రక్షణ మంత్రిత్వ శాఖ
తన ఐటిఎస్ 43వ వార్షిక సదస్సును 15 నవంబర్ 2022న నిర్వహించనున్న మారిటైం హిస్టరీ సొసైటీ
ఇతివృత్తంః భారతదేశ సముద్ర శక్తి అన్వేషణా గతి
Posted On:
09 NOV 2022 11:40AM by PIB Hyderabad
మారిటైం హిస్టరీ సొసైటీ (ఎంహెచ్ఎస్ ) తన 43వ వార్షిక సెమినార్‌ను కొలాబాలోని ఐఎన్‌హెచ్ఎస్ అశ్వినిలోని అగస్త్య ఆడిటోరియంలో 15 నవంబర్ 2022న నిర్వహిస్తోంది.
భారతదేశ సముద్ర శక్తి అన్వేషణా గతి అన్నది ఒకరోజు పాటు జరిగే ఈ సెమినార్ ఇతివృత్తం.
అనాది కాలం నుంచి 7500 కిమీల పొడవు సముద్ర తీరంగల భారత దేశం సముద్రం జీవనోపాధికి , అన్వేషణ, విలీనాలకు మాధ్యమంగా ఉండటాన్ని చూసింది.
ఈ సెమినార్‌లో 10 మంది పత్ర సమర్పకులు ఉన్నారు. వీరు భారతదేశ సముద్రశక్తి చారిత్రక పరిణామాన్ని, అనువర్తనాన్ని వివరించి, దానిలో గల భావనలను, చిక్కులను చర్చిస్తారు. కమొడోర్ (డాక్టర్) శ్రీకాంత్ కేస్నైర్ (రిటైర్డ్), శ్రీప్రమోద్ కపూర్, కెప్టెన్ రాఘవేంద్ర మిశ్ర (రిటైర్డ్), కెప్టెన్ ఎం. దొరైబాబు, కెప్టెన్ హిమాద్రి దాస్, కమాండర్ నినాద్ ఫటార్ఫేకర్ (రిటైర్డ్), కమాండర్ కలేశ్ మోహనన్, కమాండర్ ఆర్ ఎస్ సావన్, కుమారి జాహ్నవి లోకేగాంవ్‌కర్, శ్రీ డెన్నార్డ్ డిసౌజా వక్తలు, సంచాలకులుగా వ్యవహరించేవారిలో ఉన్నారు.
సుస్థిరమైన సముద్ర సిద్ధాంతం, ఏకీకృత సముద్ర విధానాలు, సమగ్ర జాతీయ సముద్ర అభివృద్ధి ప్రణాళికను స్థాపించడానికి పునాదిగా ఉపయోగపడే విధంగా పూర్తి చారిత్రక అవలోకనాన్ని అందించడం ద్వారా ప్రేక్షకులలో ఉత్సుకతను రేకెత్తించాలన్నది సెమినార్ లక్ష్యం.
సముద్ర సంబంధ ఔత్సాహికులందరికీ ఎంహెచ్ఎస్ 15 నవంబర్ 2022 09.30 నుంచి 16.30 గంటల వరకు జరిగే ఈ సెమినార్‌కు హాజరుకావాలని ఆహ్వానిస్తోంది. ప్రవేశ హక్కులు ప్రత్యేకం. నమోదు వివరాల కోసం ops@mhsindia.org అన్న ఐడికి తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఇమెయిల్ పంపవచ్చు.
***
(Release ID: 1874721)