ మేకింగ్, స్క్రీన్ యాక్టింగ్ అంశాల్లో దివ్యాంగుల కోసం ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కోర్సులు ప్రారంభిస్తుందని శ్రీ ఠాకూర్ ప్రకటించారు.
*****
(Release ID: 1877588)
Visitor Counter : 280