గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కొచ్చిలో ప్రారంభమైన అర్బన్ మొబిలిటీ ఇండియా (యుఎమ్ఐ) కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్ పో - 2022
Posted On:
04 NOV 2022 4:29PM by PIB Hyderabad
కేరళలోని కొచ్చిలో 15వ అర్బన్ మొబిలిటీ ఇండియా (యుఎమ్ఐ) కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్ పో - 2022 ను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు , పెట్రోలియం సహజవాయువు శాఖల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి,ee రోజు ప్రారంభించారు. కొచ్చిలో అర్బన్ మొబిలిటీ ఇండియా (యుఎమ్ఐ) కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్ పో - ను ఏర్పాటు చేయడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పట్టణ ప్రాంతాల్లో అంతరాయం లేని ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి ఒక ఆదర్శవంతమైన నగరంగా గుర్తింపు పొందిన కొచ్చి సరైన ఎంపిక అని అన్నారు, వ్యక్తిగత వాహనాల నుండి ప్రజా రవాణా విధానాలకు మారడానికి ప్రజలను ప్రోత్సహించే వ్యవస్థను సృష్టించడంపై సదస్సు దృష్టి ప్రశంసించదగినదని అన్నారు. ఇది 'వాహనాల కంటే ప్రజలను తరలించడం' అనే కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా
ఉందని పేర్కొన్నారు.
శ్రీ హర్దీప్ ఎస్. పూరి , కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ సంయుక్తంగా ఈ 15వ అర్బన్ మొబిలిటీ ఇండియా (యుఎమ్ఐ) కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్ పో - 2022 ను కొచ్చిలో ఈ రోజు (04 నవంబర్ 2022) ప్రారంభించారు.
కేరళ ప్రభుత్వ సహకారంతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొచ్చి లోని హోటల్ గ్రాండ్ హయత్ లో నవంబర్ ఆరవ తేదీ వరకు. జరిగే ఈ సదస్సు, ఎగ్జిబిషన్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణేతలు, మెట్రో రైల్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు, రవాణా సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ లు, అంతర్జాతీయ నిపుణులు, వృత్తి నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు
పాల్గొంటున్నారు.
భారతీయ పట్టణ రవాణా వ్యవస్థలలో ఇతర దేశాల ఉత్తమ
పద్ధతులు/అభ్యసనలను అన్వయించు కోవడం ద్వారా, ఇతర దేశాల అనుభవాల నుండి మనం నేర్చుకోగలిగామని శ్రీ హర్ దీప్ పూరి అన్నారు.ఈ రోజు మనం ప్రవేశపెడుతున్న మెట్రో లైన్లు ఇతరుల నుండి గ్రహించిన ఉత్తమ విధానాలను కలిగి ఉన్న ప్రజా రవాణా వ్యవస్థ అని అన్నారు.
మన దేశీకరణ ప్రక్రియ ఇదే స్థాయి అభివృద్ధి సోపాన దశలో ఉన్న ఇతర దేశాలతో మనం మేము పంచుకో గలిగే అనుభవానికి కూడా దోహదపడ బోతొందని ఆయన అన్నారు. 2022 సెప్టెంబర్ నాటికి 20 నగరాలలో 810 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లు అందుబాటు లోకి వచ్చాయని, ప్రస్తుతం 27 నగరాలలో 980 కిలోమీటర్ల కు పైగా మెట్రో నెట్ వర్క్ , ఆర్ ఆర్ టిఎస్ నెట్ వర్క్ ల నిర్మాణం
జరుగుతోందని మంత్రి వివరించారు.
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద మెట్రో వ్యవస్థను కలిగి ఉంది, త్వరలో జపాన్ , దక్షిణ కొరియా వంటి అధునాతన ఆర్థిక వ్యవస్థలను అధిగమించి మూడవ అతిపెద్ద వ్యవస్థగా మారుతుంది.ఈ పరిణామాలు ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించడానికి, సంబంధిత గాలి నాణ్యత , ఉద్గారాల సమస్యల పరిష్కారానికి దారితీస్తాయి.
ఐదు సంవత్సరాల వ్యవధిలో రవాణా
వ్యవస్థలు , మెట్రో వ్యవస్థలు , ఇతర
రవాణా వ్యవస్థల మార్పు లో తన ప్రమేయం , సాన్నిహిత్యం పై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
15 మార్గాల ద్వారా 10 దీవులను కలుపుతూ, 78 కిలోమీటర్ల నెట్ వ ర్క్ లో 100,000 మందికి పైగా ప్రజల రోజువారీ ప్రయాణ అవసరాలు తీర్చనున్న వినూత్న కొచ్చి వాటర్ మెట్రో ప్రాజెక్టుకు గాను మంత్రి కొచ్చి మెట్రోను అభినందించారు.వాటర్ మెట్రో నగరంలో ఒకప్పుడు సంప్రదాయ నీటి రైలు ప్రయాణ మార్గాలను పునరుద్ధరించడమే కాకుండా రోజువారీ ప్రయాణికులకు చౌకైన , మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని కూడా అందిస్తుందని పేర్కొన్నారు. . ఇన్ లాండ్ జలరవాణా అనేది రోడ్డు లేదా రైలు రవాణా కంటే సహజంగానే ఎక్కువ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.
గౌరవ ప్రధాన మంత్రి 'పంచ ప్రాణ్' లక్ష్యాన్ని సాధించడానికి పట్టణ ప్రాంతాల్లో సమర్థవంతమైన , హరిత రవాణా వ్యవస్థలను కలిగి ఉండాలనే నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, గౌరవ ప్ర ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో
ప్రభుత్వం ఈ లక్ష్యాలను సాధించే
బాధ్యతకు క ట్టుబడి ఉందని కేంద్రమంత్రి శ్రీ పూరీ స్పష్టం చేశారు.
ఈ అమృత్ కాల్ లో అభివృద్ధి దిశగా రాబోయే దశాబ్దాల కోసం భారత్ ఎదురు చూస్తోంది. 2022 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా
ప్రధాన మంత్రి భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి 'పంచ్ ప్రాణ్'తో రోడ్ మ్యాప్ @2047 ను ప్రకటించారు. ఈ ఐదు కట్టుబాట్లు:
*అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పెద్ద సంకల్పం;
*బానిసత్వం ఒక్క జాడ కూడా మనలో మిగిలిపోకూడదు;
*మన వారసత్వం గురించి మనం గర్వపడాలి;
*మనం ఐకమత్యం, సంఘీభావంతో జీవించాలి;
*ప్రతి పౌరుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
జనాభాలో దాదాపు 50% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూన్నందున 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యానికి పట్టణ చలనశీలత ఒక కీలకమైన చోదక శక్తిగా ఉండడం తప్పనిసరి.
2047లో పట్టణ రవాణా ఎలా ఉండాలో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయడం ప్రారంభించవచ్చని మంత్రి తన ముగింపు ప్రసంగంలో పిలుపునిచ్చారు.
*****
(Release ID: 1873969)
Visitor Counter : 148