రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సాయుధ దళాల పోరాట సంసిద్ధతకు విచక్షణాయుతంగా ఆర్థిక వనరుల వినియోగానికి శీఘ్ర పారదర్శక నిర్ణయాలే కీలకం: కంట్రోలర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా న్యూఢిల్లీ లో డిఫెన్స్ అకౌంట్స్ విభాగానికి రక్షణ మంత్రి


ఐటి సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేయాలని శ్రీ రాజ్ నాథ్ సింగ్ పిలుపు: మెరుగైన ఫలితాల కోసం అంతర్గత విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని, శ్రామిక శక్తి నైపుణ్యాలను పెంపొందించాలని ఉద్ఘాటన

Posted On: 14 NOV 2022 2:19PM by PIB Hyderabad

సత్వర, పారదర్శక నిర్ణయాల ద్వారా ఆర్థిక వనరులను విచక్షణతో ఉపయోగించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ (డి ఎ డి ) ను కోరారు. సాయుధ దళాల పోరాట సంసిద్ధత ను బలోపేతం చేయడానికి ఇది ఎంతో కీలకమని ఆయన అన్నారు.

 

2022 నవంబర్ 14న న్యూఢిల్లీలో రెండు రోజుల కంట్రోలర్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ డీఏడీని ప్రారంభించిన రక్షణ మంత్రి, విచక్షణతో కేటాయించిన ఆర్థిక నిధులను సమర్థ వినియోగం ద్వారా దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న రక్షణ ఆర్థిక వ్యవస్థ కాపలాదరులుగా ఆ శాఖ అధికారులను అభివర్ణించారు.

 

డి.ఎ.డి. రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయించిన బడ్జెట్ ను నిర్వహిస్తుంది, ఇది సిబ్బంది వేతనం , భత్యాలు, పెన్షనర్లకు చెల్లింపులు, వివిధ రక్షణ ఉత్పత్తుల సేకరణ కోసం ఆర్థిక సలహా కేసుల ప్రాసెసింగ్ , అంతర్గత ఆడిట్ ఫంక్షన్ తో సహా ఇతర సహాయక కార్యకలాపాలతోపాటుగా మొదటి,  తృతీయపక్ష క్లెయింల ప్రాసెసింగ్ లను

డి ఎ డి నిర్వహిస్తుంది. కేంద్ర బడ్జెట్ 2022-23లో పింఛన్ల కోసం రూ.1.19 లక్షల కోట్లతో సహా మొత్తం రూ.5.25 లక్షల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు.

 

కాన్ఫరెన్స్ ఎజెండా అంశాలలో- పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్: ఫేస్ లెస్ లావాదేవీల వ్యవస్థ దిశగా; ఐఎఫ్ఎ సిస్టమ్: సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం; ఎఫిషియెన్సీ అండ్ పెర్ఫార్మెన్స్ ఆడిట్: కాంప్లయన్స్ నుంచి అస్యూరెన్స్ ఫ్రేమ్ వర్క్ వరకు; సర్వీస్ డెలివరీని మెరుగుపరచడం; డి.ఎ.డి అభివృద్ధి చేసిన మానవ వనరుల నిర్వహణ ప్రధాన ఐటి వ్యవస్థలలో సవాళ్లు- మొదలైనవి ఉన్నాయి.

 

సైనికులు, పెన్షనర్లు, థర్డ్ పార్టీలు మొదలైన లబ్దిదారులకు సకాలంలో చెల్లింపులు జరగడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా సూచించారు. 'పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్: టువర్డ్స్ ఎ సిస్టమ్ ఆఫ్ ఫేస్ లెస్ ట్రాన్సాక్షన్స్' అనే అంశంపై జరిగే ఈ సదస్సు రక్షణ ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతకు మార్గం సుగమం చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.పనితీరులో పారదర్శకతను తీసుకురావడం,  మానవ వనరుల యాజమాన్యాన్ని బలోపేతం చేయడం.

ద్వారా డి.ఎ.డి సేవలను మరింత మెరుగు పరిచేందుకు సదస్సు దోహదం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

‘‘ఐఎఫ్ఎ వ్యవస్థ సమర్థత: సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక సహాయం'‘ అనే అంశంపై సెషన్ లో ఆర్థిక అధికార శక్తుల తాజా ప్రతినిధి బృందంతో ఆర్థిక సలహాదారులను పరిచయం చేస్తారు.

ఆర్థిక అధికారాల అప్పగింత ,నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించిన సమస్యలను సలహాదారులు అర్థం చేసుకోవడానికి ఈ సమావేశం సహాయపడుతుందని రక్షణ మంత్రి చెప్పారు.సకాలంలో ఆర్థిక సలహా ఇవ్వడానికి క్లయింట్ అవసరాలపై సున్నితమైన అవగాహనతో పాటు డొమైన్ నైపుణ్యం అవసరం అని ఆయన నొక్కి చెప్పారు. కంట్రోలర్లు సహకార ధోరణి తో పనిచేయాలని, ఇరుపక్షాల ప్రయోజనార్థం పనిచేయాలని ఆయన కోరారు.

 

డిఎడి తన ఐటి సామర్థ్యాలు, ఆర్థిక విజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని,అంతర్గత విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని, తన విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శ్రామిక శక్తి నైపుణ్యాలను పెంపొందించాలని శ్రీ రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. 'ఏ అధికారి పని తీరులోనైనా సందేహం ఉంటే వెంటనే సమీక్షించాలి. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. ఫిర్యాదులు పెండింగ్ లో ఉంటే, వారి వారపు లేదా నెలవారీ ఆడిట్ కోసం ఏర్పాట్లు చేయాలి, చర్యలు తీసుకోవాలి" అని ఆయన అన్నారు.

 

డిఏడి 275 సంవత్సరాలను పురస్కరించుకుని ఒక స్టాంపును, ప్రత్యేక కవర్ ను ఈసందర్భంగా రక్షణl మంత్రి విడుదల చేశారు.ప్రారంభ సెషన్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, డిఫెన్స్ సెక్రటరీ శ్రీ గిరిధర్ అరమానే, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీ విజయ్ కుమార్ సింగ్, ఫైనాన్షియల్ అడ్వైజర్ (డిఫెన్స్ సర్వీసెస్) శ్రీమతి రసికా చౌబే , చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీమతి మంజు కుమార్ పాల్గొన్నారు.

 

ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి నియతానుసారంగా జరిగే ఈసమావేశం వివిధ సమస్యలను సమీక్షించడానికి, చర్చించడానికి,  సుస్థిర పరిష్కారాలను సాధించడానికి డి ఎ డి,  ఎమ్ ఒ డి వో లకు ఒక వేదిక ను అందిస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 100కు పైగా ప్రిన్సిపల్ కంట్రోలర్స్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (పీసీడీఏలు)/కంట్రోలర్స్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (సీడీఏ)/ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ (ఐఎఫ్ఏలు) పాల్గొంటున్నారు.

 

***



(Release ID: 1875928) Visitor Counter : 132