సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐ&బీ సెక్రటరీ ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ శోచన భవన్‌లో స్వచ్ఛత కోసం ప్రత్యేక ప్రచారం 2.0 కింద పురోగతిని సమీక్షించారు
Posted On:
28 OCT 2022 7:02PM by PIB Hyderabad
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛత కోసం స్పెషల్ క్యాంపెయిన్ 2.0 కింద పురోగతిని 27 అక్టోబర్ 2022న సూచన్ భవన్‌లో సెక్రటరీ (ఐ&బీ) అపూర్వ చంద్ర సమీక్షించారు. జయంత్ సిన్హా, ఏఎస్&ఎఫ్ఏ, ఆరేకే. జెనా, సీనియర్ ఎకనామిక్ అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్ ఐ&బీ సతీష్ నంబుద్రిపాద్, ఏడీజీ(అడ్మిన్), రంజన దేవ్ శర్మ, ఏడీజీ (అకౌంట్స్) ఇతర అధికారులు పాల్గొన్నారు. పదేళ్లకు పైగా పడి ఉన్న పాత చెల్లింపు బిల్లులను ప్రత్యేక ప్రచారంలో తొలగించడానికి కేటాయించిన రికార్డ్ రూమ్స్ ఆఫ్ అకౌంట్స్ సెక్షన్‌తో సహా కార్యాలయంలోని వివిధ అంతస్తులను చంద్ర పరిశీలించారు. పాత రికార్డులను ఖాళీ చేయించడంలో సాధించిన పురోగతిని అధికారులు కార్యదర్శి (ఐఅండ్‌బీ)కి వివరించారు. 2017-–18కి ముందు ఉన్న రికార్డులు జాబితా చేశాక తొలగించడం జరిగింది. 50 శాతం కంటే ఎక్కువ పని ఇప్పటికే పూర్తయింది. క్రమబద్ధీకరించబడిన బిల్లులను ఉంచడానికి కేటాయించిన గదులను కూడా బృందానికి చూపించారు. సెక్రటరీ (ఐ&బీ) పూర్తి చేసిన పని స్థలం శుభ్రంకావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్రచారంలో భాగంగా బిల్లులు, ఐటీ వ్యర్థాలు వార్తాపత్రిక పాత నమూనా కాపీలను క్లియర్ చేసిన తర్వాత 2500 చదరపు అడుగుల స్థలం ఖాళీ అవుతుందని భావిస్తున్నారు.
సెక్రటరీ (ఐ&బీ) బిల్లింగ్ ప్రక్రియలను వివరించిన ఖాతాల విభాగాలను కూడా సందర్శించారు. సిబిసి అధికారుల బృందం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
***
(Release ID: 1872031)
Visitor Counter : 135