గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఇఎంఆర్ఎస్‌ల ఉపాధ్యాయులు, విద్యార్ధులకు శిక్షణనిచ్చేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబుల్ స్టూడెంట్స్ (ఎన్ఇఎస్‌టిఎస్), 1ఎం1బి ఫౌండేషన్
Posted On:
18 NOV 2022 2:10PM by PIB Hyderabad
ఈ కార్యక్రమం వర్చువల్ రియాలిటీ (విఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్) నైపుణ్యాల రంగంలో శిక్షణనిస్తుంది
పైలట్ దశలో అవగాహనా పత్రంలో భాగంగా రాజస్థాన్, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల ఇఎంఆర్ఎస్‌లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఇఎస్‌టిఎస్ - గిరిజన విద్యార్ధులకు జాతీయ విద్యా సంస్థ), గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేసిన స్వయంప్రతిపత్తి సంస్థ 1ఎం1బి ఫౌండేషన్ మధ్య న్యూఢిల్లీలోని ఎన్ఇఎస్‌టిఎస్ కేంద్ర కార్యాలయంలో 7 నవంబర్ 2022న అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. 1ఎం1బి, ఎన్ఇఎస్‌టిఎస్ బృందం సమక్షంలో ఎన్ఇఎస్‌టిఎస్ కమిషనర్ శ్రీ అసిత్ గోపాల్, 1ఎం1బి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మానవ్ సుబోధ్‌లు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమం సిబిఎస్ఇ ప్రారంభించిన ఎఆర్-విఆర్ నైపుణ్యాల పాఠ్యాంశాలను ఉపయోగించి ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్), వర్చువల్ రియాలిటీ (విఆర్) నైపుణ్యాలను కలిగి ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్ధులకు సామర్ధ్యాన్ని అందిస్తుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఇఎంఆర్ఎస్) ఉపాధ్యాయులు, విద్యార్ధులకు శిక్షణ, సామర్ధ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఈ ప్రోగ్రాం లక్ష్యంగా ఉన్నాయి.
పైలట్ దశలో అవగాహనా పత్రంలో భాగంగా రాజస్థాన్, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల ఇఎంఆర్ఎస్‌లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
పైలట్ దశలో అవగాహనా పత్రంలో భాగంగా రాజస్థాన్, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల ఇఎంఆర్ఎస్‌లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
పైలట్ దశలో అవగాహనా పత్రంలో భాగంగా రాజస్థాన్, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల ఇఎంఆర్ఎస్‌లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
1 మిలియన్ ఫర్ 1 బిలియన్(1ఎం1బి) సంస్థ బెంగుళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ. ఇది ఐక్యరాజ్య సమితి ఆర్ధిక, సామాజిక మండలి (ఇసిఒఎస్ఒసి) కి ప్రత్యేక సంప్రదింపు హోదాను కలిగిన ఐరాస గుర్తింపును కలిగి ఉంది. దానితో పాటుగా యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌తో అనుబంధాన్ని కలిగి ఉంది. నీతీ ఆయోగ్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ దర్పన్ పోర్టల్‌తో ఒక విశ్వసనీయ నమోదిత సంస్థ. ఇది ఐక్యరాజ్య సమితి నిలకడైన అభివృద్ధి లక్ష్యాలు(ఎస్‌డిజి)లుకి అనుగుణంగా సామాజిక ఆవిష్కరణ, భవిష్యత్తు నైపుణ్యాలకు సంబంధించిన చొరవ.
భారత్ మెటావర్స్ నిర్మాణంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్), వర్చువల్ రియాలిటీ (విఆర్) సృష్టికర్తలు అయ్యేందుకు, అభివృద్ధి చెందే సాంకేతికతలను అందిస్తున్న ప్రపంచాన్ని ఉపాధ్యాయులు, విద్యార్ధులు అర్థం చేసుకునే సామర్ధ్యాన్ని ఇవ్వడం ద్వారా దేశ నిర్మాణంలో అమలు ఏజెన్సీ అయిన 1ఎం1బి భాగస్వామ్యంతో ఇఎంఆర్ఎస్‌ల విద్యార్ధులను నిమగ్నం చేయాలన్నది ఎన్ఇఎస్‌టిఎస్ లక్ష్యం. ఎన్ఇపి 2020కి అనుగుణంగా, దేశం కోసం మానవ మౌలిక సదుపాయాల వనరును పెంచేలా నిమగ్నంచేసే, దృశ్యమానమైన అనుభవాత్మక అభ్యాసానికి ఇఎంఆర్ఎస్‌ల విద్యార్ధులను బహిర్గతం చేయడంలో ఈ సహకారం అత్యంత దోహదపడుతుందని విశ్వాసం.
***
(Release ID: 1877049)
Visitor Counter : 230