రైల్వే మంత్రిత్వ శాఖ
భారత్ గౌరవ్ రైళ్ల పథకం కింద ఎల్‌హెచ్‌బీ బోగీలను మాత్రమే భారతీయ రైల్వేలు ఇకపై కేటాయిస్తాయి
Posted On:
16 NOV 2022 4:47PM by PIB Hyderabad
మెరుగైన నాణ్యతగల రైలు బోగీలు, ఆకర్షణీయ పర్యాటక ప్యాకేజీలను అందించడం ద్వారా రైలు ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారత్ గౌరవ్ రైళ్ల పథకంలో మార్పులు జరిగాయి.
సవరించిన విధానంలోని ముఖ్యాంశాలు:
- ఇకపై, భారత్ గౌరవ్ రైళ్ల పథకం కింద లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) బోగీలను మాత్రమే కేటాయిస్తారు.
- రైలు పర్యాటకానికి ప్రోత్సాహం, ఫలితాల సాధ్యతను దృష్టిలో పెట్టుకుని, ఈ పథకం కింద భారత్ గౌరవ్ రైళ్ల నిర్వహణ కోసం స్థిర, చర రవాణా రుసుముల్లో ఓవర్‌హెడ్ కాంపోనెంట్‌లను విధించకూడదని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనివల్ల, భారత్ గౌరవ్ రైళ్ల పథకం కింద రైలు పర్యాటకం ప్రోత్సాహానికి భారత రైల్వేల ద్వారా సుమారు 33% రాయితీ దక్కుతుంది.
- భారత్ గౌరవ్ రైళ్ల విధానం కింద ఇప్పటికే ఐసీఎఫ్ బోగీల కేటాయింపు పొందిన సేవా ప్రదాతలు, సవరించిన రుసుముల ప్రయోజనం పొందేందుకు ఒప్పందంలో మిగిలిన కాలానికి ఎల్‌హెచ్‌బీ బోగీలకు మారే అవకాశం ఇస్తారు. ఇప్పటికే కేటాయించిన బోగీలనే కొనసాగించాలని వాళ్లు నిర్ణయించుకుంటే, సవరించిన రుసుముల ప్రయోజనం భవిష్యత్తులో అందుబాటులో ఉంటుంది.
- సవరించిన రుసుములపై ఒక ప్రకటన వెలువడింది.
****
(Release ID: 1876628)
Visitor Counter : 123