రక్షణ మంత్రిత్వ శాఖ
పారిశుద్ధ్యంపై ప్రత్యేక ప్రచారం 2.0 సందర్భంగా రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ తునకలను ఉపయోగిస్తున్న బిఆర్ఒ
Posted On:
27 OCT 2022 1:30PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక ప్రచారానికి సాంకేతిక ప్రోత్సాహం, తోడ్పాటు లభిస్తున్న నేపథ్యంలో భారత్‌లోనూ, భూటాన్‌లోనూ బిటుమినస్ (శిలాజిత్తు సంబంధ) రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ తునకలను విస్త్రతంగా ఉపయోగించేందుకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బిఆర్ఒ) ప్రయోగాలను నిర్వహించింది. రహదారి ఉపరితలం, పునరుద్ధరణలో ప్లాస్టిక్ తునకల వినియోగాన్ని గరిష్ట స్థాయిలో పెంచేందుకు బిఆర్ఒ ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక ప్రచారం 2.0 సందర్భంగా, భూటాన్‌లో ప్రాజెక్ట్ దనతక్ కింద ఫ్యూన్‌షోలింగ్ - థింపు రోడ్ల మధ్య 4.5 కిమీల మేరకు రోడ్డు పునరుద్ధరణకు, అరుణచల్ ప్రదేశ్‌లో ప్రాజెక్టు వర్తక్ కింద బలిపాడా- చారదౌర్ -తవాంగ్ మధ్య 2.5 కిమీల మేరకు పునరుద్ధరణకు, ప్రాజెక్టు ఉదయక్ కింద రాయింగ్ -కొరోను - పాయ రోడ్డులో 1.0 కిమీ పునరుద్ధరణకు బిఆర్ఒ ఈ సాంకేతికతను ఉపయోగించింది. అంతేకాకుండా, మిజోరాంలో ప్రాజెక్టు పుష్పక్ కింద నథియాల్ -సాంగా -సయిహా రోడ్డులో 5.22 కిమీల మేరకు, అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రాజెక్టు అరుణక్ కింద హపోలీ - సర్లీ - హురీ రోడ్డు లో 2.0 కిమీల మేరకు చేసిన పునరుద్ధరణలో కూడా దీనిని ఉపయోగించారు.
పరిశుభ్రతను, పారిశుద్ధ్యాన్ని జీవన విధానంగా సూచించి, సమర్ధించిన మహాత్మా గాంధీకి తగిన నివాళిగా ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రారంభించారు. అనంతరం, పెండింగ్‌లో ఉన్న సూచనలను, సమస్యలను పరిష్కరించేందుకు, పరిశుభ్రతను సాధించేందుకు ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల వ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచారాన్ని2021లో ప్రారంభించారు. గత ఏడాది నిర్వహించిన ప్రత్యేక ప్రచార విజయానంతరం, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, అనుబంధ/ సంబంధిత కార్యాలయాలలో 2 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ , 2022 వరకు ప్రత్యేక ప్రచారం 2.0ను నిర్వహించాలని నిర్ణయించారు.
***
(Release ID: 1871338)
Visitor Counter : 137