పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్వాలియర్-ముంబై-గ్వాలియర్ విమానాన్ని ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా


● ఈ మార్గం లో వారానికి నాలుగుసార్లు ఇండిగో విమానాలు

● ఇది నవంబర్ 15 నుండి ఆర్థిక రాజధాని ముంబై ని సాంస్కృతిక నగరం గ్వాలియర్ తో కలుపుతుంది

Posted On: 15 NOV 2022 7:49PM by PIB Hyderabad

పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు ముంబై నుండి గ్వాలియర్ కు నేరుగా విమాన మార్గాన్ని ప్రారంభించారు.

 

ఈ కొత్త మార్గం ఆపరేషన్ కనెక్టివిటీని పెంపొందిస్తుంది. ఈ నగరాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ క్రింది షెడ్యూలు ప్రకారం రెండు నగరాల మధ్య విమానాలు నడుస్తాయి:

 

ఫ్లయిట్ నెం.

నుండి

వరకు

ఫ్రీ క్వెన్సి

 

బయలు

దేరు సమయం

వచ్చు సమయం

 

విమానం

నుండి ప్రారంభం

 

6ఇ 276

ముంబై

గ్వాలియర్

1246

12:10

14:10

ఎయిర్ బస్

15 - 30

నవంబర్ 2022

6ఇ 265

గ్వాలియర్

ముంబై

1246

14.45

16:45

 

 

6ఇ 276

ముంబై

గ్వాలియర్

2346

12:10

14:10

ఎయిర్ బస్

15- 30

డిసెంబరు

6ఇ 265

గ్వాలియర్

ముంబై

2346

14.45

16.45

 

2022

 

 

పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా తన ప్రారంభోపన్యాసంలో, భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై , చరిత్ర , సంస్కృతి భాండాగారమైన గ్వాలియర్ నగరం మధ్య వైమానిక కనెక్టివిటీని ప్రారంభించడం, వైమానిక సేవల ద్వారా దేశంలోని ప్రతి మూలను అనుసంధానించాలనే ప్రధాన మంత్రి దార్శనికత దిశగా ఒక పెద్ద ముందడుగు అని అన్నారు.

 

పారిశ్రామికీకరణకు కేంద్ర బిందువుగా గ్వాలియర్ పెరుగుతున్న సామర్థ్యాన్ని మంత్రి ప్రస్తావిస్తూ, కొత్త విమాన మార్గం

పౌరులకు సమయాన్ని ఆదా చేసే ప్రయాణ ఎంపికను అందించడంతో పాటు ఉపాధి, పరిశ్రమల ఏర్పాటుకు కొత్త అవకాశాలను ప్రోత్సహిస్తుందని  అన్నారు.

 

ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ , కేంద్ర పౌర,  విమాన యాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ప్రయత్నాలు దేశంలో పౌర విమానయాన సదుపాయాలను పెంపొందించాయని అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య పెరిగిపోతోందని, ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల ఆధునీకరణ పనులు

జరుగుతున్నాయని ఆయన అన్నారు. గ్వాలియర్ విమానాశ్రయాన్ని కూడా ఒక కొత్త పద్ధతి లో నిర్మిస్తున్నామని, ఇది మన అందరికీ ఒక విజయం అని శ్రీ తోమర్ అన్నారు.గ్వాలియర్ - ముంబై మధ్య ఈ కొత్త విమానాలను ప్రారంభించడం వల్ల గ్వాలియర్ అభివృద్ధి , వ్యాపార సంబంధాలకు ప్రేరణ లభిస్తుందని ఆయన అన్నారు.

 

ప్రారంభోత్సవానికి మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్, ఎంపీ ప్రభుత్వ జలవనరుల శాఖ మంత్రి  శ్రీ. తులసీ సిలావత్, ఎంపీ ప్రభుత్వ  ఉద్యాన, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ భరత్ సింగ్ కుష్వాహ్, ఎంపీ లోక్ సభ సభ్యులు శ్రీ వివేక్ నారాయణ్ షెజ్వాల్కర్, శ్రీ గోపాల్ చిన్నయ్య శెట్టి, శ్రీ అరవింద్ గణపత్ సావంత్. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్, ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ అడ్వైజర్ శ్రీ ఆర్.కె.సింగ్, ఎంఒసిఎ, ఇండిగో, ముంబై , గ్వాలియర్ నుండి స్థానిక సంస్థలకు చెందిన ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

******


(Release ID: 1876294) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Marathi , Hindi