గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం 2.0 నిర్వహించిన గనులు మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ కార్యాలయాలు

Posted On: 20 OCT 2022 1:30PM by PIB Hyderabad

అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న  ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం 2.0 గనుల మంత్రిత్వ శాఖలో అమలు జరుగుతున్నాయి. అక్టోబర్ 2న ప్రారంభమైన  ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం 2.0 అక్టోబర్ 30 వరకు అమలు జరుగుతుంది. అక్టోబర్ 2న గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ కార్యక్రమాన్ని ఖనిజ్ కక్ష లో ప్రారంభించారు. గనుల శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న అన్ని సంస్థలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నాయి. 116 స్వచ్ఛత కార్యక్రమాలను గుర్తించిన 84 మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో అమలు చేయడం జరుగుతుంది.  

కార్యక్రమ నిర్వహణకు సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు గనుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేపట్టింది. దీనిలో భాగంగా గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి జిఎసీఐ, ఐబిఎం కార్యాలయాలను సందర్శించి కార్యక్రమంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. 

 

NALCO vermicompost

'వర్షం నీటి నిల్వ, కంపోస్ట్ గోతుల నిర్మాణం, చెరువులు, సరస్సులు శుభ్రం చేయడం, పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాలను తొలగించి పర్యావరణ సంరక్షణకు కృషి చేయాలన్న లక్ష్యంతో గనుల మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని భవనాల్లో వర్షం నీటిని సంరక్షించే ఇంకుడు గుంతలు నిర్మించడం జరుగుతుంది. కంపోస్టు పిట్ ప్రాజెక్టును అమలు  చేసేందుకు మూడు ప్రాంతాలను మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. 

   Innovative idea HCLVermicompost (jharkhand)(1)

కలకత్తా కార్యాలయంలో  ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం  2.0  అమలు జరుగుతున్న తీరును ఇటీవల గనుల శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ పరిశీలించారు. చిత్తశుద్ధితో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. 

 

     waste gsi

 

 వెల్‌నెస్ కేఫ్‌ ఏర్పాటు చేయడానికి మంత్రిత్వ శాఖ గుర్తించిన స్థలాన్ని  కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి మరియు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్  సందర్శించారు.   వెల్‌నెస్ కేఫ్‌   పూర్తి ప్రయోజనాలను పొందేలా ఉద్యోగులను ప్రోత్సహించారు. కోల్‌కతాలోని జిఎసీఐ ప్రధాన కార్యాలయాన్ని  మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి  సందర్శించారు.  ప్రత్యేక ప్రచారం 2.0 కింద నెలకొల్పిన  వెల్‌నెస్ కెఫెటేరియాను మంత్రి  ప్రారంభించారు.

 

GSI CANTEEN INAUGURATION

 

ప్రచార కార్యక్రమంలో భాగంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంపై గనుల మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. పెండింగ్‌లో ఉన్న ఎంపీ రిఫరెన్స్‌లు, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు, ఇంటర్ మినిస్టీరియల్ రిఫరెన్స్‌లు, పార్లమెంటరీ హామీలు, పీఎంవో రిఫరెన్స్‌లు, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పీజీ అప్పీళ్లను గుర్తించడం ద్వారా మెరుగైన రికార్డు నిర్వహణ కోసం మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు అమలు చేస్తోంది. 

ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం  కింద చేపట్టిన పనులు అమలు  జరుగుతున్న తీరును  మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సమీక్షించారు.  గనుల మంత్రిత్వ శాఖ సిబ్బంది కోసం  నిర్వహిస్తున్న  డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌లో వ్యర్థాలను వేరు చేయాలని సూచించారు. ఈ విధానాన్ని ఖనిజ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను   నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తున్న విద్యా మంత్రిత్వ శాఖ  జారీ చేస్తుంది. శాస్త్రి భవన్ లో పనిచేస్తున్న అన్ని డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌లలో కార్యక్రమాన్ని అమలు చేసి   వ్యర్థాల వేరు చేసి, కంపోస్ట్ పిట్‌ల తయారీకి బయో వ్యర్థాలను ఉపయోగించడం కోసం చర్యలు అమలు చేస్తారు. 

 

                                

 

హైదరాబాద్ జిఎస్ఐటిఐ హాస్టల్ క్యాంటీన్‌లో వ్యర్ధాలను వేరు చేసి,కంపోస్ట్ తయారీ కోసం బయో వ్యర్థాలు వినియోగిస్తోంది. హైదరాబాద్ జిఎస్ఐటిఐ లో కంపోస్టు పిట్ ఏర్పాటయింది. 

స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా గనుల మంత్రిత్వ శాఖ  లక్షకు పైగా ఫైళ్లకు మోక్షం కలిగించింది.   ఈ సంవత్సరం ఫీల్డ్ కార్యాలయాలపై దృష్టి సారించి  తన  అనుబంధ మరియు సబార్డినేట్ కార్యాలయాలకు చెందిన  3. 32 లక్షల ఫైళ్లను సమీక్షించాలని గనుల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. భారతదేశం అంతటా విస్తరించి ఉన్న గనుల మంత్రిత్వ  కార్యాలయాలు స్వచ్ఛత కార్యక్రమంలో  20 సంవత్సరాల నాటి వ్యర్థాలను  తొలగిస్తున్నాయి.

ఇప్పటివరకు, గనుల మంత్రిత్వ శాఖ మరియు దాని క్షేత్ర సంస్థలు స్వచ్ఛత ప్రచారంలో 90.51% లక్ష్యాన్ని సాధించాయి. పనికిరాని వస్తువుల విక్రయం ద్వారా  1,58,40,266 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాయి.  సమర్థవంతమైన రికార్డుల నిర్వహణ ద్వారా దాదాపు 92,199 చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చింది. 2022 అక్టోబర్ 31, నాటికి మంత్రిత్వ శాఖ ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం  2.0కింద  నిర్దేశించినలక్ష్యాలను100% సాసాధిస్తుందని భావిస్తున్నారు

***


(Release ID: 1869585) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Hindi , Kannada