వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) రెండవ త్రైమాసికంలో 25 శాతం పెరిగి 13771 మిలియన్ డాలర్లకు చేరుకున్న భారత వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు


ఈ ఆర్థిక సంవత్సరంలో పండ్లు , కూరగాయలు, తృణధాన్యాలు,
పశువులు , ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో పెరుగుదల నమోదు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో గత ఏడాది ఇదే నెలలతో పోలిస్తే 42% పెరిగిన శుద్ది చేసిన పండ్లు కూరగాయల ఎగుమతులు

Posted On: 02 NOV 2022 2:45PM by PIB Hyderabad

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 (ఏప్రిల్-సెప్టెంబర్) మొదటి ఆరు నెలల్లో వ్యవసాయ , ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం పెరిగాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డిజిసిఐ అండ్ ఎస్) విడుదల చేసిన తాత్కాలిక డేటా ప్రకారం, వ్యవసాయ,  ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల మొత్తం ఎగుమతులు 2022 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో అమెరికన్ డాలర్లలో 25 శాతం పెరిగాయి.

వ్యవసాయ ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపిఇడిఎ) ఉత్పత్తుల మొత్తం ఎగుమతులు 2022 ఏప్రిల్-సెప్టెంబర్లో 13771 మిలియన్ డాలర్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే కాలం లో ఇది 11056 డాలర్లు గా ఉంది.

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అపెడా ద్వారా తీసుకున్న చొరవలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను దేశం తన మొత్తం ఎగుమతి లక్ష్యంలో 58 శాతాన్ని తొలి ఆరు నెలల్లోనే సాధించడానికి దోహదపడ్డాయి.

2022-23 సంవత్సరానికి వ్యవసాయ,  ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి లక్ష్యాన్ని అపెడా (ఎపిఇడిఎ) 23.56 బిలియన్ డాలర్లుగా నిర్ణయించింది ఈ ఆరు నెలల్లో ఇప్పటికే 13.77 బిలియన్ డాలర్ల ఎగుమతిని సాధించింది.

డిజిసిఐ అండ్ ఎస్ తాత్కాలిక డేటా ప్రకారం, ప్రాసెస్ చేసిన పండ్లు కూరగాయల ఎగుమతులు 42.42 శాతం (ఏప్రిల్-సెప్టెంబర్ 2022) గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి, తాజా పండ్లు గత సంవత్సరం సంబంధిత నెలలతో పోలిస్తే 4 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

అలాగే, తృణధాన్యాలు వంటి ప్రాసెస్ చేసిన  ఆహార ఉత్పత్తులు, ఇతర ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల ఎగుమతులు గత సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలిస్తే 29.36 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

2021 ఏప్రిల్-సెప్టెంబర్ లో తాజా పండ్లు 301 మిలియన్ డాలర్ల మేర ఎగుమతి చేయబడ్డాయి, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే నెలల్లో 313 మిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రాసెస్ చేసిన ఎఫ్ అండ్ వి ఎగుమతులు గత ఏడాది ఇదే నెలలో 719 మిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో 1024 మిలియన్ డాలర్లకు పెరిగాయి.

పప్పు దినుసుల ఎగుమతులు 135 మిలియన్ డాలర్ల (ఏప్రిల్-సెప్టెంబర్ 2021-22) నుంచి 330 మిలియన్ డాలర్లకు (ఏప్రిల్-సెప్టెంబర్ 2022-23) పెరగడంతో గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (క్యూ 2) లో పప్పు దినుసుల ఎగుమతులు 144 శాతం పెరిగాయి.

బాస్మతి బియ్యం ఎగుమతులు 2022-23 ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో 37.36 శాతం వృద్ధిని నమోదు చేశాయి, బాస్మతి బియ్యం ఎగుమతులు 1660 మిలియన్ డాలర్లు (ఏప్రిల్-సెప్టెంబర్ 2021) నుండి 2280 మిలియన్ డాలర్లకు (ఏప్రిల్-సెప్టెంబర్ 2022) పెరిగాయి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ 2 లో బాస్మతియేతర బియ్యం ఎగుమతులు ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 2969 మిలియన్ డాలర్లుగా ఉన్న బాస్మతియేతర బియ్యం ఎగుమతులు  ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 3207 మిలియన్ డాలర్లకు పెరిగాయి.

మాంసం, పాడి , పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు 10.29 శాతం పెరిగాయి ఇతర తృణధాన్యాల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో 12.29 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

ఒక్క పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులే 83 శాతం వృద్ధిని నమోదు చేశాయి, వాటి ఎగుమతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అర్ధ సంవత్సరం 57 మిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలం లో ఇది 31 మిలియన్ డాలర్లు గా ఉంది.

అదేవిధంగా, పాల ఉత్పత్తులు 58 శాతం వృద్ధిని నమోదు చేశాయి, వాటి ఎగుమతి ఇది గత సంవత్సరం క్యూ 2 లో 216 మిలియన్ డాలర్ల నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ 2 లో 342 మిలియన్ డాలర్లకు పెరిగింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో గోధుమ ఎగుమతులు 136 శాతం పెరిగాయి. 2021 ఏప్రిల్-సెప్టెంబర్లో 630 మిలియన్ డాలర్లుగా ఉన్న గోధుమల ఎగుమతులు 2022 ఏప్రిల్-సెప్టెంబర్లో 1487 మిలియన్ డాలర్లకు పెరిగాయి.

ఇతర తృణధాన్యాల ఎగుమతులు 2021 ఏప్రిల్-సెప్టెంబర్లో 467 మిలియన్ డాలర్ల నుండి 2022 ఏప్రిల్-సెప్టెంబర్లో 525 మిలియన్ డాలర్లకు పెరిగాయి.  పశువుల ఉత్పత్తుల ఎగుమతి 2021 ఏప్రిల్-సెప్టెంబర్ లో 1903 మిలియన్ డాలర్ల నుండి 2022 ఏప్రిల్-సెప్టెంబర్ లో 2099 మిలియన్ డాలర్లకు పెరిగింది.

రైతులు, ఎగుమతిదారులు, ప్రాసెసర్లు వంటి భాగస్వాములందరి తో కలిసి నాణ్యమైన వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులను దేశం నుంచి ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీఈడీఏ చైర్మన్ ఎం అంగముత్తు తెలిపారు.

డిజిసిఐ అండ్ ఎస్ డేటా ప్రకారం, 2022-23  ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 19.92 శాతం పెరిగి 50.21 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత 2020-21 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 41.87 బిలియన్ డాలర్లతో పోలిస్తే 17.66 శాతం పైగా వృద్ధి రేటు నమోదైంది.అధిక సరుకు రవాణా రేట్లు , కంటైనర్ కొరత వంటి రూపాల్లో తీవ్ర లాజిస్టిక్ సవాళ్లు ఉన్నప్పటికీ ఇది సాధ్యం కావడం విశేషం.

2021-22లో 25.6 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ , ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా అపెడా కొత్త చరిత్రను లిఖించింది, ఇది భారతదేశ మొత్తం వ్యవసాయ వస్తువుల ఎగుమతుల్లో 50 బిలియన్ డాలర్లకు పైగా విలువ మేర దాదాపు 51 శాతంగా ఉంది. 

"వ్యవసాయ ఎగుమతుల విలువ గొలుసులలో కీలక వాటాదారుల సహకారంతో అవసరమైన ఎగుమతుల పర్యావరణ-వ్యవస్థ ను సృష్టించడం ద్వారా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారతదేశ వ్యవసాయ , ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతులలో వృద్ధిని కొనసాగించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అంగముత్తు చెప్పారు.

వ్యవసాయ ,ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహానికి వివిధ దేశాలలో బి 2 బి ఎగ్జిబిషన్లను నిర్వహించడం,  భారత రాయబార కార్యాలయాల చురుకైన భాగస్వామ్యం తో ఉత్పత్తి-నిర్దిష్ట ,సాధారణ మార్కెటింగ్ ప్రచారాల ద్వారా కొత్త సంభావ్య మార్కెట్లను అన్వేషించడం వంటి కేంద్రం తీసుకున్న చొరవల ఫలితంగానే వ్యవసాయ , ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతిలో పెరుగుదల సాధ్యమైంది.

వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో,  హస్తకళలతో సహా జి ఐ ఉత్పత్తుల పై

యు ఎస్ ఎ తో వర్చువల్ కొనుగోలుదారుల అమ్మకందారుల సమావేశాలను నిర్వహించడం ద్వారా, భారతదేశంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జి ఐ) నమోదు చేసుకున్న ఉత్పత్తులను ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది,

ఇండియన్ వైన్ ఎగుమతి పెంపు కోసం 2022 జూన్ 7 నుంచి 9 వరకు జరిగిన లండన్ వైన్ ఫెయిర్ లో 10 మంది వైన్ ఎగుమతిదారుల భాగస్వామ్యాన్ని అపెడా సులభతరం చేసింది.

ఈశాన్య రాష్ట్రాల నుంచి సహజ, సేంద్రియ, జిఐ-వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యాన్ని పెంపొందించడంపై అపెడా ద్వారా కేంద్రం ఇటీవల అస్సాంలోని గౌహతిలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. అస్సాం,  పొరుగు రాష్ట్రాలలో అంతర్జాతీయ మార్కెట్ లింకేజీలను సృష్టించడం ద్వారా పండించే సహజ, సేంద్రియ , జిఐ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడం ఈ సదస్సు లక్ష్యం.

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ సహకారంతో, అపెడా ఇటీవల అంతర్జాతీయ కొనుగోలుదారు,  విక్రేతల సమావేశాన్ని నిర్వహించింది, ఇది లద్దాఖ్ నుండి ఆప్రికాట్లు , ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో లద్దాఖ్, జమ్మూ,  కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పద్దెనిమిది మంది పారిశ్రామికవేత్తలు ఆప్రికాట్లు , ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భారత్, అమెరికా, బంగ్లాదేశ్, ఒమన్, దుబాయ్ దేశాలకు చెందిన 20 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు.

అపెడా జూన్ 13 న బహ్రయిన్ లో ఎనిమిది రోజుల మ్యాంగో ఫెస్టివల్ ను ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా సహా తూర్పు రాష్ట్రాలకు చెందిన 34 రకాల మామిడి పండ్లను బహ్రెయిన్లోని అల్ జజీరా గ్రూప్ సూపర్ మార్కెట్ లో ప్రదర్శించారు.

‘మ్యాంగో ఫెస్టివల్ 2022' కింద భారతీయ మామిడి పండ్లకు అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించడానికి అపెడా కొత్త చొరవలో భాగంగా బహ్రెయిన్ లో మామిడి ప్రదర్శనను నిర్వహించారు. భారతీయ మామిడి పండ్లకు ప్రపంచ వేదికను అందించడానికి అపెడా నిబద్ధత ఫలితం ఇది. బహ్రయిన్ లో తొలిసారిగా తూర్పు రాష్ట్రాలకు చెందిన 34 రకాల మామిడి పండ్లను ప్రదర్శించడం గమనార్హం. ఇంతకు ముందు దక్షిణాది రాష్ట్రాలైన అల్ఫోన్సో, కేసర్, బంగన్ పల్లి మొదలైన రకాల మామిడి పండ్లను అంతర్జాతీయ ప్రదర్శనలలో చాలా వరకు ప్రదర్శించారు.

ఎగుమతి చేయాల్సిన ఉత్పత్తుల అంతరాయం లేని నాణ్యత ధృవీకరణకు అపెడా భారతదేశం అంతటా 220 ప్రయోగశాలలను గుర్తించింది, ఇది విస్తృత శ్రేణి ఉత్పత్తులు,  ఎగుమతిదారులకు టెస్టింగ్ సేవలను అందిస్తుంది.

భారతదేశ ఎగుమతి తులనాత్మక            ప్రకటన: అపెడా ఉత్పత్తులు

ప్రొడక్ట్ పేరు

ఏప్రిల్-సెప్టెంబర్, 2021

 (మిలియన్ డాలర్లలో)

 

ఏప్రిల్-సెప్టెంబర్, 2022

 (మిలియన్ డాలర్లలో)

 

% మార్పు (ఏప్రిల్-సెప్టెంబర్, 2022)

పండ్లు

301

313

4.04

తృణధాన్యాల తయారీలు ఇతర ప్రాసెస్ చేయబడ్డ ఐటమ్ లు

1632

2111

29.36

మాంసం, డైరీ ,పౌల్ట్రీ ఉత్పత్తులు

1903

2099

10.29

బాస్మతి బియ్యం

1660

2280

37.36

నాన్ బాస్మతి బియ్యం

2969

3207

8.03

ఇతర ఉత్పత్తులు

2591

3761

45.16

మొత్తం

11056

13771

24.55

 

మూలం: డిజిసిఐఎస్ ప్రిన్సిపల్ కమోడిటీస్ డేటా- ఏప్రిల్-సెప్టెంబర్, 2022) (ప్రొవిజనల్ డేటా)

 

*****



(Release ID: 1873254) Visitor Counter : 318