శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశం వైద్య పరికరాలను ప్రపంచ ధరలో 1/3 వంతుకే ఉత్పత్తి చేస్తోంది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
15 NOV 2022 4:18PM by PIB Hyderabad
తిరువనంతపురంలోని చిత్రా ట్రియునల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంబైన్డ్ డివైజెస్ బ్లాక్ ను మంత్రి ప్రారంభించారు.
ప్రాణాలను కాపాడే హై రిస్క్ వైద్య పరికరాలను తయారు చేసే ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలలో భారతదేశం ఒకటి:
చిత్రా ఇన్ స్టిట్యూట్ లోని కంబైన్డ్ డివైజెస్ బ్లాక్ ఫార్మాస్యూటికల్స్ , మెడికల్ డివైజ్ ల కలయికకు ఒక ఖచ్చితమైన ఉదాహరణ, దీనిని తప్పనిసరిగా సంస్థాగతీకరించాలి:
ప్రైవేట్ పరిశ్రమ ఒక సమాన వాటాదారుగా మారి, మొదటి నుండి ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెడితేనే. జీవన సౌలభ్యానికి పరిశోధన - అభివృద్ధి విజయవంతం:
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రాణాలను కాపాడే హై రిస్క్ వైద్య పరికరాలను తయారు చేసే ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలలో భారతదేశం ఒకటి అని, అయితే, మన పరికరాల ఖర్చు మిగిలిన నాలుగు దేశాలు తయారు చేసిన వాటిలో మూడింట ఒక వంతు అని అన్నారు.
చిత్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంబైన్డ్ డివైజెస్ బ్లాక్ ను ప్రారంభించిన అనంతరం అధ్యాపకులను, విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కృత్రిమ గుండె వాల్వ్, హైడ్రోసెఫాలస్ షంట్, ఆక్సిజనేటర్, డ్రగ్ ఎలూటింగ్ ఇంట్రా యుటెరిన్ పరికరం వంటి సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాలు యుఎస్ఎ, జపాన్, బ్రెజిల్ , చైనా వంటి మూడు - నాలుగు దేశాలలో మాత్రమే తయారు అవుతున్నాయని అన్నారు.
దేశీయ తయారీ ప్రపంచ శ్రేణి వైద్య పరికరాలు దిగుమతి చేసుకున్న అవే వాటితో పోలిస్తే నాలుగింట ఒక వంతు నుండి మూడింట ఒక వంతు ధరకు భారతీయ రోగులకు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
వైద్య పరికరాలతో పాటు వైద్య నిర్వహణలో స్వావలంబన సాధించాలనే ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ దార్శనికతను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన నొక్కిచెప్పారు.
గ్లోబల్ హార్మోనైజేషన్ టాస్క్ ఫోర్స్ (జి హెచ్ ఎఫ్ టి) ఫ్రేమ్ వర్క్ కు , ఉత్తమ అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా 2017 లో మెడికల్ డివైజెస్ నిబంధనలను నోటిఫై చేసింది ప్రధాని మోదీయే అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కొత్త నియమాలు భారతదేశంలో తయారు చేయడానికి, నియంత్రణా పరమైన అడ్డంకులను తొలగించడానికి, రోగుల సంరక్షణ , భద్రత కోసం మెరుగైన వైద్య పరికరాల లభ్యతను నిర్ధారిస్తూ వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రయత్నిస్తాయి.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, చిత్రా ఇనిస్టిట్యూట్ లోని కంబైన్డ్ డివైజెస్ బ్లాక్ ఫార్మాస్యూటికల్స్ , మెడికల్ డివైజ్ ల కన్వర్జెన్స్ కు సరైన ఉదాహరణ అని, దీనిని సంస్థాగతీకరించాలని అన్నారు.
మెడిసిన్స్ అండ్ బయో మెడిసిన్స్ కు కూడా ఈ ఇనిస్టిట్యూట్ ఒక మోడల్ అని, దీనిని ఇప్పుడు ఐఐటిలు , ఇతర ప్రముఖ వైద్య సంస్థలు అనుకరిస్తున్నాయని ఆయన అన్నారు.
తిరువనంతపురం లోని శ్రీ చిత్ర ట్రియునల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం ఆధ్వర్యం లోని ఒక ప్రముఖ సంస్థ అని సగర్వంగా చెబుతున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.బయోమెడికల్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, హై క్వాలిటీ క్లినికల్ కేర్, పబ్లిక్ హెల్త్ స్టడీస్ ,ఇంటర్వెన్షన్స్ అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ని ఒకే సంస్థాగత ఫ్రేమ్ వర్క్ కిందకు తీసుకొచ్చే ఏకైక ఇన్ స్టిట్యూట్ ఇది.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ ఇన్స్టిట్యూట్ నాణ్యత ,క్రియాత్మక సామర్థ్యానికి సంబంధించి అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర ఉత్పత్తితో సమానంగా ఉన్న వైద్య పరికర సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిపై దృష్టి సారించిందని, అదే సమయంలో ఈ ఉత్పత్తులు భారతీయ రోగులకు సరసమైన ధరకు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాయని డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. హృద్రోగ కవాటం, ఆక్సిజనేటర్లు, బ్లడ్ బ్యాగ్, హైడ్రోసెఫాలస్ షంట్, ఆర్థోపెడిక్ , డెంటల్ మెటీరియల్స్ వంటి వివిధ ఉత్పత్తులు భారతీయ రోగులకు చౌకైన , సహేతుకమైన ధరలకు అందుబాటులో ఉంచిందని ఆయన చెప్పారు. సామాజిక అవసరాలతో తన పరిశోధనలను అనుసంధానం చేయడంలో, ముఖ్యంగా నిరుపేదల అవసరాలను పరిశీలించడంలో కీలక పాత్ర పోషించినందుకు ఇనిస్టిట్యూట్ ను మంత్రి అభినందించారు.
చిత్రా ఇన్స్టిట్యూట్ లో అభివృద్ధి చేసిన చాలా సాంకేతిక పరిజ్ఞానాలు ప్రైవేట్ వాణిజ్య సంస్థలకు బదిలీ చేయబడ్డాయి. దశాబ్దాలుగా మార్కెట్లో నిలదొక్కు కుంటున్నాయని మోడీ యొక్క సినర్జీ కాన్సెప్ట్ మరియు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ప్రధాన మంత్రి మోడీ సమన్వయ భావన, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, చిత్రా ఇనిస్టిట్యూట్‌లో అభివృద్ధి చేసిన చాలా సాంకేతికతలు ప్రైవేట్ వాణిజ్య సంస్థలకు బదిలీ జరిగి, దశాబ్దాలుగా మార్కెట్‌లో కొనసాగుతున్నాయని అన్నారు.
ఉత్ప త్తి అభివృద్ధి కోసం పలు
ప్రాజెక్టులకు పారిశ్రామిక సంస్థలు పూర్తిగా నిధులు సమకూరుస్తున్నాయని,
పరిశోధన - అభివృద్ధిలో ప్రైవేటు
భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక
పర్యావరణాన్ని సృష్టించడానికి ఇవి రెండూ కూడా ఉదాహరణలు అని మంత్రి వివరించారు.
ప్రైవేట్ రంగం సమాన వాటాదారుగా మారి, మొదటి నుండి ప్రాజెక్టులో పెట్టుబడులు పెడితేనే, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం పరిశోధన , అభివృద్ధి విజయవంతం కాగలదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సుస్థిర స్టార్టప్ లు
ప్రభుత్వ , ప్రయివేటు రంగాల రెండింటి సమాన వాటాను కలిగి ఉండడానికి కూడా ఇది సరైన విషయం అని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తయారీ , ఇతర వైద్య వెంచర్లలో స్టార్టప్ లకు మద్దతు ఇవ్వడానికి డి ఎస్ టి , భారత్ బయోటెక్ టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డ్ సమాన వాటాలతో 400 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయడాన్ని ఆయన ఉదాహరణ గా పేర్కొన్నారు. బయో టెక్నాలజీ విభాగం ఉత్పత్తి చేసిన డిఎన్ఎ వ్యాక్సిన్ ను తరువాత ప్రైవేట్ రంగం సమర్థవంతంగా ఉపయోగించిందని, ఇది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ సారాంశం అని మంత్రి అన్నారు.
నిన్ననే ఫిన్లాండ్ విద్య, సాంస్కృతిక శాఖ మంత్రి పెట్రి హొంకోనెన్ తనను కలిసి కోవిడ్ మహమ్మారి నిర్వహణ, దేశప్రజలందరికీ వ్యాక్సిన్లు, టీకాల అభివృద్ధిలో భారత ప్రభుత్వం చేస్తున్న కృషి కి గానూ ప్రధాన. మంత్రిని ప్రశంసించారని డాక్టర్ జితేంద్ర సింగ్ వైద్య బృందానికి తెలియజేశారు. ఐదు మిలియన్ల మంది ప్రజలు ఉన్న తమ దేశం మహమ్మారితో పోరాడుతుండగా, 130 కోట్ల మందితో భారతదేశం కోవిడ్-19పై పోరాటంలో ప్రపంచానికి మార్గాన్ని చూపించిందని, అనేక దేశాలకు ముఖ్యంగా టీకాలతో పొరుగు దేశాలకు సహాయం చేసిందని ఫిన్నిష్ మంత్రి అన్నారు. ఈ మహమ్మారి సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ సుగుణాలను మనకు నేర్పిందని, మహమ్మారి ముగిసిన తరువాత కూడా మానవాళి , ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న ప్రజల ప్రయోజనాల కోసం వివిధ వ్యాధులకు తగిన చికిత్స , నివారణ కోసం సమీకృత వైద్య విధానాన్ని సంస్థాగతీకరించడం అవసరమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కోవిడ్ సమయంలో పాశ్చాత్య దేశాలు కూడా ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, యోగా, నేచురోపతి , ఇతర ప్రాచ్య ప్రత్యామ్నాయాల నుండి తీసుకున్న రోగనిరోధక శక్తిని పెంపొందించే పద్ధతుల కోసం భారతదేశం వైపు చూడటం ప్రారంభించాయని అన్నారు.
కేరళ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, కేరళ ప్రభుత్వ సంయుక్త చొరవగా ఇనిస్టిట్యూట్ మెడ్ స్పార్క్ అనే మెడికల్ డివైజ్ పార్కును ఏర్పాటు చేయడంలో సంస్థ నిమగ్నం అయిందని చెప్పడానికి సంతోషిస్తున్న్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కాంబినేషన్ పరికరాల్లో కొత్త చొరవలు, స్వదేశీ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి భారతీయ వైద్య పరికర పరిశ్రమకు మద్దతు ఇవ్వడంలో మరింత ముఖ్యమైన పాత్రను చేపట్టడానికి ఇనిస్టిట్యూట్ కు ఖచ్చితంగా సహాయపడతాయని ఆయన అన్నారు.
చిత్రా ట్రియునల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ బిహారీ మాట్లాడుతూ, వైద్య పరికరాలకు సంబంధించిన అన్ని టెస్టింగ్ కార్యకలాపాలకు ఫ్రాన్స్ కు చెందిన అంతర్జాతీయ ఏజెన్సీ కోఫ్రాక్ గుర్తింపు ను ఇన్స్టిట్యూట్ నిర్ధారించిందని తెలిపారు.
ప్రొడక్ట్ లను ఉపయోగించడం కోసం వైద్య సమాజం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించ డానికి ఇది సాయపడుతుంది. భారతదేశంలోని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్, అమెరికా లోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ సి ఇ మార్కింగ్ , ఆస్ట్రేలియాలోని థెరప్యూటిక్స్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ వంటి జాతీయ , అంతర్జాతీయ రెగ్యులేటర్ల నుండి ధృవీకరించబడటానికి అనేక మంది భారతీయ వైద్య పరికరాల తయారీదారులకు ఇది సహాయపడింది.
నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్, తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు డాక్టర్ శశిథరూర్, పలువురు ప్రముఖ వైద్యులు, వైద్య నిపుణులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*****
(Release ID: 1876283)
Visitor Counter : 133