ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్ర రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘యువతకు ఉద్యోగ కల్పన దిశ లో మహారాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పం తో ముందుకుకదులుతున్నది’’

‘‘నౌకరీల స్వభావం శ్రీఘ్రం గా మారిపోతున్నది మరి ప్రభుత్వం సైతం వేరు వేరు విధాలైన కొలువులఅవకాశాల ను సృజిస్తున్నది’’

‘‘ఉపాధిఅవకాశాలు మరియు స్వతంత్రోపాధి అవకాశాలు అందరికి..  దళితులకు, వెనుకబడ్డ వర్గాల కు, ఆదివాసీల కు,సాధారణ శ్రేణి వారితో పాటు గా మహిళల కు.. సమానం గా లభ్యం అవుతున్నాయి’’

మహారాష్ట్రకోసం 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన దాదాపు 225 ప్రాజెక్టుల కు కేంద్రప్రభుత్వం ఆమోదాన్ని తెలిపింది’’

Posted On: 03 NOV 2022 12:52PM by PIB Hyderabad

మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటైన రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు. ధన్ తేరస్ నాడు రోజ్ గార్ మేళా భావన కు ప్రధాన మంత్రి శుభారంభం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్థాయి లో పది లక్షల ఉద్యోగాల ను అందించడం కోసం తలపెట్టిన ఉద్యమం లో ఇది ఆరంభ దశ. అది మొదలు, ప్రధాన మంత్రి గుజరాత్ మరియు జమ్ము కశ్మీర్ ప్రభుత్వాల ఆధ్వర్యం లో సాగిన రోజ్ గార్ మేళా ల ను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘అంత స్వల్ప కాలం లో రోజ్ గార్ మేళా ను నిర్వహిస్తుండడాన్ని బట్టి చూస్తే మహారాష్ట్ర ప్రభుత్వం యువతీయువకుల కు ఉద్యోగాల ను ఇచ్చే దిశ లో బలమైన సంకల్పాన్ని చాటుకొంటూ ముందుకు సాగిపోతోందన్నది స్పష్టం. రాబోయే కాలాల్లో అటువంటి రోజ్ గార్ మేళా లను మహారాష్ట్ర లో మరింత గా విస్తరించగలరని తెలిసి నేను కూడా సంతోషిస్తున్నాను.’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్ర హోం డిపార్ట్ మెంటు లో మరియు గ్రామీణ అభివృద్ధి విభాగం లో వేల కొద్దీ నియామకాలు చోటు చేసుకోనున్నాయి.

అమృత కాలం లో అభి వృద్ధి చెందిన దేశం గా రూపొందాలనే లక్ష్యాన్ని అందుకోవాలని దేశం కృషి చేస్తోందని, ఈ ప్రక్రియ లో యువత కీలకమైన పాత్ర ను పోషించనున్నట్లు ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘మారుతున్న కాలాల్లో కొలువుల స్వభావం శర వేగం గా మారిపోతున్నది. ప్రభుత్వం కూడాను వేరు వేరు రకాల ఉద్యోగాల కై అవకాశాల ను అదే పని గా సృజించుకొంటూ పోతోంది.’’ అని ఆయన అన్నారు.

ముద్ర పథకం యువత కు అదనపు ఒప్పందం ఏదీ లేకుండానే రుణాల ను ఇస్తున్నది. మరి ఇరవై లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన రుణాల ను ఇప్పటికే పంపిణీ చేయడమైంది అని ఆయన అన్నారు. అదే విధం గా, స్టార్ట్- అప్స్ ను మరియు ఎమ్ఎస్ఎమ్ఇ రంగాన్ని పెద్ద ఎత్తున సమర్థించడం జరుగుతోంది. మహారాష్ట్ర లో యువతీయువకులు దీని ద్వారా లాభపడ్డారు అని కూడా ఆయన అన్నారు.

 

ప్రభుత్వం  యొక్క ప్రయాసల లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అది ఉద్యోగం మరియు స్వతంత్రోపాధి లకు సంబంధించిన ఈ అవకాశాలు అందరికీ.. దళితుల కు, వెనుకబడిన వర్గాల వారి కి, ఆదివాసి వ్యక్తుల కు, సాధారణ శ్రేణి కి, ఇంకా మహిళల కు.. సమానం గా అందుతున్నాయి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. స్వయం సహాయ సమూహాల తో అనుబంధాన్ని కలిగివున్నటువంటి 8 కోట్ల మంది మహిళ లు 5 లక్షల కోట్ల రూపాయల విలువైన సహాయం పొందినట్లు ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

 

‘‘ప్రస్తుతం, దేశం లో మౌలిక సదుపాయాల రంగం, సమాచార సాంకేతిక విజ్ఞ‌ాన రంగం మరియు ఇతర రంగాల లో ప్రభుత్వం పెడుతున్న రెకార్డు స్థాయి పెట్టుబడులు కొత్త ఉద్యోగావకాశాల ను కల్పిస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మహారాష్ట్ర విషయానికి వస్తే, ఈ రాష్ట్రాని కి 2 లక్షల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన దాదాపు 225 ప్రాజెక్టుల కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. 75 వేల కోట్ల రూపాయల విలువైన రైల్ వే ప్రాజెక్టు ల తో పాటు గా 50 కోట్ల విలువైన ఆధునిక రహదారులకు ఆమోదాన్ని తెలపడమైంది. ‘‘ఈ ప్రాజెక్టుల పనులు అయితే నిర్మాణాధీనం లో ఉండడం గాని లేదా పనులు అతి త్వరలో మొదలవడం గాని జరుగనుంది’’ అని ఆయన అన్నారు. ‘‘ప్రభుత్వం ఎప్పుడయితే అంత పెద్ద మొత్తాన్ని మౌలిక సదుపాయాల కల్పన పైన ఖర్చు చేస్తుందో, దాని వల్ల లక్షల కొద్దీ నూతన ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి’’ అని చెబుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

****

DS/TS

 



(Release ID: 1873457) Visitor Counter : 161