రక్షణ మంత్రిత్వ శాఖ
డిఈఎఫ్‌ఎక్స్‌పో 2022లో ఇండియా-ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్ సందర్భంగా ఎంపి-ఐడిఎస్‌ఏ వద్ద ‘ఇండియా-ఆఫ్రికా సెక్యూరిటీ ఫెలోషిప్ ప్రోగ్రామ్’ ప్రారంభించబడింది
Posted On:
19 OCT 2022 9:20AM by PIB Hyderabad
అక్టోబర్ 18, 2022న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డిఈఎఫ్‌ఎక్స్‌పో 2022 సందర్భంగా ఇండియా-ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్ (ఐఏడిడి) జరిగింది. ఐఏడిడి రెండవ ఎడిషన్ పత్రంగా రూపొందించిన గాంధీనగర్ డిక్లరేషన్..భారత్-ఆఫ్రికా మధ్య రక్షణ మరియు భద్రతా భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచడానికి కొత్త అంశాలను రూపొందించింది.
ఐఏడిడిలో గాంధీనగర్ డిక్లరేషన్ కొత్త ప్రతిపాదనలకు అనుగుణంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 'ఇండియా-ఆఫ్రికా సెక్యూరిటీ ఫెలోషిప్ ప్రోగ్రామ్'ను ప్రారంభించి దాని బ్రోచర్‌ను డైరెక్టర్ జనరల్, మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలసిస్ (ఎంపి-ఐడిఎస్‌ఏ) కు అందజేశారు. .
ఐఏడిడికి నాలెడ్జ్ పార్టనర్ అయిన ఎంపి-ఐడిఎస్‌ఏ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను అందజేస్తోంది.ఈ ఫెలోషిప్ ఆఫ్రికన్ స్కాలర్లకు భారతదేశంలో రక్షణ మరియు భద్రతా అంశాలపై పరిశోధన చేయడానికి అవకాశం ఇస్తుంది. సభ్యులు 1-3 నెలల పాటు ఎంపి-ఐడిఎస్‌ఏ అనుసంధానిస్తారు. స్కాలర్లకు స్టైఫండ్ కూడా అందించబడుతుంది. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలను ఎంపి-ఐడిఎస్‌ఏ వెబ్‌సైట్( (https://www.idsa.in/) నుండి తెలుసుకోవచ్చు.
ఐఏడిడి-ఫెలోషిప్ బ్రోచర్‌ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి:
***
(Release ID: 1869109)
Visitor Counter : 189