నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

ఈజిప్ట్‌లో “సిటిజన్-సెంట్రిక్ ఎనర్జీ ట్రాన్సిషన్: ఎన్‌పవరింగ్‌ సిటిజన్స్‌ విత్‌ మిషన్‌లైఫ్ సదస్సును నిర్వహిస్తున్న ఎంఎన్‌ఆర్‌ఈ, ఎంఓపి


● కాప్‌27లోని ఇండియన్ పెవిలియన్ భవిష్యత్‌పై దృష్టితో పౌరకేంద్రీకృత ఎనర్జీ యాక్సెస్, పరివర్తన, భద్రత మరియు న్యాయ సంబంధిత కార్యక్రమాలను ప్రదర్శిస్తోంది

● ప్రపంచ ఇంధన పరివర్తనను సులభతరం చేయడానికి మరియు బలోపేతం చేయడానికి ఇంధన సమర్థవంతమైన మరియు తక్కువ కార్బన్ టెక్నాలజీల విస్తరణను అలాగే మార్కెట్ పెట్టుబడిని వేగవంతం చేసే మార్గాలపై చర్చను నిర్వహించే లక్ష్యంతో సమావేశం

Posted On: 08 NOV 2022 4:58PM by PIB Hyderabad


నవీన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ) మరియు కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సిఈఈడబ్ల్యూ) భాగస్వామ్యంతో ఈజిప్ట్‌లోని షర్మ్-ఎల్-షేక్‌లో జరుగుతున్న కాప్-27లోని ఇండియా పెవిలియన్‌లో ఈ రోజు “సిటిజన్-సెంట్రిక్ ఎనర్జీ ట్రాన్సిషన్: ఎంపవరింగ్ సిటిజన్స్ విత్ మిషన్ లైఫ్ (లైఫ్‌స్టైల్స్ ఫర్ ఎన్విరాన్‌మెంట్)” అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు.

ఎంఎన్‌ఆర్‌ఈ సెక్రటరీ శ్రీ భూపిందర్ సింగ్ భల్లా అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమం కొన్ని భవిష్యత్‌తో కూడిన పౌర కేంద్రీకృత ఇంధన యాక్సెస్, పరివర్తన, భద్రత మరియు న్యాయ సంబంధిత కార్యక్రమాలను ప్రదర్శిస్తోంది. ఇది మిషన్ లైఫ్‌కు నడ్జింగ్ ప్రవర్తనల సూత్రాలను సాకారం చేస్తూ లక్షలమంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయి. ప్రపంచ ఇంధన పరివర్తనను సులభతరం చేయడానికి మరియు బలోపేతం చేయడానికి ఇంధన సామర్థ్యం మరియు తక్కువ కార్బన్ టెక్నాలజీల విస్తరణను అలాగే మార్కెట్ పెట్టుబడిని వేగవంతం చేసే మార్గాలపై సమావేశం చర్చను జరుపుతోంది.

సదస్సులో ఐఆర్‌ఈఎన్‌ఏ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గౌరీ సింగ్ మరియు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్‌ఏ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్ మరియు ఇండియన్ ఇండస్ట్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు.


 

***



(Release ID: 1874604) Visitor Counter : 161