రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నపర్వానూ-సోలన్ విభాగం జాతీయ రహదారి-05 (పాత జాతీయ రహదారి-22)

Posted On: 01 NOV 2022 4:28PM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పర్వానూ-సోలన్ విభాగం జాతీయ రహదారి-05 (పాత జాతీయ రహదారి-22)  సహకరిస్తున్నదని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. వరుస ట్వీట్లలో శ్రీ గడ్కరీ పర్వానూ-సోలన్ విభాగం జాతీయ రహదారి వివరాలు వెల్లడించారు. NHDP మూడవ దశలో పర్వానూ-సోలన్ విభాగం  జాతీయ రహదారి-05 (పాత జాతీయ రహదారి-22)ని పర్వానూ బైపాస్ చివరి నుంచి  సోలన్ వరకు అభివృద్ధి చేశామని  శ్రీ గడ్కరీ తెలిపారు.     ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. 

పర్వానూ-సోలన్ జాతీయ రహదారి హిందూస్థాన్-టిబెట్ రోడ్డు గా గుర్తింపు పొందిన  పురాతన మరియు చారిత్రక మార్గంలో భాగంగా ఉందని శ్రీ గడ్కరీ చెప్పారు. 70లలో ఇది జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో హైడ్రాలిక్ పుష్ లాంచింగ్ ఆఫ్ సూపర్‌స్ట్రక్చర్ (ISMB) పద్ధతిని ఉపయోగించి 160 మీటర్ల పొడవైన వయాడక్ట్‌ను నిర్మించడం ఒక అద్భుతమైన విజయమని శ్రీ గడ్కరీ తెలిపారు.

పర్వానూ-సోలన్ జాతీయ రహదారి సోలన్, సిర్మౌర్, సిమ్లా, కిన్నౌర్, లాహౌల్ మరియు స్పితి జిల్లాలను మరియు దాని ఉపవిభాగాలు, కులు జిల్లాలోని సిరాజ్, కర్సోగ్ సబ్‌డివిజన్‌ ప్రాంతాలను కలుపుతుందని శ్రీ గడ్కరీ వివరించారు. ఈ ప్రాంతంలో  రాష్ట్రంలోని  భూభాగంలో 30% కంటే ఎక్కువ భూమి ఉందని అన్నారు.. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో సిమ్లా విభాగం, పర్వానూ పట్టణం, సోలన్ మరియు సిర్మౌర్ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్స్ మరియు కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని  ఆయన అన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్/లాహువల్ మరియు స్పితి గిరిజన జిల్లాల సరిహద్దు ప్రాంతాలను స్వదేశీ మరియు విదేశీ పర్యాటకుల కోసం ప్రభుత్వం తెరిచిందని  శ్రీ గడ్కరీ వెల్లడించారు. పర్యాటకుల తాకిడితో  ఈ జిల్లాల్లో రహదారి రవాణా పెరిగిందని అన్నారు. పర్యాటక రంగం వల్ల రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు. 

ఈ ప్రాజెక్ట్ ప్రాంతంలో రహదారి ఎత్తు MSL సగటు సముద్ర మట్టం  పైన 874 నుంచి 1659 మీటర్ల ఎత్తులో రహదారి నిర్మాణం జరిగిందని మంత్రి తెలిపారు. వేసవిలో గరిష్ట సగటు ఉష్ణోగ్రత 40 °Cకి పెరుగుతుంది.  శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రత కొన్నిసార్లు 0 °Cకి పడిపోతుంది.

***


(Release ID: 1872843) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Hindi , Punjabi