ప్రధాన మంత్రి కార్యాలయం

మోర్బీలో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి


రక్షణ-సహాయ కార్యక్రమాలు.. బాధితులకు
సాయంపై ప్రధానికి అధికారుల నివేదన;

అధికారులు నిత్యం బాధిత కుటుంబాలను సంప్రదిస్తూ
వీలైనంత మేర సాయంపై హామీ ఇవ్వాలని ప్రధాని ఆదేశం;

దుర్ఘటన సంబంధిత అంశాల గుర్తించే దిశగా సమగ్ర..
విస్తృత విచారణ తక్షణావసరం: ప్రధాని స్పష్టీకరణ;

విచారణానంతర గుణపాఠాల సత్వర అమలుకు ప్రధానమంత్రి ఆదేశం

Posted On: 01 NOV 2022 5:51PM by PIB Hyderabad

   గుజరాత్‌లోని మోర్బీ విషాదం అనంతరం స్థితిగతులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు నిత్యం బాధిత కుటుంబాలను సంప్రదిస్తూ వారికి వీలైనంత మేర సాయం చేయడంపై భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. అంతకుముందు మోర్బీలో రక్షణ-సహాయ కార్యక్రమాలు, బాధితులకు సాయం తదితరాల గురించి ప్రధానమంత్రికి అధికారుల నివేదించారు. ఈ దుర్ఘటన సంబంధిత అన్ని కోణాల్లోనూ గుర్తించే సమగ్ర, విస్తృత విచారణ నిర్వహించడం తక్షణావసరమని ప్రధాని స్పష్టం చేశారు. ఈ విచారణ అనంతర నేర్చిన గుణపాఠాలను సత్వరం అమలు చేయాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు.

 

   ఈ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, రాష్ట్ర మంత్రి బ్రిజేష్ మెర్జా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, ఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

   అంతకుముందు మోర్బీకి చేరుకున్న ప్రధాని తీగల వంతెన దుర్ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ రక్షణ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారితో కాసేపు సంభాషించి వారి చొరవను ప్రశంసించారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

****



(Release ID: 1872882) Visitor Counter : 148