జౌళి మంత్రిత్వ శాఖ
అత్యున్నత నాణ్యత కలిగిన భిన్న భారతీయ హస్తకళలను ప్రపంచానికి అందించేందుకు కాటేజ్ ఎంపోరియం భారతదేశపు గవాక్షంగా ఉందని ప్రశంసించిన జౌళి మంత్రి పీయూష్ గోయెల్
కాటేజ్ ఎంపోరియంను సమీక్షించి, కాటేజ్ ఎంపోరియంను పునరుద్ధరించేందుకు, వ్యాపారాన్ని విస్తరించేందుకు పిపిపికి గల అవకాశాలను అన్వేషించవలసిందిగా కోరిన మంత్రి
ఆధునిక, అనుకూలమైన మార్కెటింగ్ వేదికను అందించడం ద్వారా భారతీయ హస్తకళలను అంతర్జాతీయం చేసేందుకు ప్రోత్సాహం ఇవ్వాలని ఉద్ఘాటన
Posted On:
11 NOV 2022 1:30PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ట్యాగ్ చేసిన ఉత్పత్తులు, క్షీణిస్తున్న హస్తకళలు, ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఒడిఒపి) సహా సుసంపన్నమైన వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశం నలుమూలలకు చెందిన చేనేత & హస్తకళల ఉత్పత్తులతో కూడిన రిపోజిటరీ (భండారం) ప్రదర్శనను కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ ప్రశంసించారు. జౌళి శాఖ పరిధిలోని పిఎస్‌యు అయిన కేంద్ర కుటీర పరిశ్రమల కార్పొరేషన్ (సిసిఐసి) పరిధిలోని రిటైల్ ఔట్‌లెట్ అయిన కేంద్ర కుటీర పరిశ్రమల ఎంపోరియం (సిసిఐసి)ని మంత్రి 10.11. 2022న తనిఖీ చేశారు.
సిసిఐఎసి చేసిన పనిని సమీక్షించిన శ్రీ గోయెల్, కాటేజ్ ఎంపోరియంను పునరుద్ధరించి, వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పిపిపి)కి గల అవకాశాలను అన్వేషించవలసిందిగా అధికారులను ఆదేశించారు.
.అత్యున్నత నానణ్యత కలిగిన భిన్న భారతీయ హస్తకళలను, నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారు& నేత పనివారు తయారు చేసిన ఉత్కృష్టమైన కళాకృతుల సేకరణను ప్రపంచానికి అందించేందుకు భారతదేశపు గవాక్షంగా కాటేజ్ ఎంపోరియం ఉందని ఆయన ప్రశంసించారు.
భారతీయ హస్తకళలను, చేనేత సంప్రదాయాలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను, దేశానికి చెందిన హస్తకళల పనివారికి సమర్ధవంతమైన, ఆధునిక, అనుకూలమైన మార్కెటింగ్ వేదికను అందించడం ద్వారా వారిని ప్రపంచదృష్టికి తీసుకువెళ్ళాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
సిసిఐసి కి చెందిన భిన్న వర్గాల వస్తువులను వెబ్‌సైట్‌లో కూడా ప్రదర్శిస్తున్నారుః
https://shoponline.cottageemporium.in / www.thecottage.in
***
(Release ID: 1875376)
Visitor Counter : 154