ఆయుష్

2021-22 ఆర్ధిక సంవత్సరంలో మూడురెట్ల పెరుగుదలతో రూ.45.41 కోట్ల లాభాలను నమోదు చేసిన ఐఎంపిసిఎల్‌


కంపెనీ డివిడెండ్‌గా ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ. 9.93 కోట్లు

Posted On: 10 NOV 2022 12:06PM by PIB Hyderabad


భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సిపిఎస్‌ఈ), ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ (ఐఎంపిసిఎల్‌) దాని వాటాదారులకు - ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి రూ. 10.13 కోట్ల డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈరోజు రవాణా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన రూ.9.93 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ " గత ఆర్థిక సంవత్సరం 2020-21తో పోల్చితే ఐఎంపిసిఎల్‌ లిమిటెడ్ తన లాభాలలో అద్భుతమైన పెరుగుదలను నమోదు చేసింది. ఇది ప్రశంసనీయమైన విజయం. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో కూడిన నాయకత్వంలో ఆయుష్ రంగం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిని సాధిస్తోంది" అని తెలిపారు.

image.png

 

డివిడెండ్ చెక్కును అందజేసే కార్యక్రమానికి ఆయుష్‌ ఎంఓఎస్‌ శ్రీ మజాపర మహేంద్రభాయ్; ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి  శ్రీ ప్రమోద్ కుమార్ పాఠక్; డైరెక్టర్ యోగా మరియు నేచురోపతి సెల్, ఆయుష్ మంత్రిత్వ శాఖ శ్రీ విక్రమ్ సింగ్; ఆయుర్వేద సలహాదారు డాక్టర్ ముఖేష్ కుమార్ ఎండీ, ఐఎంపిసిఎల్‌లిమిటెడ్; శ్రీ అరవింద్ కుమార్ అగర్వాల్, ఏజీఎం (ఎఫ్‌&ఏ) ఐఎంపిసిఎల్‌ లిమిటెడ్ మరియు ఇతరులు హాజరయ్యారు.

ఐఎంపిసిఎల్‌ లిమిటెడ్‌ ఎండీ డాక్టర్‌ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ " ఆపరేషనల్ ఫ్రంట్‌లో కంపెనీ తన గత సంవత్సరం కంటే సామర్థ్య వినియోగంలో 47% వృద్ధిని సాధించింది. మునుపటి సంవత్సరాల కంటే టర్నోవర్, లాభం మరియు సామర్థ్య వినియోగం పరంగా పనితీరులో సర్వత్రా మెరుగుదల కంపెనీ భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారించింది" అని వివరించారు

ఐఎంపిసిఎల్‌ లిమిటెడ్‌ భారత ప్రభుత్వంచే మినీ రత్న కేటగిరీ II హోదాను పొందింది మరియు ఐఎస్‌ఓ 9001:2015 సర్టిఫికేషన్ కూడా పొందింది. కంపెనీ ప్రస్తుతం వివిధ వ్యాధుల స్పెక్ట్రం కోసం 656 క్లాసికల్ అవుర్వేద, 332 యునాని మరియు 71 యాజమాన్య అవుర్వేద ఔషధాలను తయారు చేస్తోంది. ఇది జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్‌ఏఎం) కింద అన్ని రాష్ట్రాలకు మరియు 6000 జన ఔషధి కేంద్రాలకు ఆయుర్వేద మరియు యునాని మందులను సరఫరా చేస్తుంది.


 

*****



(Release ID: 1875040) Visitor Counter : 107