రక్షణ మంత్రిత్వ శాఖ
సముద్రంలో నావికాదళ ఆపరేషన్లను తిలకించిన మహారాష్ట్ర శాసనసభ్యులు
Posted On:
11 NOV 2022 10:47AM by PIB Hyderabad
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారుల కోసం 10 నవంబర్ 22న ముంబై తీరంలో ఏర్పాటు చేసిన డే ఎట్ సీ (సముద్రంలో ఒక రోజు) లో పశ్చిమ నావికాదళ కమాండ్ తమ కార్యచరణ సామర్ధ్యాలను ప్రదర్శించింది. సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా తీర రాష్ట్రాల ప్రజలలో మరింత సముద్ర చైతన్యాన్ని సృహను సృష్టించాలన్న గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరిగింది.
పశ్చిమ నౌకాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ యుద్ధ నౌకలు- ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ తేజ్ లపై 25మంది ఎమ్మెల్యేలు సహా 125మంది అతిధులు, అధికారులు ఎక్కారు. ఈ కార్యక్రమం రోజువారీ నావికాదళ కార్యాచరణలు, భారతీయ నావికాదళ నౌకలలో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశాన్ని అతిథులకు కల్పించింది.
సిమ్యులేటెడ్ (విడంబిద) దాడి ద్వారా ఫాస్ట్ ఎటాక్ క్రాఫ్ట్ (వేగవంతమైన దాడి తంత్రం), విమాన శక్తి ప్రదర్శన, చేతక్ హెలికాప్టర్ల అన్వేషణ, రక్షించడం,సీ కింగ్ హెలికాప్టర్ ద్వారా సోనార్ డంక్ ఆపరేషన్, మార్గమధ్యంలో ఇంధనం తదితరాలను తిరిగి నింపడం, సముద్ర మధ్యలో సిబ్బంది బదిలీ వంటి ప్రముఖ ఘట్టాలు ఈ విన్యాసాలలో ఉన్నాయి. సముద్రంలో నావికాదళ కార్యాచరణలోని అన్ని కోణాలను గౌరవ అతిధులకు ప్రదర్శించేందుకు, సబ్‌మెరైన్ (జలాంతర్గామి) ప్రదర్శనను కూడా నిర్వహించారు. నౌకలు ఎక్కిన వారిలో శాసనసభ గౌరవ స్పీకర్ అడ్వకేట్ రాహుల్ నార్వేకర్, గౌరవనీయ మంత్రి శ్రీ చంద్రకాంత్ దాదా పాటిల్ వంటి ప్రముఖులలో ఉన్నారు. పర్యటనకు వచ్చిన ప్రముఖులతో కమాండ్‌కు చెందిన సీనియర్ అధికారులు ముచ్చటించి, వారికి సముద్ర రంగంలో దేశం ఎదుర్కొనే ముప్పులు, సవాళ్ళపై దృష్టిపెట్టి భారతీయ నావికాదళం చేపట్టిన ఆపరేషన్ల స్థూల సమీక్షను ఇచ్చారు. దేశ భద్రతలోనూ, దేశ నిర్మాణంలోనూ నావికాదళం పోషించే కీలక పాత్రను శాసనసభ్యులకు, ప్రభుత్వ అధికారులకు కలిగించేందుకు, సముద్రంలో జీవితం ఎంత కఠినంగా, సవాళ్ళతో కూడి ఉంటుందో వెల్లడించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం డే ఎట్ సీ.
***
(Release ID: 1875372)
Visitor Counter : 138