రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మైసూర్-పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాశీ భారత్ గౌరవ్ రైళ్లను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 11 NOV 2022 1:04PM by PIB Hyderabad

మైసూర్-పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్  ఎక్స్‌ప్రెస్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కెఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇది అయిదవది. దక్షిణ భారతదేశంలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుగా మైసూర్-పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్  ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. కాశీ భారత్ గౌరవ్ రైలును కూడా కెఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్‌లో ప్రధానమంత్రి ప్రారంభించారు. 

 

image.png

విజయవంతంగా అమలు జరుగుతున్న 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో సెమీ-హైస్పీడ్ రైలు- వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అభివృద్ధి చేసింది. దేశంలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును 2019 ఫిబ్రవరి 15న శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్-వారణాసి మార్గంలో ప్రారంభించారు. ఆ తర్వాత  న్యూఢిల్లీ- మాతా వైష్ణో దేవి కత్రా, గాంధీనగర్ రాజధాని - అహ్మదాబాద్ - ముంబై సెంట్రల్, మరియు ఏఎంబి  అందౌరా - న్యూఢిల్లీ మార్గాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టారు.

కొత్తగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ పారిశ్రామిక కేంద్రమైన చెన్నై, సాంకేతిక-సాఫ్ట్‌వేర్-స్టార్టప్ హబ్ బెంగళూరు మరియు ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక నగరం మైసూరు మధ్య రవాణా సౌకర్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకు వస్తుంది. సాఫ్ట్‌వేర్, వ్యాపార వర్గాలు, సాంకేతికవేత్తలు, పర్యాటకులు, విద్యార్థులతో పాటు  మైసూర్-బెంగళూరు-చెన్నైలకు చెందిన సాధారణ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. విమానంలో లభించే సౌకర్యాలు అందించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణానికి కొత్త అర్ధం ఇస్తుంది. 

మైసూరు-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ వేళలు 

image.png

రైలు నం.20607 ఎంజీఆర్  చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి మైసూరుకు చైర్ కార్ ధర రూపాయలు 1200, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర  2295 రూపాయలు గా ఉంటుంది. రైలు నెం.20608లో మైసూరు నుంచి  ఎంజీఆర్  చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు  చైర్ కార్ టికెట్  1365 రూపాయలు,   ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర  2485 రూపాయలు గా ఉంటుంది. 

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ఎటువంటి రాయితీలు లభించవు. చైల్డ్ ఛార్జీలు అనుమతించబడవు. పూర్తి ఛార్జీల వయోజన టికెట్లు మాత్రమే జారీ చేయబడతాయి. బుకింగ్, రద్దు, రీఫండ్ మొదలైన వాటికి సంబంధించిన ఇతర నిబంధనలు మరియు షరతులు శతాబ్ది రైళ్ల ప్రకారం ఉంటాయి.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు
ఇది ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రపంచ స్థాయి రైలు. ఈ రైలు యొక్క కొన్ని ముఖ్యమైన విశేషాలు:

• ప్రయాణంలో  మెరుగైన భద్రత కోసం KAVACH (ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్) అమర్చబడింది.

•మెరుగైన భద్రత కోసం ప్రతి కోచ్‌లో నాలుగు అత్యవసర కిటికీలు ఉంటాయి.  కోచ్ వెలుపల ప్లాట్‌ఫారమ్ వైపు తిరిగి ఉండి వెనుక నుంచి చూడడానికి వీలుగా   నాలుగు  సైడ్ కెమెరాలు ఉంటాయి. 

• అగ్ని ప్రమాదాలు గుర్తించడానికి, నివారించడానికి అన్ని ఎలక్ట్రికల్ క్యూబికల్స్ మరియు మరుగుదొడ్లు  ఏరోసోల్ ఆధారిత ఫైర్ డిటెక్షన్ మరియు సప్రెషన్ వ్యవస్థ కలిగి ఉండి మరింత భద్రత కల్పిస్తాయి. 

.• 650 మిమీ ఎత్తు వరకు వరదలను తట్టుకునేలా అండర్-స్లంగ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది.  విద్యుత్ సరఫరా నిలిచినప్పుడు  ప్రతి కోచ్‌లో నాలుగు ఎమర్జెన్సీ లైట్లు కూడా ఉంటాయి.

• 3.5 రైడింగ్ ఇండెక్స్ వద్ద ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం.  రైలులో 32 అంగుళాల ఎల్సీడీ  టీవీలు మరియు ప్రయాణికుల సమాచారం మరియు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటయింది. 

• అన్ని తరగతుల వారికి సైడ్ రిక్లైనర్ సీటు సౌకర్యం అందుబాటులోకి ఉంటుంది. . ఎగ్జిక్యూటివ్ కోచ్‌లలో 180-డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు ఉంటాయి. 

• టచ్ ఫ్రీ సౌకర్యంతో బయో వాక్యూమ్ టాయిలెట్లు మరియు డిమాండ్‌పై Wi-Fi సౌకర్యం 

•అధిక సామర్థ్యం గల కంప్రెసర్ అల్ట్రా వైలెట్ (UV) దీపం  ద్వారా సూక్ష్మ క్రిమి రహిత  గాలి సరఫరా,  వెలుతురు మరియు  ఎయిర్ కండిషనింగ్ నియంత్రణ.

•  కేవలం 140 సెకన్లలో రైలు గంటకు 160 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. . వాయిస్ రికార్డింగ్ సౌకర్యంతో డ్రైవర్ గార్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది.

• మార్గంలో ఉండే  స్టేషన్లతో సిగ్నల్ మార్పిడి కోసం కోచ్‌లపై రెండు సిగ్నల్ ఎక్స్ఛేంజ్ లైట్లు.

 భారతీయ ఇంజనీర్ల సామర్థ్యాన్ని మరియు మేక్ ఇన్ ఇండియా ప్రాధాన్యతకు  చెన్నైలోని పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారు చేయబడిన వందే భారత్ రైలు నిదర్శనంగా నిలుస్తుంది.  ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ భారత్ కల  సాకారం చేయడంలో ఇది ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుంది. 

బెంగళూరు - వారణాసి భారత్ గౌరవ్ కాశీ దర్శనం
బెంగళూరు నుంచి కాశీకి భారత్ గౌరవ్ రైలును  కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.  సౌకర్యవంతమైన  ప్రయాణం సౌకర్యం అందించే రైలులో బస, వసతి  దర్శన సౌకర్యాలను అన్నీ కలిసిన ఒక  ప్యాకేజీలో అందిస్తుంది. ఈ రైలు హుబ్బల్లి, బెలగావి మీదుగా కూడా ప్రయాణిస్తుంది. దీంతో కేవలం బెంగళూరు నుంచి మాత్రమే  కాకుండా ఉత్తర కర్ణాటక నుంచి  కాశీకి వెళ్లాలనుకునే వారికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్ మరియు అయోధ్య మీదుగా కూడా వెళ్తుంది.

image.png

భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు కోచ్

యాత్ర ఖర్చును 20,000 రూపాయలుగా నిర్ణయించారు. దీనిలో 5000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ గా అందజేస్తుంది. మొదటి రైలు ప్రయాణంలో 600 మంది యాత్రికులు ప్రయాణిస్తారు.  కాశీతో పాటు యాత్రికులు అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్‌లను కూడా సందర్శిస్తారు. 

ద్వారా భారతదేశం మరియు ప్రపంచ ప్రజలకు భారతదేశ సాంస్కృతిక వారసత్వం మరియు అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను దేశ ప్రజలకు మాత్రమే కాకుండా విదేశీయులకు కూడా తెలియజేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ గౌరవ్ రైళ్లు (థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్ రైళ్లు) ప్రవేశపెట్టింది. 

భారత ప్రభుత్వ విధానం:

• భారతీయ రైల్వేలు భారతదేశంలో లభిస్తున్న పర్యాటక అవకాశాలను పర్యాటక రంగ నిపుణుల సామర్థ్యాన్ని ఉపయోగించుకుని పర్యాటకులను ఆకర్షించడానికి భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైళ్లను ప్రవేశపెట్టింది.    
• ఈ విధానం ప్రకారం, నమోదిత సర్వీస్ ప్రొవైడర్లకు  "రైట్ టు యూజ్" విధానం కింద భారత్ గౌరవ్ రైళ్లు నడపడానికి  భారతీయ రైల్వేలు (IR) ద్వారా ICF కోచ్‌లతో కూడిన రేక్‌లనుఅందిస్తుంది.సర్వీస్ ప్రొవైడర్లు NRC (రైల్వేయేతర కస్టమర్) ప్లాన్ కింద  ఉత్పత్తి యూనిట్ల నుండి నేరుగా కొత్త కోచ్‌లను కొనుగోలు చేసే ఎంపికను కూడా కలిగి ఉంటారు.
• ఈ మోడల్‌తో అనుసంధానించబడిన థీమ్‌లు, మార్గాలు, ప్రయాణం, టారిఫ్ మరియు ఇతర లక్షణాలతో సహా వ్యాపార నమూనాను నిర్ణయించే అధికారాన్ని సేవలు అందించే సంస్థ కలిగి ఉంటుంది. 

 

***


(Release ID: 1875371) Visitor Counter : 171