ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ప్రజా సమస్యల సూచీలో వరుసగా రెండవ నెలలో కూడా అగ్రస్థానంలో నిలిచిన యుఐడిఎఐ
Posted On:
18 OCT 2022 3:31PM by PIB Hyderabad
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అన్ని ఎ మంత్రిత్వ శాఖల బృందం, శాఖలలో, స్వయంప్రతిపత్తి గల సంస్థలలో ది యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) అగ్రాన నిలిచిందని పాలనా సంస్కరణలు & ప్రజాసమస్యల విభాగం (డిఎఆర్ పిజి) సెప్టెంబర్ 2022 నెలకు విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ ర్యాంకింగులలో వరుసగా రెండవ నెల యుఐడిఎఐ అగ్రాన నిలిచింది.
సిపిజిఆర్ఎఎంఎస్ ద్వారా స్వీకరించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో యుఐడిఎఐ అగ్రశ్రేణి పనితీరును కలిగి ఉండటమే కాక ఆధార్ దారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తోంది.
యుఐడిఎఐ కేంద్ర కార్యాలయం, దాని ప్రాంతీయ కార్యాలయాలు, సాంకేతిక కేంద్రం, దానితో లావాదేవీలు కలిగి ఉన్న కేంద్ర భాగస్వాములతో కూడిన బలమైనన ఫిర్యాదుల పరిష్కార పర్యావరణ వ్యవస్థను యుఐడిఎఐ కలిగి ఉంది. దానితో సంబంధం కలిగి ఉన్న వ్యవస్థ యుఐడిఎఐ వారంలో 92శాతం సిఆర్ఎం సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడుతోంది.
సంస్థ జీవనాన్ని సులభతరం చేయడమే కాక దాని సమస్య పరిష్కార యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సంస్థ సహాయపడుతోంది. యుఐడిఎఐ క్రమంగా అత్యంత ఆధునిక బహిరంగ సిఆర్ఎం పరిష్కారాన్ని అందుబాటులోకి తెస్తోంది. యుఐడిఎఐ సేవలను స్థానికులకు అందించడాన్ని పెంచేందుకు న్యూ కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ (సిఆర్ఎం - నూతన వినియోగదారుల సంబంధాల నిర్వహణ) పరిష్కారాన్ని ఆధునిక లక్షణాలతో రూపొందించారు.
నూతన సిఆర్ఎం పరిష్కారానికి సమస్యలను నమోదు చేయడం, ట్రాక్ చేయడం, సమర్ధవంతంగా పరిష్కరించేందుకు ఫోన్ కాల్, ఇమెయిల్, చాట్ బాట్, వెబ్ పోర్టల్, సోషల్ మీడియా, లేఖ, నేరుగా వెళ్ళడం వంటి బహుళ ఛానెళ్ళ ద్వారా మద్దతునిచ్చే సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
దేశవ్యాప్తంగా ఫోన్, ఐవిఆర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం పూర్తి అయింది. ఇది స్థానికులకు ఐవిఆర్ ల ద్వారా ఆధార్ నమోదును/ తాజా పరిచిన స్థితి, ఆధార్ పివిసి కార్డ్ స్టేటస్ ను ట్రాక్ చేయడం, నమోదు కేంద్రం ప్రాంతం తదితర ప్రత్యేక లక్షణాలతో పూర్తిగా నూతన యూజర్ అనుభవాన్ని ఇస్తుంది.
నూతన సిఆర్ఎం పరిష్కారాన్ని కింద ఇతర ఛానెళ్ళను అందుబాటులోకి పురోగతిలో ఉన్నాయి. స్థానికులకు సేవ చేసేందుకు యుఐడిఎఐ కట్టుబడి ఉండటమేకాక, జీవన సౌలభ్యాన్ని, వ్యాపార సౌలభ్యాన్ని కల్పించే సంధానకర్తగా ఉంటుంది.
***
(Release ID: 1868992)
Visitor Counter : 161