ఆర్థిక మంత్రిత్వ శాఖ
మిలియన్ ప్లస్ (పది లక్షలకు పైగా జనాభా గల) నగరాలు/పట్టణ సముదాయాలు ఉన్న రాష్ట్రాలకు రూ.1,764 కోట్ల గ్రాంట్ విడుదల
2022-23లో ఇప్పటివరకు పట్టణ స్థానిక సంస్థలకు (యుఎల్బీలకు)
మొత్తం రూ.4,761.8 కోట్ల గ్రాంట్ విడుదల
Posted On:
19 OCT 2022 7:26PM by PIB Hyderabad
మిలియన్ ప్లస్ (పది లక్షలకు పైగా జనాభా గల) నగరాలు/పట్టణ సముదాయాల కోసం రూ.1,764 కోట్ల గ్రాంట్ విడుదల చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం. ఈ గ్రాంట్లు పొందిన రాష్ట్రాలు : ఆంధ్రప్రదేశ్ (రూ. 136 కోట్లు), ఛత్తీస్‌గఢ్ (రూ. 109 కోట్లు), మహారాష్ట్ర (రూ. 799 కోట్లు), ఉత్తరప్రదేశ్ (రూ. 720 కోట్లు).
మిలియన్ ప్లస్ సిటీలు/ అర్బన్ అగ్లోమరేషన్స్ (ఎంపిసి/యుఏలు)కింద గ్రాంట్‌లు పొందిన నగరాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ భిలాయ్‌నగర్, రాయ్‌పూర్, ఔరంగాబాద్, గ్రేటర్ ముంబై, నాగ్‌పూర్, నాసిక్, పూణే, వాసాయి- మహారాష్ట్ర రాష్ట్రంలోని విరార్ నగరం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా, అలహాబాద్, ఘజియాబాద్, కాన్పూర్, లక్నో, మీరట్, వారణాసి.
15వ ఆర్థిక సంఘం (15వ ఎఫ్.సి) తన 2021-22 నుండి 2025-26 నివేదికలో పట్టణ స్థానిక సంస్థలను రెండు వర్గాలుగా విభజించింది: (ఎ) మిలియన్-ప్లస్ పట్టణ సముదాయాలు/నగరాలు (ఢిల్లీ, శ్రీనగర్ మినహా), (బి) ఒక మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న అన్ని ఇతర నగరాలు-పట్టణాలు (మిలియన్ ప్లస్ కాని నగరాలు). వీటికి 15వ ఎఫ్.సి ప్రత్యేక గ్రాంట్లను సిఫారసు చేసింది. మిలియన్ ప్లస్ సిటీస్/ అర్బన్ అగ్లోమరేషన్స్ (ఎంపిసి/యుఏలు) కోసం కమిషన్ సిఫార్సు చేసిన మొత్తం గ్రాంట్‌లలో, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కాంపోనెంట్ కోసం 2/3 వంతు కంటే ఎక్కువ సిఫార్సు చేసింది. మిగిలిన 1/3వ వంతు పరిసర గాలి నాణ్యత కోసం కేటాయించింది.
15వ ఎఫ్.సి. మిలియన్ ప్లస్ సిటీస్ ఛాలెంజ్ ఫండ్ సిఫార్సు చేసిన ఈ నిధులు ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి నాణ్యత, సరఫరా (వర్షపు నీటి సంరక్షణ, రీసైక్లింగ్‌తో సహా), పారిశుధ్యం, పట్టణ స్థానిక సంస్థల ద్వారా స్టార్ రేటింగ్‌లను సాధించడం వంటి వాటిని మెరుగుపరచడానికి ఉపయోగించాలని ఉద్దేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఆమోదిత సిటీ యాక్షన్ ప్లాన్ (కాప్)కి అనుగుణంగా ఉండాలి. అలాగే త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) లో సంతకం చేసి అంగీకరించిన అంశాలకు అనుగుణంగా ఉండాలి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు విడుదల చేసిన పట్టణ స్థానిక సంస్థల (యుఎల్బీ) గ్రాంట్ రాష్ట్ర వారీగా క్రింద విధంగా ఉంది:
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
2023-23 ఆర్థిక సంవత్సరంలో విడుదలైన యుఎల్బీ గ్రాంటు మొత్తం (రూ.కోట్లలో)
|
|
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
293.75
|
|
2
|
అరుణాచల్ ప్రదేశ్
|
0.00
|
|
3
|
అస్సాం
|
0.00
|
|
4
|
బీహార్
|
7.35
|
|
5
|
చండీగఢ్
|
307.20
|
|
6
|
గోవా
|
0.00
|
|
7
|
గుజరాత్
|
20.21
|
|
8
|
హర్యానా
|
77.40
|
|
9
|
హిమాచల్ ప్రదేశ్
|
78.00
|
|
10
|
ఝార్ఖండ్
|
11.94
|
|
11
|
కర్ణాటక
|
7.35
|
|
12
|
కేరళ
|
256.00
|
|
13
|
మధ్యప్రదేశ్
|
314.10
|
|
14
|
మహారాష్ట్ర
|
840.34
|
|
15
|
మణిపూర్
|
42.50
|
|
16
|
మేఘాలయ
|
44.00
|
|
17
|
మిజోరాం
|
17.00
|
|
18
|
నాగాలాండ్
|
0.00
|
|
19
|
ఒరిస్సా
|
0.00
|
|
20
|
పంజాబ్
|
0.00
|
|
21
|
రాజస్థాన్
|
11.94
|
|
22
|
సిక్కిం
|
7.50
|
|
23
|
తమిళనాడు
|
14.70
|
|
24
|
తెలంగాణ
|
331.40
|
|
25
|
త్రిపుర
|
21.00
|
|
26
|
ఉత్తరప్రదేశ్
|
1988.07
|
|
27
|
ఉత్తరాఖండ్
|
62.70
|
|
28
|
పశ్చిమబెంగాల్
|
7.35
|
|
|
మొత్తం
|
4761.80
|
|
****
(Release ID: 1869369)
Visitor Counter : 193