నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
రేపు జె&కెలో పర్యటించనున్న ఎంఒఎస్ రాజీవ్ చంద్రశేఖర్
రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విద్యార్ధులు, ఇతర భాగస్వాములతో నైపుణ్యాలు, ఆవిష్కరణ, వ్యవస్థాపకతలో కార్యక్రమాలను విస్త్రతం చేసేందుకుచర్చలు నిర్వహించనున్న సహాయ మంత్రి
Posted On:
06 NOV 2022 5:38PM by PIB Hyderabad
నైపుణ్యాలు, ఆవిష్కరణ, వ్యవస్థాపకత వంటి రంగాలలో కార్యక్రమాలను విస్త్రతం చేసేందుకు కేంద్ర వ్యవస్థాపకత, నైపుణ్యాల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ రేపటి నుంచి జరుపనున్న రెండు రోజుల జమ్ము కాశ్మీర్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విద్యార్ధులు, ఇతర భాగస్వాములతో సంభాషణలు, చర్చలు నిర్వహించనున్నారు.
ముమ్‌కిన్, తేజస్వని పథకాలు, ఉజ్జ్వల, ఆప్ కీ జమీన్, ఆప్ కి నగరానీ పథకాలు తదితర పథకాల కీలక లబ్ధిదారులతో శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ సమావేశం అయ్యి, రామ్‌బన్‌లో వారికి హామీ ఇచ్చిన వాటటిలో అనేకమైన వాటిని అందచేయనున్నారు. ఆయన దివ్యాంగ లబ్ధిదారులకు మోటరైజ్డ్ ట్రైసికిల్స్ / స్కూటీలు పంచనున్నారు.
అనంతరం ఆయన చందర్‌కోటెలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్ళి విద్యార్ధులు, సిబ్బందితో ముచ్చటించి, తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వారు ఏర్పాటు చేసిన స్టాళ్ళను సందర్శించనున్నారు. నైపుణ్యాలు కలిగిన యువతకు వివిధ కంపెనీలలో ఉపాధినిచ్చేందుకు జాబ్ మేళాను కూడా మంత్రి ప్రారంభించనున్నారు. తదనంతరం, ఆయన వివిధ ప్రాజెక్టులకు (అమృత్ సరోవర్లు/ జలజీవన్ మిషన్లు) పునాదిరాయిని దృశ్యమాధ్యం ద్వారా వేయనున్నారు.
మంత్రి రామబన్ జిల్లా అభివృద్ధి మండలి (జిల్లా పరిషద్) చైర్‌పర్సన్‌తోనూ, జిల్లా కమిషనర్‌తోనూ చర్చలు నిర్వహించనున్నారు.
తర్వాత శ్రీ చంద్రశేఖర్ పట్నిటాప్‌కు బయలుదేరి అక్కడ పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధులతోనే కాక హోటల్ యజమానులు, యువత, టూరిజం క్లబ్బుల సభ్యులతో ముచ్చటించనున్నారు. ఆయన అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు.
జమ్ములో మంత్రి రీజినల్ డైరెక్టొరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (ఆర్‌డిఎస్‌డిఇ, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు (డబ్ల్యు)లొ శిక్షణ పొందుతున్నవారు, అధికారులను కలిసి, అందుబాటులో ఉన్న వనరులను, స్థానిక యువత ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలలో వృత్తినైపుణ్యాలు పెంచే కృషి గురించి చర్చించనున్నారు.
***
(Release ID: 1874191)
Visitor Counter : 141