ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దుబాయిలో ప్రవాస భారతీయులతో మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ సమావేశం


శక్తివంతమైన నాయకత్వం , సాహసోపేతమైన సంస్కరణలతో నేడు ప్రపంచానికి అభివృద్ధి దీపిక గా భారత్: విశ్వ సద్భావన కార్యక్రమంలో శ్రీ చంద్రశేఖర్

యుఎఇ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయ మంత్రి శ్రీ ఒమర్ సుల్తాన్ అల్ ఓలామాను కలసిన మంత్రి చంద్రశేఖర్: లోతైన సాంకేతిక, ఎలక్ట్రానిక్స్/ సెమీకాన్ రంగాల్లో సహకారం పై చర్చ

Posted On: 06 NOV 2022 2:10PM by PIB Hyderabad

ఒక అసమర్థమైన ప్రజాస్వామ్యం అనే పూర్వ గాథను ఒక ఉత్తేజకరమైన నాయకత్వం , ధైర్యవంతమైన సంస్కరణల తో ప్రజాస్వామ్యంగా తిరగ రాయడం ద్వారా భారత దేశం నేడు ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉందని, కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటి , స్కిల్ డెవ ప్ మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్  అన్నారు.

 

 

image_6483441 (3).JPG  image_6483441.JPG

 

(దుబాయిలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్)

 

యూఏఈలోని దుబాయిలో శనివారం జరిగిన విశ్వ సద్భావన కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి శ్రీ రాజీవ్ చంద్ర శేఖర్ ప్రసంగిస్తూ, "భారత దేశం ప్రస్తుతం మార్పు దిశ లో ఉంది. రోజు మనం ఉన్న పరిస్థితి నుంచి రాబోయే 25 ఏళ్ల అమృత్ కాల్ లో ముందుకు మాత్రమే సాగగలదని, అది తన అభివృద్ధి ప్రయాణంలో సహజమైన తదుపరి దశ అవుతుందని అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, విస్తృతమైన సంస్కరణలు, డిజిటల్ ఇండియా, స్కిల్స్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల విజయవంతం మునుపటి ఒక ఓటి, పని చేయని

ప్రజాస్వామ్యం అనే కథను భారత్ మార్చి వేసిందని పునరుద్ఘాటిస్తూ, బహుళ, లౌకిక, వైవిధ్యభరిత దేశం మాత్రమే కాకుండా ఆర్థికాభివృద్ధి, సృజనాత్మకత, అభివృద్ధి, సౌభాగ్యానికి నిలబడ్డ దేశానికి నేడు భారతదేశం సజీవ, ఉచ్వాస ఉదాహరణ అని మంత్రి అన్నారు.

 

 

image_6483441 (1).JPG

 

(ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 20

సంవత్సరాల నాయకత్వ ప్రభావం గురించి రెండు పుస్తకాలు - 'Modi@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ' , ' హార్టియస్ట్: ది లెగసీ ఆఫ్ ఫెయిత్ ' ను దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరిస్తున్న

శ్రీ రాజీవ్ చంద్రశేఖర్)

 

భారతీయ సంతతి సభ్యులు భారీ సంఖ్యలో హాజరైన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 20  సంవత్స రాల నాయకత్వం ప్రభావం గురించి రెండు పుస్తకాలు -. 'Modi@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ', హార్టియస్ట్: ది లెగసీ ఆఫ్ ఫెయిత్ ' ను కూడా శ్రీ చంద్ర శేఖర్ ఆవిష్కరించారు. ఎన్ఐడీ ఫౌండేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

 

 

image_6483441 (2).JPG

 

(దుబాయ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ రిమోట్ వర్క్ అప్లికేషన్ యు సహాయ మంత్రి శ్రీ ఒమర్ సుల్తాన్ అల్ ఓలామాతో సమావేశమైన మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్)

 

ఒక రోజు దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీ రాజీవ్ చంద్ర శేఖర్ అంతకు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ , రిమోట్ వర్క్ అప్లికేషన్ల యు సహాయ మంత్రి శ్రీ. ఒమర్ సుల్తాన్ అల్ ఓలామాతో సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ భారత దేశ దార్శనికతను శ్రీ చంద్ర శేఖర్ ఆయన తో పంచుకున్నారు. ప్రత్యేకించి డీప్ టెక్ , ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ , ఎల క్ట్రానిక్స్సెమీకండర్ల రంగాల లో ఇరు దేశాల మధ్య సహకారానికి ఉన్న అవకాశాలపై వారు చర్చించారు.

 

ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపిఎఫ్) యుఎఇ ఉత్తర ప్రదేశ్ కౌన్సిల్ నిర్వహించిన దీపోత్సవ్ 2022 కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి యుఎఇలోని అజ్మాన్ ను కూడా సందర్శించారు. అక్కడ ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.  2026 కల్లా నవ భారత దేశాన్ని ఒక ట్రిలియన్ యు ఎస్ డి డిజిటల్ ఎకానమీ/ 5 టి యు ఎస్ డి గా మార్చడం కోసం ప్రధాన మంత్రి తీసుకున్న వివిధ కార్యక్రమాల గురించి శ్రీ రాజీవ్ చంద్ర శేఖర్ ప్రస్తావించారు.

***




(Release ID: 1874194) Visitor Counter : 128