గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినూత్నంగా దీపావళి – స్వచ్ఛత పై స్కూలు పిల్లల నేతృత్వంలో భారీ అవగాహనా ప్రచారం


మూలం వద్ద వ్యర్థాలను వేరు చేసే మూడు వారాల ప్రచార కార్యక్రమంలో 75 లక్షల మంది పిల్లలు

Posted On: 30 OCT 2022 1:39PM by PIB Hyderabad

ఈ ఏడాది దీపావళి భారతదేశంలోని అనేక నగరాలకు భిన్నంగా ఉంది. దీపావళి సందర్భంగా సాధారణంగా వినిపించే టపాసుల శబ్దం స్థానంలో 'హ్యూమిన్ గర్వ్ హై' పాట , రోడ్లు,  కమ్యూనిటీ వీధుల్లో  హరా గీలా సూఖా నీలా నినాదాలు ప్రతిధ్వనించాయి. మొబైల్ వ్యాన్లు, బండ్లు ఇంటింటి నుంచి రెండు బుట్టలతో వేరు చేసిన తడి, పొడి వ్యర్థాలను సేకరించాయి.

 

చెత్త రహిత నగరాల లక్ష్యాన్ని సాధించే దిశగా గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓ హెచ్ యు ఎ) మూలం వద్ద తడి పొడి వ్యర్థాలను వేరు చేయడంపై చేపట్టిన భారీ అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా భారతదేశం అంతటా దాదాపు 45,000 పాఠశాలలకు చెందిన 75 లక్షల మందికి పైగా విద్యార్థులు దీపావళి రోజు ఈప్రచారం లో పాల్గొన్నారు. నగర స్థానిక సంస్థలు, మునిసిపల్ కార్పొరేషన్ల నేతృత్వంలో పౌరులు, కమ్యూనిటీ సమూహాలు, కూడా ఈ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నాయి.

"హర గీలా సూఖా నీలా" (తడి వ్యర్థాలకు ఆకుపచ్చ పొడి వ్యర్థాలకు నీలం బుట్టలు) అనే ప్రచార నినాదంతో మూలం వద్ద కనీసం రెండు బుట్టల తడి పొడి వ్యర్థాల విభజన అవసరాన్ని తెలియచేసేలా ee ప్రచారానికి."స్వచ్ఛతా కే దో రంగ్" (పరిశుభ్రత రెండు రంగులు) అని పేరు పెట్టారు.

 

స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 32 రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3500కు పైగా పట్టణ స్థానిక సంస్థల (యుఎల్ బిలు) ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు, కమ్యూనిటీ సమూహాలు ఇంటింటికీ వెళ్లి, గృహస్తులను సమీకరించి మూలాల వద్ద వ్యర్థాల విభజనపై క్షేత్ర స్థాయి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. ఆకుపచ్చ లేబుళ్లు (తడి వ్యర్థాల కొరకు) నీలం లేబుల్స్ (పొడి వ్యర్థాల కొరకు), వ్యర్థాలతో చెత్త బుట్టలు , బొమ్మలను తయారు చేయడం, వీధి నాటకాలు వంటి పెయింటింగ్, ఆర్ట్ , క్రాఫ్ట్ వంటి ప్రత్యేక కార్యక్రమాల్లో వివిధ వయస్సుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్వచ్చతా కా ఉపహార్ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లారు.

 

అస్సాంలోని ఖోవాయికి చెందిన పాఠశాల విద్యార్థులు, మహాత్మాగాంధీ స్వచ్ఛ భారతదేశ దార్శనికత ఆధారంగా ఒక నృత్య నాటకాన్ని ప్రదర్శించగా, పాట్నా నగర్ నిగమ్ పాఠశాలలు "వేస్ట్ టు వండర్" అనే ఇతివృత్తంతో వ్యర్థాల నుండి నమూనాలను తయారు చేశాయి.

ఛోటా భీమ్ వంటి పిల్లల అభిమాన పాత్రలు కూడా అవగాహన కల్పించడానికి ఈ నమూనాలలో భాగంగాఉన్నాయి. ఎంసిడి ఆధ్వర్యం లోని కొన్ని పాఠశాలలు విద్యార్థులకు తడి , పొడి వ్యర్థాలను వేరు చేయడం ప్రాముఖ్యతను ప్రదర్శించడానికి జిగ్సా పజిల్స్ ప్రత్యేకమైన ఆటలను కూడా సృష్టించాయి.

 

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో భారతదేశపు పరిశుభ్రమైన నగరంగా ఆరుసార్లు విజేతగా నిలిచి 7 స్టార్ గార్బేజ్ రహిత నగరం గా నిలిచిన ఇండోర్ దీపావళి తరువాత నగరం అంతటా పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించడంలో గణనీయమైన కృషిని ప్రదర్శించింది.అవగాహన ప్రచారంలో భాగంగా, న్యూ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డిఎంసి) స్వచ్ఛతా మస్కట్ తో వీధుల్లోకి వచ్చింది.

ఫారెస్ట్ ఘాట్ వద్ద స్వీయ సుస్థిర ప్రదేశం లక్ష్యంతో అస్సాంలోని తేజ్ పూర్ మున్సిపల్ బోర్డ్ ఆధ్వర్యం లో వర్మీ కంపోస్టింగ్ , పిట్ కంపోస్టింగ్ పై స్వయం సహాయక సంఘాల సభ్యులు , నివాసితులకు శిక్షణ నిర్వహించారు. కేరళలోని మలప్పురం మున్సిపాలిటీ సెగ్రిగేషన్ క్యాంపెయిన్ కింద అంతరాష్ట్ర కార్మికులకు శిక్షణా తరగతులు నిర్వహించింది. సిఆర్ పిఎఫ్ దళాలు కూడా కాశ్మీర్ లోని ఓపిఎస్ సెక్టార్ నుండి ప్రచారంలో చేరాయి. సిఆర్ పిఎఫ్ క్యాంప్ రోడ్లు, తోటలు , ఆవరణలను శుభ్రం చేయడానికి వారు చీపుర్లు పట్టారు.

 

మూలం వద్ద వ్యర్థాలను వేరు చేసే దేశవ్యాప్త ప్రచారం-  పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ , డంప్ సైట్ లకు వెళ్ళే వ్యర్థాల తగ్గింపు కోసం క్షేత్రస్థాయి కార్యాచరణ ద్వారా దృష్టి సారించే భాగస్వామ్యాన్ని ప్రేరేపించింది. భారీ జన ఆందోళన్ లో అన్ని వర్గాల పౌరులు తమ స్వంత ప్రత్యేక మార్గంలో మూలం వద్ద వ్యర్థాలను వేరు చేయడంపై అవగాహన కల్పించారు ప్రచారాన్ని భారీ విజయవంతం చేశారు. నగరాలను చెత్త రహితంగా చేయడానికి రాష్ట్రాలు తమ శక్తియుక్తులను మళ్లించడం ప్రారంభించినందున ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఈ ప్రభావం

కనిపిస్తోంది.

 

****


(Release ID: 1872124) Visitor Counter : 194