అంతరిక్ష విభాగం
భారత దేశపు తొలి ప్రైవేటు విక్రమ్ సబ్ ఆర్బిటల్ (వికెఎస్ ) రాకెట్ ను ఈరోజు విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించిన ఇస్రో
ఈ ప్రయోగదృశ్యాన్ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటనుంచి తిలకించిన కేంద్ర సైన్స్,
టెక్నాలజీ, ప్రధానమంత్రి కార్యాలయ శాఖ, అణుఇంధనం, అంతరిక్షశాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశపు అంతరిక్ష ప్రయాణంలో నూతన ముందడుగుగా అభివర్ణించిన డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశపు స్టార్టప్ ఉద్యమానికి ఇది ఒక మేలు మలుపు
Posted On:
18 NOV 2022 3:52PM by PIB Hyderabad
భారతదేశపు తొట్టతొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతం అయిన అనంతరం కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పందిస్తూ, ––కంగ్రాచులేషన్స్ ఇండియా, భారత అంతరిక్ష ప్రయాణానికి నూతన ఆరంభం . అంతరిక్ష రంగంలో పబ్లిక్–ప్రైవేటు పాల్గొనేందుకు అవకాశం కల్పించి ఈ కృషిని విజయవంతం చేసేందుకు తోడ్పడినందుకు నరేంద్రమోడీగారికి ధన్యవాదాలు.
స్టార్టప్ ఉద్యమానికి ఇదొక టర్నింగ్ పాయింట్,ఇస్రోకు అభినందనలు. ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిన ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది.’’అంటూ జితేంద్ర సింగ్ తన ప్రతిస్పందనను తెలియజేశారు. ఈ ప్రయోగ కార్యక్రమాన్ని జితేంద్ర సింగ్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట నుంచి వీక్షించారు.
అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి వీలు కల్పిస్తూ 2020లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించిన తర్వాత ఇస్రో ప్రయాణంలో ఇదో గొప్ప మైలు రాయి అని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు.
మిషన్ ప్రారంభ్ విజయవంతంగా పూర్తి అయింది అని ఇస్రొ పేర్కొంది. స్కైరూట్ ఎయిరో స్పేస్ దీనిపై స్పందిస్తూ‘‘విక్రమ్ ఎస్ , తొట్టతొలి ప్రైవేట్ రాకెట్గా చరిత్ర సృష్టించింది’’అని పేర్కొంది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), భారతదేశ తొలి ప్రైవేటు విక్రమ్ –సబ్ఆర్బిటల్ (వికెఎస్ ) రాకెట్ను విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది.
కేంద్ర శాస్త్ర , విజ్ఞాన, ప్రధానమంత్రి కార్యాలయ శాఖ, అణుఇంధనం,అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ప్రయోగ మహాద్భుత దృశ్యాన్ని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోటనుంచి స్వయంగా వీక్షించారు.ఈ సందర్భంగా ఇస్రో బృందానికి, ఇండియన్ స్పేస్ టెక్ స్టార్టప్, స్కైరూట్ ఎయిరో స్పేస్ బృందానికి అభినందనలు తెలుపుతూ, డాక్టర్ జితేంద్ర సింగ్,“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో చరిత్రాత్మక, కీలక ఘట్టం , భారతదేశ స్టార్టప్లకు ఇది ఒక మలుపు, ఇస్రోకు ఒక వినూత్న ప్రారంభం”తొట్టతొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ –ఎస్ అంతరిక్షంలోకి చేరింది ఆని ఆయన అన్నారు.
ఇస్రో అంతరిక్ష ప్రయోగాల విజయప్రస్థానం ఖాతాలో మరో విజయం వచ్చి చేరిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.ఇది 75 సంవత్సరాల
స్వతంత్ర భారత చరిత్రలో ఒక కొత్త మైలురాయిని సృష్టించిందని అన్నారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ప్రయోగం, ఇండియాను ప్రపంచ అంతరిక్ష శక్తుల సరసన చేర్చిందని,
ఎన్నో దేశాలు భారత నైపుణ్య సేవలను అందిపుచ్చుకునేందుకు ముందుకువ స్తాయని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
రెండు సంవత్సరాల క్రితం అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం పాల్గొనేందుకు తలుపులు తెరిచిన నేపథ్యంలో
చోటుచేసుకున్న కీలక పరిణామంగా ఈ ప్రయోగాన్ని ఆయన అభివర్ణించారు.
విక్రమ్ –ఎస్ అనేది సింగిల్ స్టేజ్ ఫ్యూయల్ రాకెట్ అని , వచ్చే ఏడాది విక్రమ్ –1 ను ప్రయోగించనున్న నేపథ్యంలో స్కై రూట్ ఎయిరో స్పేస్ ప్రాజెక్టు కు సంబంధించిన వివిధ వ్యవస్థలు, ప్రాసెస్లను పరీక్షించేందుకు ఉద్దేశించినదని జితేంద్ర సింగ్ అన్నారు.ఈ రాకెట్ గరిష్ఠంగా 81.5 కిలోమీటర్ల వరకు వెళ్లి సముద్రంలో పడిపోతుందని, దీని ప్రయోగ సమయం 300 సెకండ్లు మాత్రమే నని ఆయన అన్నారు. ఇస్రోతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న తొలి స్టార్టప్ స్కై రూట్ అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ఇది దేశ తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగమే కాక , స్కైరూట్ ఎయిరో స్పేస్ కు ఇది తొలి మిషన్. ఈ మిషన్ పేరు ప్రారంభ్.
మిషన్ ప్రారంభ్ విజయవంతం అయినట్టు ఇస్రో వెల్లడించింది. స్కై రూట్ ఎయిరో స్పేస్ సంస్థ స్పందిస్తూ విక్రమ్ –ఎస్
ఇండియాలో తొలి ప్రైవేట్ రాకెట్గా చరిత్ర సృష్టించిందని తెలిపింది. ఇది మూడు పే లోడ్ లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.
ఇందులో ఒకటి విదేశీ కస్టమర్లకు సంబంధించినది.
ఈ ప్రయోగం అనంతరం మీడియా తో మాట్లాడుతూ డాక్టర్ జితేంద్ర సింగ్, ఇస్రో తొలి ఛైర్మన్ విక్రమ్ సారాభాయ్ కన్నకలలు నెరవేరుతున్నాయని, చిన్న వ్యవస్థతో ప్రారంభమైన భారత అంతరిక్ష ప్రయోగాలు ఇవాళ అత్యద్భుత స్థాయికి చేరాయని అన్నారు. జాతీయ స్థాయిలో ఇస్రో అర్థవంతమైన పాత్ర పోషించాలని విక్రమ్ సారాభాయ్ ఎప్పుడూ చెబుతూఉండేవారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 8 సంవత్సరాలలో ఇది రుజువైందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ప్రతిభావంతులైన భారతదేశ యువత అవకాశాల కోసం ఎదురుచూస్తున్నదని, వారు తమ శక్తియుక్తులన్నీ ఉపయోగించి రాణించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు.ఇండియాలో అద్భుతమైన ప్రతిభ కలవారు ఉన్నారని, అంటూ,గొప్ప గొప్ప ఆలోచనలతో ముందుకు పోతున్నారని, వారికి అద్భుత అవకాశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏర్పరచారని ఆయన అన్నారు.
అంతరిక్ష రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు స్టార్టప్ ల వినూత్న శక్తి సామర్ధ్యాలను వెలికి తీశాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. స్వల్ప వ్యవధిలోనే కొన్ని స్పేస్ స్టార్టప్లు గణనీయంగా పెరిగాయని చెప్పారు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం కేవలం ఒకటి రెండు స్పేస్ స్టార్టప్లు ఉండగా ప్రస్తుతం అవి 102 కు చ ఏరాయని , అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్నాయని అన్నారు. అంతరిక్ష వ్యర్థాల తొలగింపు, నానో ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాలు, భూతల వ్యవస్థలు, అంతరిక్ష పరిశోధన తదితర రంగాలలో ఇవి పనిచేస్తున్నాయన్నారు. భారతదేశ సైన్సు, టెక్నాలజీ ఆవిష్కరణల సామర్ధ్యం విషయంలో ఇండియాకు ఒక ప్రత్యేక గుర్తింపును ప్రధానమమంత్రి తీసుకువచ్చారని
ఆయన అన్నారు. మన స్టార్టప్లకు మంచి డిమాండ్ ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.ప్రపంచం మొత్తం ఇండియావైపు చూస్తున్నదని,
దీనినొక ప్రేరణాత్మక ప్రాంతంగా భావిస్తున్నదని అన్నారు. చిన్న చిన్నదేశాలు తమ సామర్ధ్యాలు పెంచుకునేందుకు,
నానో ఉపగ్రహాలతో సహా ఉపగ్రహాల నిర్మాణానికి ఇండియా తోడ్పడుతుండడం ఇందుకు కారణమన్నారు.
***
(Release ID: 1877271)
Visitor Counter : 290