శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఇండో‌‌‌‌ – స్వీడిష్ కంపెనీలు ఇరువైపులా గల స్టార్టప్లకు మద్దతునివ్వాలని, మానవ వనరులను ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు పరస్పర సహకారంతో పరిశోధనలు సాగించాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు.


ఇండియా – స్వీడన్ ఆవిష్కరణల దినోత్సవం 9 వ ఎడిషన్ ను ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. ఉమ్మడి పరిశోధన, స్టార్టప్ వాతావరణం ఇరుదేశాల ఉమ్మడి భవిష్యత్తుకు ఉపకరిస్తుందని, శాస్త్రవిజ్ఞానం, సాంకేతికత, సమాజశ్రేయస్సు కోసం ఆవిష్కరణల శక్తి ఉపకరిస్తుంది : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 27 OCT 2022 2:55PM by PIB Hyderabad

ఇండో– స్వీడిష్ కంపెనీలు  ఇరుదేశాలకు చెందిన స్టార్టప్లకు మద్దతునివ్వాలని , ఉమ్మడి పరిశోధనలు సాగించాలని, మానవ వనరులను ఇచ్చిపుచ్చుకోవాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  ఇండియా – స్వీడన్ 9 వ ఆవిష్కరణల దినోత్సవ సమావేశంలో మాట్లాడుతూ   డాక్టర్ జితేంద్ర సింగ్
 ఉమ్మడి పరిశోధనలు, ఉమ్మడి స్టార్టప్ వాతావరణం ఇరుదేశాల భవిష్యత్తుకు ఉపకరిస్తుందని, శాస్త్రవిజ్ఞానం, సమాజశ్రేయస్సు కోసం ఆవిష్కరణల శక్తిని ఇందుకు ఉపయోగించుకోవచ్చునని అన్నారు.
ఇండియా , స్వీడన్ లలో ప్రజారోగ్యాన్ని , నర్సింగ్ సేవలకు, ప్రజారోగ్య సంరక్షణను చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపరచగల ఉమ్మడి ప్రాజెక్టుల గురించి ఆయన  ప్రస్తావించారు.  2020 సంవత్సరంలో  భారత ప్రభుత్వానికి చెందిన డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్వీడన్ ప్రభుత్వానికి చెందిన విన్నోవా లు కృత్రిమ మేధ(ఎఐ) సహాయంతో నూతన పరిష్కారాలను సాధించగల ప్రాజెక్టులను అమలు చేసేందుకు గ్రాంటు నిధులను ప్రకటించాయి.ఇది ప్రజారోగ్యాన్ని చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపరచగలదు..

ఏప్రిల్ 2019 లో ఇండియా , స్వీడన్ లు , ఇండియా స్వీడన్ కొలాబరేటివ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ డవలప్మెంట్  కార్యక్రమాన్ని ప్రకటించింది.
ఈ సంయుక్త కార్యక్రమానికి భారత శాస్త్ర సాంకేతిక శాఖ (డిఎస్టి), స్వీడన్ ఇన్నొవేషన్ ఏజెన్సీ –విన్నోవా నిధులు సమకూర్చాయి.
దీనిద్వారా  ఇండియా, స్వీడన్ లలోని  ప్రపంచ శ్రేణి సాంకేతికతలను ఒక చోట చేర్చి, స్మార్ట్ సిటీస్, పరిశుభ్ర సాంకేతికతలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి)
వంటి రంగాలలో సవాళ్లకు పరిష్కారం చూపనున్నారు.
స్వీడన్ కు చెందిన ఇంధన సంస్థ, ఇండియాతో కలసి పరిశోధన ,ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టేందుకు నాలుగేళ్ల కాలానికి  అదనంగా 25 మిలియన్లను కేటాయించడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.. 
2018 ఏప్రిల్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీడన్ సందర్శించినపుడు, సుస్థిర భవిష్యత్తు కోసం ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక సంయుక్త ప్రకటన ద్వారా అంగీకారం తెలిపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ భాగస్వామ్యం ఆవిష్కరణల రంగంలో , శాస్త్ర విజ్ఞాన రంగంలో ద్వైపాక్షిక సహకార ప్రభావాన్ని మరింత పెంచేందుకు ఉద్దేశించినది. అలాగే ఇది భవిష్యత్ సహకారానికి , సమాజానికి సంబంధించిన వివిధ సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవడానికి,  ఉపకరిస్తుంది. ఆవిష్కరణలకు సంబంధించిన సవాళ్లు, వివిధరంగాల కు సంబంధింఇన అంశాలు, వీటిని  ఇరు దేశాలకు చెందిన బహుళ భాగస్వామ్య సంస్థలు, ఏజెన్సీల సహాయంతో చేపట్టడం జరుగుతుంది.

 


 ఇరుదేశాల మధ్య భాగస్వామ్యంలో పలు అంశాలు ఉన్నాయని, ఇందులో స్మార్ట్‌సిటీ, రవాణా, ఈ మొబిలిటి, ఇంధనం, క్లీన్‌ టెక్నాలజీ,న్యూమెటీరియల్స్‌, స్పేస్‌, సర్కులర్‌, బయో ఆధారిత ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం జీవ శాస్త్రాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇండియా స్వీడన్‌ భాగస్వామ్యం సంస్థలను, పరిశోధన అభివృద్ధి ఎక్కువగా గల పరిశ్రమలు, సృజనాత్మక ఎంటర్‌ప్రెన్యుయర్లు, మధ్య వినూత్న భాగస్వామ్యాన్ని ఏర్పరుస్తుది. ఇది ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపకరిస్తుంది.

ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ  డాక్టర్‌జితేంద్ర సింగ్‌, ఈ అంశంపై తమ ఆలోచనలను పంచుకున్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగంలో ఇండియా మొత్తం పనితీరు ఇటీవలి కాలంలో గణనీయంగా మెరుగుపడిరదని అన్నారు. పబ్లికేషన్ల ప్రచురణ విషయంలో ఇండియా మూడవ స్థానానికి చేరిందని చెప్పారు.ఎస్‌.సి.ఐ జర్నళ్లలో పబ్లికేషన్ల వృద్ధిరేటు పెరుగుదల ఇండియాలో 14 శాతంగా ఉందని, అంతర్జాతీయంగా పబ్లికేషన్ల ప్రచురణల సగటు 4 శాతం మాత్రమే నని అన్నారు. పేటెంట్ల దాఖలులో ఇండియా 10వ స్థానంలో ఉందని మంత్రి తెలిపారు.

సమావేశంలో ముగింపు వాక్యాలు పలుకుతూ డాక్టర్‌ జితేంద్ర సింగ్‌, ఇరు దేశాల ఆలోచనలలో సారూప్యత  స్వేచ్ఛావాణిజ్యం, గ్లోబలైజేషన్‌ కు కట్టుబడి ద్వైపాక్షిక దౌత్య సంబంధాలు వృద్ధిచెందాయని ఆయన అన్నారు.ఇండియా , స్వీడన్‌ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సత్వర వృద్దిలోకి రావడంలో  ఆవిష్కరణల రంగంలో సహకారం కీలకమైనది.

***



(Release ID: 1871618) Visitor Counter : 114