సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

2022 నవంబర్ 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో - 53వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

Posted On: 14 NOV 2022 6:29PM by PIB Hyderabad

53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం - ఐ.ఎఫ్.ఎఫ్.ఐ., 2022 నవంబర్, 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరుగుతుంది.  కళ, చలనచిత్రాలు, సంస్కృతి యొక్క సమ్మిళిత శక్తి, స్ఫూర్తిని కూడగట్టుకుని, ఈ వార్షిక చలన చిత్రోత్సవం, పెద్ద, పెద్ద ప్రముఖులను ఒక వేదిక పైకి తీసుకు వస్తుంది.  ఈ ఏడాది 79 దేశాల నుంచి 280 సినిమాలు ప్రదర్శించనున్నారు.  భారతదేశానికి చెందిన 25 ఫీచర్ ఫిల్మ్‌ లతో పాటు, 20 నాన్-ఫీచర్ ఫిల్మ్‌ లను  ‘ఇండియన్ పనోరమ’లో ప్రదర్శించనున్నారు. కాగా, 183 చలన చిత్రాలు అంతర్జాతీయ ప్రోగ్రామింగ్‌ లో భాగంగా ప్రదర్శితమౌతాయి. 

*     సత్యజిత్ రే జీవితకాల సాఫల్య పురస్కారాన్నిస్పానిష్ చిత్ర దర్శకుడు కార్లోస్ సౌరా అందుకుంటారు. 

*     కంట్రీ ఫోకస్ ప్యాకేజీ కింద 'స్పాట్‌ లైట్దేశమైన ఫ్రాన్స్ కి చెందిన 8 సినిమాలు ప్రదర్శించనున్నారు. 

*      వార్షికోత్సవంలో డైటర్ బెర్నర్ దర్శకత్వం వహించిన ఆస్ట్రియా కు చెందిన "అల్మా & ఆస్కార్అనే చిత్రాన్ని  ప్రారంభ చిత్రంగాక్రిజ్‌ టోఫ్ జానుస్సీ చిత్రం "పర్ఫెక్ట్ నంబర్అనే చిత్రాన్ని ముగింపు చిత్రంగా ప్రదర్శించనున్నారు. 

*      సంవత్సరం .ఎఫ్.ఎఫ్.మరియు ఫిల్మ్ బజార్‌ లో అనేక కొత్త కార్యక్రమాలను చేర్చడం జరిగింది. 

*     గోవా అంతటా కారవాన్‌ లను మోహరించి సినిమాలను ప్రదర్శించనున్నారు. 

*     సముద్ర తీరంలో "ఓపెన్-ఎయిర్-బీచ్-స్క్రీనింగ్కూడా నిర్వహిస్తున్నారు. 

*     ‘ఇండియన్-రీస్టోర్డ్-క్లాసిక్స్’ విభాగంలో ఎన్.ఎఫ్..నుండి ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శిస్తారు.

*      ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆశా పరేఖ్ నటించిన మూడు చిత్రాలు - "తీస్రీ మంజిల్", "దో బదన్", "కటి పతంగ్చిత్రాలను "ఆశా పరేఖ్ రెట్రోస్పెక్టివ్‌" లో భాగంగా ప్రదర్శించనున్నారు. 

*     ‘హోమేజ్’ విభాగంలో పదిహేను భారతీయ చిత్రాలనుఐదు అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శిస్తారు. 

*     ఈశాన్య భారతదేశంలోని చిత్రాలను ప్రోత్సహించే ప్రక్రియలో భాగంగామణిపురి సినిమా స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని, 5 ఫీచర్ ఫిల్మ్లు, 5 నాన్-ఫీచర్ ఫిల్మ్లు ప్రదర్శిస్తారు. 

*     ప్రత్యేక ఆకర్షణల్లో భాగంగానవంబర్,  26 తేదీన షిగ్మోత్సవ్ (వసంతోత్సవం)నవంబర్, 27 తేదీన "గోవా కార్నివాల్ జరుగుతాయి. 

*     "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్ఇతివృత్తంపై సి.బి.సిఒక ప్రదర్శనను ఏర్పాటు చేయనుంది. 

న్యూ ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌ లో జరిగిన కర్టెన్ రైజర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ లో కేంద్ర సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్. ఎల్. మురుగన్ మాట్లాడుతూ, స్పానిష్ చిత్ర నిర్మాత కార్లోస్ సౌరా ను సత్యజిత్ రే జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, ఐ.ఎఫ్.ఎఫ్.ఐ.  లో ఎనిమిది చిత్రాల "రెట్రో స్పెక్టివ్" ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు.   బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో, స్పానిష్ చిత్ర నిర్మాత కార్లోస్ సౌరా, ఉత్తమ దర్శకునిగా, "గోల్డెన్ బేర్" పురస్కారంతో పాటు, "లా కాజా" మరియు "పెప్పర్‌ మింట్ ఫ్రాప్పే" చిత్రాలకు రెండు "సిల్వర్ బేర్" పురస్కారాలను అందుకున్నారు.  అదేవిధంగా కేన్స్ చలన చిత్రోత్సవంలో "కారమెన్" కోసం బి.ఏ.ఎఫ్.టి.ఏ.,  మూడు అవార్డులతో పాటు, అనేక ఇతర అవార్డులను ఆయన అందుకున్నారు.  ఈ సంవత్సరం దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత యొక్క మూడు చిత్రాలు - తీస్రీ మంజిల్, దో బదన్, కటి పతంగ్ చిత్రాలను "ఆశా పరేఖ్ రెట్రోస్పెక్టివ్‌" లో ప్రదర్శించనున్నారు.  ఈశాన్య భారతదేశానికి చెందిన చిత్రాలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా, మణిపురి సినిమా స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని  5 ఫీచర్ ఫిలిం లు, 5 నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు  ప్రదర్శించనున్నారు. 

ఈ వార్షిక ఉత్సవాల్లో డైటర్ బెర్నర్ దర్శకత్వం వహించిన ఆస్ట్రియా కు చెందిన "అల్మా & ఆస్కార్" అనే చిత్రాన్ని ప్రారంభ చిత్రంగా, క్రిజ్‌ టోఫ్ జానుస్సీ చిత్రం "పర్ఫెక్ట్ నంబర్" అనే చిత్రాన్ని ముగింపు చిత్రంగా ప్రదర్శించనున్నారు.  ఈ ఉత్సవాలకు 'స్పాట్‌లైట్' దేశంగా ఉన్న ఫ్రాన్స్ కి చెందిన 8 సినిమాలను "కంట్రీ ఫోకస్ ప్యాకేజీ"  కింద ప్రదర్శిస్తారు.  ‘హోమేజ్’ విభాగంలో పదిహేను భారతీయ, ఐదు అంతర్జాతీయ చిత్రాలు ప్రదర్శిస్తారు.  భారతరత్న లతా మంగేష్కర్; గాయకుడు, సంగీతకర్త బప్పి లాహిరి; కథక్ కళాకారుడు పండిట్‌ బిర్జు మహారాజ్; నటులు రమేష్ డియో, మహేశ్వరి అమ్మ; గాయకుడు కె.కె; దర్శకుడు తరుణ్; అస్సాం నటుడు నిపోన్ దాస్; రంగస్థల కళాకారుడు మజుందర్; గాయకుడు భూపిందర్ సింగ్ లకు నివాళులర్పిస్తారు.   అదేవిధంగా, అంతర్జాతీయ విభాగంలో, బాబ్ రాఫెల్సన్, ఇవాన్ రీట్‌మాన్, పీటర్ బొగ్డనోవిచ్, డగ్లస్ ట్రంబెల్, మోనికావిట్టి వంటి మేధావువిలకు కూడా ఈ సందర్భంగా  నివాళులర్పిస్తారు. 

ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో’ రెండవ ఎడిషన్ మరొక ఆకర్షణగా నిలుస్తుంది.   75 ఏళ్ల భారత స్వాతంత్య్రానికి ప్రతీకగా 75 మంది సినీ నిర్మాతలను గుర్తించడం జరుగుతుంది.  రాబోయే సంవత్సరాల్లో, దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ఉత్సవాల్లో పాల్గొనే యువ ప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని భావించడం జరిగింది. 

వివిధ విభాగాలలో అత్యుత్తమ చిత్రాలు మరియు చిత్రనిర్మాతల గురించి ‘ఫిల్మ్ బజార్’ లో ప్రదర్శిస్తారు.   మార్చే డు కేన్స్ వంటి ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా, మొదటిసారి,  ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో పెవిలియన్లు దర్శనమివ్వనున్నాయి.  ఈ ఏడాది మొత్తం 42 పెవిలియన్లు ఉంటాయి.  వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక సంస్థలు, మంత్రిత్వ శాఖలోని మీడియా యూనిట్లకు చెందిన చిత్ర కార్యాలయాలు ఈ పెవిలియన్లలో తమ సమాచారాన్ని ప్రదర్శిస్తాయి.   పునరుద్ధరించబడిన అనేక ఉత్తమ ప్రాచీన చిత్రాలను 'ది వ్యూయింగ్ రూమ్' లో అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి.  ఈ చిత్రాల హక్కులను కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే చలనచిత్రోత్సవాలలో వాటిని ఉపయోగించుకోవచ్చు.

'దివ్యాంగజన్' విభాగంలో ప్రదర్శించబడిన రిచర్డ్ అటెన్‌బరో రూపొందించి, ఆస్కార్ అవార్డు పొందిన "గాంధీ" వంటి చలన చిత్రాలు దృశ్య,శ్రావణ మాధ్యమంలో పొందుపరిచిన ఆడియో వివరణలు, ఉపశీర్షికలతో అమర్చబడి ఉంటాయి.  ఈ విధానం విభిన్నంగా ఉన్న చలనచిత్ర అభిమానులను సైతం వారికి అందుబాటులో ఉంచడంతో పాటు, కలుపుకొని పోయే స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది.

పుస్తకాలను స్వీకరించడం ద్వారా పుస్తకాలలో ముద్రించిన మంచి కథలకు, మంచి చలన చిత్రాలకు మధ్య అంతరాన్ని తగ్గించడం కోసం పుస్తకాలను స్వీకరించే కొత్త కార్యక్రమాన్ని బాక్స్ ఆఫీస్‌ కు పరిచయం చేయడం జరిగింది.  "ఆన్ స్క్రీన్ కంటెంట్‌" గా మార్చగల పుస్తకాల హక్కులను విక్రయించడానికి కొంతమంది ఉత్తమ ప్రచురణకర్తలు కూడా ఈ ఉత్సవానికి హాజరవుతారని భావిస్తున్నారు.

'ఇండియన్ పనోరమా' విభాగం పృథ్వీ కొననూర్ కన్నడ చిత్రం "హదినెలెంటు" ప్రదర్సనతో ప్రారంభమవుతుంది.  కాగా, "ది షో మస్ట్ గో ఆన్" అనే చిత్ర ప్రదర్శనతో, దివ్య కోవాస్జీ, నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని ప్రారంభిస్తారు.  భారతదేశం నుంచి ఆస్కార్‌ కు అధికారికంగా ప్రతిపాదించిన, పాన్ నలిన్ "చెలో షో - ది లాస్ట్ ఫిల్మ్ షో" తో పాటు, మధుర్ భండార్కర్ "ఇండియా లాక్‌ డౌన్" అనే రెండు చిత్రాలను ఉత్తమ విదేశీ భాష విభాగంలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. 

"నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా" నుంచి ఎంపిక చేసిన అలనాటి అపురూప చిత్రాలను ‘ఇండియన్ రీస్టోర్డ్ క్లాసిక్స్’ విభాగంలో ఎన్.ఎఫ్.డి.సి. ప్రదర్శిస్తుంది.  వీటిలో - సోహ్రాబ్ మోడీ 1957 లో నిర్మించిన "నౌషెర్వాన్-ఈ-ఆదిల్";  1969 లో జాతీయ అవార్డు గెలుచుకున్న రమేష్ మహేశ్వరి పంజాబీ చిత్రం "నానక్ నామ్ జహాజ్ హై";  కె విశ్వనాథ్ 1980 లో రూపొందించిన తెలుగు చిత్రం "శంకరాభరణం" తో పాటు,  సత్యజిత్ రే 1977 లో రూపొందించిన "శత్రంజ్ కే ఖిలాడి", 1989 లో నిర్మించిన సాంఘిక చిత్రం "గణ శత్రు" మొదలైనవి ఉన్నాయి.  

తమ సినిమాలకు మద్దతు ఇచ్చి, ప్రోత్సహించడానికి అనేక నూతన హిందీ చలన చిత్రాల ప్రదర్శనల సందర్భంగా, ఆయా చిత్రాల్లో నటించిన నటీనటులు కూడా హాజరుకానున్నారు.  వీటిలో పరేష్ రావల్ చిత్రం ది స్టోరీ టెల్లర్, అజయ్ దేవగన్, టబు నటించిన చిత్రం దృశ్యం-2, వరుణ్ ధావన్, కృతి సనన్ నటించిన భేదియా, యామీ గౌతమ్ చిత్రం లాస్ట్ మొదలైనవి ఉన్నాయి.  త్వరలో విడుదల కానున్న తెలుగు చిత్రం - "రేమో";  దీప్తి నావల్, కల్కి కోచ్లిన్ నటించిన చిత్రం "గోల్డ్ ఫిష్"; రణదీప్ హుడా, ఇలియానా డి క్రజ్ నటించిన చిత్రం "తేరా క్యా హోగా లవ్లీ" తో పాటు వధంధీ, ఖాకీ, ఫౌడా సీజన్-4 వంటి ఓ.టి.టి. షోలకు చెందిన ఎపిసోడ్లు కూడా మొదటి సారి ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.  

కేన్స్, బెర్లిన్, టొరంటో, వెనిస్ వంటి ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాల్లో పలు అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ఈ ఉత్సవంలో పెద్ద ఆకర్షణగా నిలవనున్నాయి.  వీటిలో కొన్ని చిత్రాలు ఆస్కార్ విజేతలు దర్శకత్వం వహించినవి లేదా వారు పాల్గొన్నవి ఉన్నాయి.  ఈ చిత్రాలలో - పార్క్-చాన్ వూక్ చిత్రం డిసిషన్ టు లీవ్;  రూబెన్ ఓస్ట్‌లండ్ చిత్రం ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్; డారెన్ ఒరోనోఫ్స్కీ చిత్రం ది వేల్;  గిల్లెర్మో డెల్ టోరో చిత్రం పినోచియో; క్లైర్ డెనిస్ చిత్రం బోత్ సైడ్ ఆఫ్ ది బ్లేడ్;  గై డావిడి చిత్రం ఇన్నోసెన్స్;  ఆలిస్ డియోప్ చిత్రం సెయింట్ ఓమర్; మేరీమ్ టౌజాని చిత్రం బ్లూ కాఫ్తాన్ మొదలైనవి ఉన్నాయి. 

ప్రముఖ చిత్రనిర్మాతలు మరియు నటీనటులతో నిర్వహించే 23 ‘మాస్టర్‌క్లాస్‌లు’, ‘సంభాషణలు’, 'సదస్సులు' వారం రోజులపాటు ఉత్తేజకరంగా సాగుతాయి.  స్క్రీన్ ప్లే రాయడం లో వి.విజయేంద్ర ప్రసాద్, ఎడిటింగ్ గురించి ఎ. శ్రీకర్ ప్రసాద్, నటనలో అనుపమ్ ఖేర్ తరగతులు నిర్వహిస్తారు.  ఏసెస్ గురించి మాస్టర్‌ క్లాస్‌ లో ఆస్కార్ అకాడమీ నిపుణులు పాల్గొంటారు. యానిమేషన్‌ లో మార్క్ ఒస్బోర్న్ మరియు క్రిస్టియన్ జెజ్డిక్ ఉంటారు.  ఈ సందర్భంగా నిర్వహించే, 'పరస్పర ఇష్టాగోష్టి' కార్యక్రమాలకు ఆషా పరేఖ్, ప్రసూన్ జోషి, ఆనంద్ ఎల్. రాయ్, ఆర్. బాల్కీ, నవాజుద్దీన్ సిద్ధిఖీ మొదలైన ప్రముఖులు నాయకత్వం వహిస్తారు.

53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని దృశ్య మాధ్యమం ద్వారా కూడా వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.  తమ పేరు నమోదు చేసుకున్న ప్రతినిధులు గోవాలో లేనప్పటికీ, సంభాషణలు, ప్యానెల్ చర్చలు, ప్రారంభ, ముగింపు వేడుకల్లో భాగస్వాములయ్యే అవకాశం పొందుతారు.  ఈ ప్రత్యక్ష సదస్సుల వివరాల కోసం అధికారిక వెబ్‌ సైట్‌ ను సందర్శించవచ్చు.

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ-2022 లో, ఎఫ్.టి.ఐ.ఐ. నిర్వహించే మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ లో సినీ ఓమ్, కేనన్, జెయిస్, పుల్స్, ప్రసాద్ కార్పొరేషన్, సోనీ, టెక్నికలర్ క్రియేటివ్ సోలుషన్స్, అమెజాన్, హంస సినీ ఎక్విప్ మెంట్, ఎస్.ఆర్.ఎస్.జి. వంటి 15 కంటే ఎక్కువ కంపెనీలు తమ పరికరాలు, సేవలను ప్రదర్శిస్తాయి.  "ఆజాదీ- కా-అమృత్-మహోత్సవ్" కార్యక్రమాల ఇతివృత్తంతో మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ కు చెందిన టెక్నికల్ ఎగ్జిబిషన్ జోన్‌ లోని ఒక ప్రదేశంలో ఆజాదీ- కా-అమృత్-మహోత్సవ్, సి.బి.సి. ఒక ప్రదర్శనను నిర్వహిస్తాయి.  53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా, 2022 నవంబర్, 26వ తేదీన షిగ్మోత్సవ్ (వసంతోత్సవం), 2022 నవంబర్, 27వ తేదీన గోవా కార్నివాల్ వంటి అనేక ఆకర్షణలు ఉంటాయి. 

పండుగ కాలంలో ప్రతినిధులు, సాధారణ ప్రజలు, యోగా మరియు సంపూర్ణ తనిఖీలను ఆస్వాదించడానికి వీలుగా, ఒక విభాగానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ,  అధికారిక శ్రేయస్సు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.  పండుగ సమయంలో హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదం, యోగాతో సహా ఆయుష్‌ లోని 4 విభాగాలను ప్రోత్సహించాలని వారు యోచిస్తున్నారు.

ప్రారంభ మరియు ముగింపు వేడుకల్లో భారతదేశానికి చెందిన పలువురు చలనచిత్ర ప్రముఖులు పాల్గొనే 14 సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి.  ఈ ఉత్సవాల్లో ఫ్రాన్స్, స్పెయిన్ తో పాటు గోవా కు ప్రాతినిధ్యం వహించే సంగీత, నృత్య బృందాలు కూడా  పాల్గొంటాయి.  "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" వేడుకల నేపథ్యంలో, "గత వందేళ్ళలో భారతీయ సినిమా పరిణామం" అనే ఇతివృత్తంతో, ఈ ఉత్సవాల ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు. 

కేంద్ర సహాయ మంత్రి మీడియాతో  మాట్లాడుతూ,  .ఎఫ్.ఎఫ్.లో అంతర్జాతీయ చలన చిత్ర విభాగంలో  ప్రదర్శించడానికి 180 సినిమాలను ఎంపిక చేయడం జరిగింది.  విధేయత  విభాగంలో  ఐదుగురు వ్యక్తుల చిత్రాలనునివాళి విభాగంలో   ఇద్దరు ప్రముఖ చిత్ర నిర్మాతల చిత్రాలను ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో ప్రదర్శించనున్నారు." అని తెలియజేశారు. 

కేంద్ర సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మీడియాతో మాట్లాడుతూ,  “.ఎఫ్‌.ఎఫ్‌.యొక్క ఫిల్మ్ బజార్ గణనీయంగా మార్చబడింది.  అనేక దేశాలురాష్ట్రాలుచలన చిత్ర సంస్థలు మొదటిసారిగా గోవాలోని పంజిమ్‌ లోని సముద్రం వెంబడి చాలా అందమైన విహార ప్రదేశంలో పెవిలియన్‌ ను ఏర్పాటు చేయనున్నారు.  ఫిల్మ్ బజార్ తో పాటు వివిధ పెవిలియన్ లు .ఎఫ్.ఎఫ్. ప్రతినిధుల కోసం ఎప్పుడైనా తెరిచి ఉంటాయిఅయితేసామాన్య ప్రజలు వ్యాపార రోజుల్లో మధ్యాహ్నం నుండి గంటల వరకు దర్శించుకోవచ్చు." అని వివరించారు. 

53 భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం "కర్టెన్ రైజర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌" ను ఉద్దేశించి సమాచారప్రసార శాఖ కార్యదర్శి తో పాటు ప్రసంగిస్తున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్

సమాచారప్రసారమత్స్యపశుసంవర్ధకపాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ఎల్మురుగన్ 53  భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముఖ్యాంశాలను మీడియాకు వివరించారు.

భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం పై ఒక లఘు చిత్రం ప్రదర్శించబడుతోంది

53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం విశేషాల కోసం ఇక్కడ "క్లిక్" చేయండి

 

*****



(Release ID: 1876024) Visitor Counter : 237