సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

వ్యర్థాల నుంచి సంపద సృష్టి - ప్రత్యేక కార్యక్రమం 2.0


అత్యంత విలువైన ప్రాచీన భాండాగార రికార్డుల సంరక్షణ
31 అక్టోబర్ 2022 న విడుదలైన సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ (CSMoP) మొదటి హిందీ అనువాదం

Posted On: 03 NOV 2022 10:27AM by PIB Hyderabad

ఉత్తమ పరిపాలన విధానాలు, రికార్డుల నిర్వహణ, వినూత్న విధానాలతో కార్యాలయాల స్థల యాజమాన్యం ప్రధాన అంశాలుగా 2022 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక ప్రచారం 20 కార్యక్రమం అమలు జరిగింది. మొత్తం ప్రభుత్వం విధాన స్పూర్తితో పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం పర్యవేక్షణలో కార్యక్రమం అమలు జరిగింది. 

కార్యక్రమంలో భాగంగా  శతాబ్దాల చరిత్ర కలిగిన అత్యంత విలువైన చరిత్రాత్మక పత్రాలను భద్రపరచడానికి నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సహకారంతో పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం   అనేక  కార్యక్రమాలు చేపట్టింది. గ్రంథాలయాల్లో  ప్రదర్శించడానికి వీలుగా  కొన్ని పత్రాలను అభివృద్ధి చేయడం జరిగింది. [అనుబంధంలో జాబితా జోడించడం జరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0010D2N.jpg

మొదటిసారిగా సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ హిందీ అనువాదం కూడా  అందుబాటులోకి వచ్చింది. అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలలు   సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ లో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా  కేంద్ర మంత్రిత్వ శాఖలు పనిచేస్తాయి.  కేంద్ర సచివాలయం పని సంక్లిష్టంగా, విభిన్నంగా ఉంటుంది.దీనికోసం  సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ ప్రామాణిక ప్రక్రియ, విధానాలు నిర్దేశిస్తుంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002GITJ.jpg

ప్రత్యేక ప్రచారం 2.0 కార్యక్రమంలో భాగంగా  ఎలక్ట్రానిక్ మరియు భౌతిక వ్యర్థాలను తొలగించిన పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం .48, 500 రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది.   దాదాపు 200 చదరపు అడుగుల స్థలాన్ని వినియోగంలోకి తెచ్చింది. 

space.

పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం పాత ప్రచురణల కోసం 

Click here to see the List of some very old Publications of DARPG Library: సందర్శించవచ్చు . 

***

 



(Release ID: 1873355) Visitor Counter : 145