వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశంలో తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాపార సమాజాన్ని కోరిన కేంద్ర వాణిజ్య మంత్రి
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు భారత దేశం తో ఎఫ్ టిఎ ల లోకి ప్రవేశించాలని ఆకాంక్షిస్తున్నాయి: శ్రీ పియూష్ గోయల్
మన యువత ఇప్పుడు రోజువారీ జీవితావసరాలను సాధించడానికి, ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులుగా ఉండటానికి పోరాటాల నుండి విముక్తి పొందింది: శ్రీ పియూష్ గోయల్
సామాజిక వివక్ష, విభజన ధోరణులకు నవ భారతంలో స్థానం లేదు: పీయూష్ గోయల్
Posted On:
29 OCT 2022 10:10AM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం , పరిశ్రమలు, వినియోగ దారుల వ్యవహారాలు, ఆహార , ప్రజా పంపిణీ, జౌళి శాఖల శాఖా మంత్రి శ్రీ పీయూష్ గోయల్ హైదరాబాద్ లో అఖిల భారత వైశ్య ఫెడరేషన్ (ఎఐవైఎఫ్)ను ఉద్దేశించి ప్రసంగించారు. భారత దేశం లో తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాపార , వాణిజ్య వర్గాలను ఆయన కోరారు.
భారత దేశం లో పరిశ్రమలు , తయారీ రంగాలను ప్రోత్సహించాల్సిన
అవసరాన్ని మంత్రి ఉద్ఘాటించారు. ఇది ఉపాధిని పెంపొందించడానికి, మన పౌరుల జీవితాలలో సంవృద్ధిని తీసుకురావడానికి దోహద పడుతుందని అన్నారు. ప్రయాణికులు, పర్యాటకులు తమ ప్రయాణ బడ్జెట్లో కనీసం 5 శాతాన్ని స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులపై ఖర్చు చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును మంత్రి సమర్థించారు. ప్రతిభావంతులైన మన చేతివృత్తులవారు, హస్తకళాకారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మద్దతు ఇవ్వడానికి , ప్రోత్సహించడానికి అర్హులని మంత్రి అన్నారు.
గత 30 సంవత్సరాలలో భారత దేశ జీడీపీ 11.8 రెట్లు పెరిగిందని శ్రీ గోయల్ వివ రించారు. ఒకప్పుడు జనాభాలో అధిక భాగం మందికి ఆహారం, దుస్తులు , నివాస వసతి వంటి జీవితానికి అవసరమైన ప్రాథమిక అవసరాలకు భరోసా లేని పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు. జీవనావసరాల కోసం నిరంతర పోరాటం నుండి ప్రజలను విముక్తులను చేసే నిర్మాణాత్మక సంస్కరణలపై ప్రభుత్వం విస్తృతంగా దృష్టి సారించడం వల్ల ఇప్పుడు పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ఆయన అన్నారు.
చాలా ప్రాథమిక అవసరం అయిన సురక్షితమైన పారిశుధ్యం దిశగా దేశంలోని ప్రతి ఇంటికి 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడంలో ప్రభుత్వం సాధించిన విజయం తన హృదయాన్ని ఆకట్టుకున్న మంచి సంస్కరణ అని ఆయన అన్నారు. "ఇది మరుగుదొడ్లకు సంబంధించిన విషయం కాదు, ముఖ్యంగా మన మహిళల హుందా ku, ఆత్మగౌరవానికి సంబంధించినది" అని ఆయన అన్నారు.
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ఆహార ధాన్యాలను సరఫరా చేయడం ద్వారా దాదాపు 80 కోట్ల మంది పౌరులకు ఆహార భద్రతను ప్రభుత్వం నిర్ధారించిందని, ప్రతి వ్యక్తికి నెలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను సరఫరా చేసిందని మంత్రి తెలిపారు. నిజంగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి వారి డబ్బును బాగా ఉపయోగిస్తుండటం పన్ను చెల్లింపుదారులకు సంతృప్తి కలిగించే విషయంగా ఉండాలని ఆయన అన్నారు. 50 కోట్ల ప్రజలకు ప్రస్తుతం ఉచిత , నాణ్య మైన ఆరోగ్య సంరక్షణ ను అందిస్తున్నామని, జల జీవన్ మిషన్ లో భాగంగా కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛ మైన తాగునీరు అందిస్తున్నామని ఆయన వివరించారు.
మన జనాభా, ముఖ్యంగా మన యువత ఎదుగుదల , అభివృద్ధికి, నాయకత్వం వహించే కార్యకలాపాలను చేపట్టడానికి స్వేచ్ఛనివ్వడానికి, తద్వారా మన నమ్మశక్యం కాని జనాభా డివిడెండ్ ను పొందడం లో సహాయపడటానికి ఈ చొరవలన్నింటినీ పునాది గా ఆయన పేర్కొన్నారు. మన యువత ఇప్పుడు అవసరాల కోసం పోరాటాల నుండి విముక్తి పొందింది. అత్యంత ఆకాంక్షతో ఉంది. వారు ఆవిష్కర్తలు , వ్యవస్థాపకులుగా మారాలని , వృద్ధిని నడపాలని ఆకాంక్షిస్తున్నారు", అని ఆయన అన్నారు.
మహిళల ప్రాథమిక అవసరాలను, ముఖ్యంగా రుతుస్రావ పరిశుభ్రతను కాపాడాల్సిన ఆవశ్యకత గురించి మంత్రి మాట్లాడారు. యుక్తవయసు వచ్చాక బాలికలు పాఠశాలలకు దూరమవడంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, ప్రభుత్వం శానిటరీ న్యాప్కిన్లను చాలా తక్కువ ధరలకు అందిస్తోందని నొక్కిచెప్పారు.
రుతుస్రావ పరిశుభ్రతకు సంబంధించిన వివిధ అంశాల గురించి మహిళలకు అవగాహన కల్పించి వారిని సంరక్షించడానికి , శక్తివంతం చేయడానికి మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఏడాదిలో దేశంలోని ప్రతి ఒక్క మహిళకు శానిటరీ ప్యాడ్లపై అవగాహన, అందుబాటు ఉండేలా కృషి చేయాలని ఎఐవిఎఫ్ ను మంత్రి కోరారు.
అభివృద్ధి చెందిన దేశంగా, విశ్వగురువుగా ఎదిగే దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని మంత్రి ఉద్ఘాటించారు. భారత దేశం లోని భారీ యువ జనాభాకు ఈ అన్వేషణను ముందుకు తీసుకువెళ్లే
సామర్థ్యం ఉందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రపంచంలో భారతదేశం మాత్రమే ప్రకాశవంతమైన ప్రదేశం. ప్రపంచం గొప్ప ఆశలతో భారతదేశం వైపు చూస్తోంది" అని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం భారత దేశంతో
ఎఫ్ టి ఎ ల లోకి ప్రవేశించాలని
ఆకాంక్షిస్తున్నాయని, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎఫ్ టీ ఏ ను
కేవలం 88 రోజుల్లో భారత దేశం, యుఎఇ మధ్య కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన జిసిసి దేశాలు కూడా భారతదేశంతో ఎఫ్ టిఎలపై సంతకాలు చేయడానికి సన్నద్ధమవుతున్నాయని ఆయన అన్నారు.
మ న మూలాలకు మళ్లీ వెళ్లాల్సిన
అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి గట్టిగా చెప్పారని అంటూ, భారత దేశ చరిత్ర , సంస్కృతి, సంప్రదాయాలు, విలువ
వ్యవస్థలు , గొప్ప బలమైన
సామర్థ్యం కలిగి ఉన్నాయని అన్నారు.
సామాజిక వివక్షకు చరమగీతం పాడాలని, విభజన ధోరణులకు నవ భారతంలో స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన 'పంచ ప్రాణ్' పిలుపును గురించి మంత్రి ప్రస్తావిస్తూ, ఐక్యlత, ఏకత ప్రాణం పంచ ప్రాణ్ లో ఒక అంతర్భాగమని అన్నారు. భారత దేశం నిజంగా తన అపార సామర్థ్యాన్ని సాకారం చేసుకోవాలంటే దేశం మొత్తం ఏకత తో, ఐక్యత తో కలిసి పనిచేయాల్సిన
అవసరం ఉందని ఆయన అన్నారు.
దేశం మొత్తం ఏకతాటిపై పనిచేస్తే, రాజులు, నిజాములు, వలసపాలకుల వైభవం కంటే మన పిల్లలు తమ చరిత్ర పుస్తకాల ద్వారా మన ప్రయత్నాలను నేర్చుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
****
(Release ID: 1871847)
Visitor Counter : 177