హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీ లో దేశ వ్యాప్త ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారుల ఉన్నత స్థాయి సమావేశం : దేశంలోని అంతర్గత భద్రతా పరిస్థితులపై సమీక్ష
Posted On:
09 NOV 2022 7:49PM by PIB Hyderabad
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, తీవ్రవాదం నుండి బెదిరింపులు, సైబర్ సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, సరిహద్దు సంబంధిత అంశాలు , సీమాంతర శక్తుల నుండి ముప్పు. వల్ల దేశం సమగ్రత,
సుస్థిరత్వం వరకు జాతీయ భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో విస్తృతమైన చర్చలు జరిగాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను బలోపేతం చేయడం ద్వారా దేశ భద్రతను పరిరక్షించడానికి కట్టుబడి ఉంది.
ఎలాంటి అంచనాలు లేకుండా అజ్ఞాతంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో శాంతిని నెలకొల్పడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా ముఖ్యమైన సహకారం అందించిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు
మన పోరాటం ఉగ్రవాదంతో పాటు దాని మద్దతు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంది, రెండింటికీ వ్యతిరేకంగా మనం కఠినంగా పోరాడకపోతే ఉగ్రవాదంపై విజయం సాధించలేము
రాష్ట్రాల ఉగ్రవాద వ్యతిరేక, మాదకద్రవ్యాల వ్యతిరేక సంస్థల మధ్య సమాచార భాగస్వామ్యం , కమ్యూనికేషన్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
వామ పక్ష తీవ్రవాదాన్ని నియంత్రించడానికి దాని ఆర్థిక , లాజిస్టిక్ మద్దతు వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉంది
దేశం యొక్క తీరప్రాంత భద్రతను కూడా మనం అభేద్యంగా మార్చాలి, దీని కోసం చిన్న , అత్యంత సుదూర ఓడరేవుపై కూడా నిశితంగా దృష్టి పెట్టాలి.
మాదక ద్రవ్యాలు (నార్కోటిక్స్ ) దేశంలోని యువతను నాశనం చేయడమే కాకుండా, దాని నుండి సంపాదించిన డబ్బు కూడా దేశ అంతర్గత భద్రతను ప్రభావితం చేస్తుంది, కాబట్టి వాటి పూర్తి విధ్వంసం కోసం మనం కలిసి పనిచేయాలి
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీ లో దేశ వ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారుల ఉన్నత స్థాయి స మావేశానికి అధ్యక్షత వహించి, దేశ అంతర్గత భద్రత పరిస్థితులను సమీక్షించారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, తీవ్రవాదం నుండి బెదిరింపులు, సైబర్ సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, సరిహద్దు సంబంధిత అంశాలు , సీమాంతర శక్తుల నుండి ముప్పు. వల్ల దేశ సమగ్రత, సుస్థిరత్వం వరకు జాతీయ భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో విస్తృతమైన చర్చలు జరిగాయి.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను బలోపేతం చేయడం ద్వారా దేశ భద్రత పరిరక్షణకు కట్టుబడి ఉందని, గత ఎనిమిదేళ్లలో దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడానికి అనేక కీలకమైన చర్యలు తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో శాంతి నెలకొల్పడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంతో కీలకమైన తోడ్పాటును అందించిందని, శ్రీ అమిత్ షా అన్నారు. మన పోరాటం ఉగ్రవాదంతో పాటు దాని మద్దతు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉందని, ఈ రెండింటికీ వ్యతిరేకంగా మనం కఠినంగా పోరాడనంత వరకు, ఉగ్రవాదంపై విజయం సాధించలేమని ఆయన అన్నారు.
ఉగ్రవాద నిరోధం , రాష్ట్రాల డ్రగ్స్ వ్యతిరేక సంస్థల మధ్య సమాచారాన్ని పంచుకొనే ప్రక్రియను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కూడా శ్రీ అమిత్ షా నొక్కి చెప్పారు. వామపక్ష తీవ్రవాదం ఆర్థిక, లాజిస్టిక్ సపోర్ట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం ద్వారా దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు
కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ, మనం దేశ తీర భద్రతను కూడా అభేద్యంగా మార్చాల్సిన అవసరం ఉందని, దీని కోసం మనం అతిచిన్న , అత్యంత సుదూర వివిక్త ఓడరేవులపై కూడా నిశితంగా దృష్టి పెట్టాలని అన్నారు. నార్కోటిక్స్ దేశంలోని యువతను నాశనం చేయడమే కాకుండా, దాని నుండి సంపాదించిన డబ్బు కూడా దేశ అంతర్గత భద్రతపై ప్రభావం చూపుతుందని, అందుకే దాని పూర్తి విధ్వంసానికి మనం కలిసి పనిచేయాల్సి ఉందని శ్రీ షా అన్నారు.డ్రోన్ల ద్వారా సరిహద్దు వెంబడి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడానికి యాంటీ-డ్రోన్ టెక్నాలజీని గరిష్టంగా ఉపయోగించు కోవాలని ఆయన అన్నారు.
****
(Release ID: 1874846)
Visitor Counter : 189