గనుల మంత్రిత్వ శాఖ
నేటివరకు 622 జిల్లాలలో ఏర్పాటు అయిన జిల్లా ఖనిజ సంస్థలు (మినరల్ ఫౌండేషన్)
ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన కింద 2,52,995 ప్రాజెక్టులు మంజూరు
Posted On:
07 NOV 2022 12:36PM by PIB Hyderabad
గనుల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం జిల్లా ఖనిజ సంస్థ (డిఎంఎఫ్)లు భారతదేశంలోని 23 రాష్ట్రాలలోని 622 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు అయ్యాయి. డిఎంఎఫ్ భావనను గనులు& ఖనిజాలు ( అభివృద్ది &క్రమబద్ధీకరణ) ఎంఎండిఆర్ చట్టం, 1957లో సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. మైనింగ్ సంబంధిత కార్యకలాపాల వల్ల ప్రభావితమైన అన్ని జిల్లాల్లో లాభాపేక్ష లేని సంస్థగా డిఎంఎఫ్ ఏర్పాటు కోసం ఉద్దేశించిన సెక్షన్ 9ని సవరించిన చట్టం ప్రవేశపెట్టింది. మైనింగ్ వల్ల ప్రభావితమైన ప్రజలు, ప్రాంతాల ప్రయోజనాల కోసం పని చేయడం దీని లక్ష్యం.
డిఎంఎఫ్ కింద సేకరించిన నిధుల ద్వారా ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన (పిఎంకెకెకెవై)ని అమలు చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ. 63534. 07 కోట్లను కేటాయించగా, రూ. 37422.94 కోట్లను ఖర్చు చేశారు. యోజన కింద మంజూరు చేసిన 2,52995 ప్రాజెక్టులలో 1,33144 ప్రాజెక్టులను నేటి వరకూ పూర్తి చేశారు.
***
(Release ID: 1874278)
Visitor Counter : 138