ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ 7వ వార్షిక సమావేశానికి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 26 OCT 2022 5:28PM by PIB Hyderabad

ఈరోజు న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ 7వ వార్షిక సమావేశానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు.

ప్రతి సంవత్సరం వార్షిక సమావేశంలో,  ఏఐఐబీ, భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకోవడానికి గవర్నర్ల బోర్డు సమావేశమవుతుంది.  ఏఐఐబీలో భారత్ వ్యవస్థాపక సభ్యునిగా  రెండవ అతిపెద్ద వాటాదారు.  ఏఐఐబీలో భారతదేశ అతిపెద్ద ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోను కూడా కలిగి ఉంది. ఈ సంవత్సరం వార్షిక సమావేశం ఇతివృత్తం  "సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టువర్డ్ ఎ కనెక్టెడ్ వరల్డ్".

 

"సంక్షోభం-పీడిత ప్రపంచంలో ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్" అనే అంశంపై గవర్నర్ రౌండ్ టేబుల్ చర్చలో ఆర్థిక మంత్రి తన ఆలోచనలను పంచుకున్నారు. సభ్యులకు సహాయం చేయడానికి, అధిక-నాణ్యత అభివృద్ధి ఫైనాన్స్ అందించడానికి  ఏఐఐబీ నిరంతర నిబద్ధత, అంకితభావాన్ని  ఆర్థిక మంత్రి ప్రశంసించారు. ప్రధాన నిర్మాణాత్మక సంస్కరణలు, గట్టి ఎక్స్‌టర్నల్ బ్యాలెన్స్ షీట్‌తో కూడిన భారతదేశం మంచి-లక్ష్య విధాన మిశ్రమం దాని వృద్ధిని నిలకడగా ఉంచడానికి సహాయపడిందని సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం స్వావలంబన ఆర్థిక వ్యవస్థ మార్గాన్ని ప్రారంభించిందని, అందువల్ల మహమ్మారి ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో విజయం సాధించిందని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు.  భారతదేశం తన డిజిటలైజేషన్ మిషన్ ద్వారా సాధించిన అద్భుతమైన పురోగతిని, సామాజిక రక్షణను సులభతరం చేయడానికి, ఆర్థిక చేరికను పెంచడానికి సాంకేతికతను ఉపయోగించడాన్నిశ్రీమతి సీతారామన్ నొక్కిచెప్పారు. 'పర్యావరణానికి జీవనశైలి' (లేదా లైఫ్) వంటి అనేక కార్యక్రమాల ద్వారా భారతదేశ వాతావరణ మార్పుల ప్రతిస్పందన ప్రయత్నాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చురుగ్గా నాయకత్వం వహిస్తున్నారని ఆర్థిక మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. 

అర్థవంతమైన ప్రభావం, వనరులు బహుళ రంగాలలో ఒక డ్రామా పద్ధతిలో ఉండేలా చూసుకోవడానికి, ఏఐఐబి  క్లీన్ ఎనర్జీ, ఎనర్జీ ఎఫిషియన్సీ, విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలు,  విద్య, ఆరోగ్యం, డిజిటల్ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టితో సామాజిక మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన ప్రాధాన్యత రంగాలలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి సూచించారు. 
 

సభ్యుల విస్తారమైన మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ వనరులు మాత్రమే సరిపోవు కాబట్టి, విభిన్న ప్రైవేట్ రంగ వనరులను సమీకరించడంలో బ్యాంక్ ఉత్ప్రేరక పాత్ర పోషించడమే కాకుండా, దాని స్వంత వనరులను పెంపొందించుకునే యంత్రాంగాలను అన్వేషించాలని ఆర్థిక మంత్రి సలహా ఇచ్చారు. 

ఎండిబి క్యాపిటల్ అడిక్వసీ ఫ్రేమ్‌వర్క్ (సిఏఎఫ్)పై జి 20 నిపుణుల ప్యానెల్ నివేదిక సిఫార్సులు పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. 

బ్యాంకు సభ్య దేశాల్లో పూర్తి స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సీతారామన్ సూచించారు. ఆర్థిక మంత్రి ఏఐఐబి తన నిర్దేశిత మిషన్‌ను సాధించడంలో భారతదేశ నిరంతర సహకారానికి హామీ ఇచ్చారు.

 

****



(Release ID: 1871101) Visitor Counter : 162