రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్ లోని ఎన్ హెచ్ 75 ఇ లోని రేవా- సిద్ధి సెక్షన్ లో జంట సొరంగాల పని దాదాపు పూర్తి అయినట్టు వెల్లడించిన శ్రీ నితిన్ గడ్కరీ
జంట సొరగాల ఫలితంగా అడవిలో వన్యప్రాణుల సంచారానికి అంతరాయం ఉండదు: శ్రీ గడ్కరీ
Posted On:
18 OCT 2022 1:15PM by PIB Hyderabad
మధ్యప్రదశ్ లోని జాతీయ రహదారి 75ఇ లోని రేవా- సిద్ధి సెక్షన్ లో జంట సొరంగాలు సహా చుర్హత్ బైపాస్ పై పనులన్నీ దాదాపుగా పూర్తి అయినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ట్వీట్ల పరంపరలో పేర్కొన్నారు.
నిలకడైన అభివృద్ధి అన్న దార్శనికతతో ముందుకు వెడుతూ, మానవుడు, ప్రకృతి, వన్యప్రాణులు సామరస్యపూర్వకంగా సహజీవనం చేసేలా చూసేందుకు ఈ బైపాస్ లో జంట సొరంగాలు నిర్మించారని మంత్రి తెలిపారు. దీని ఫలితంగా, వన్యప్రాణులు అడవులలో ఎటువంటి అంతరాయం లేకుండా సంచరించగలుగుతాయని ఆయన అన్నారు.

ట్రాఫిక్ ను మళ్ళించిన ఫలితంగా, తెల్ల పులి మోహన్ సహజ నివాసాన్ని కనుగొని పునరుద్ధరించామని శ్రీ గడ్కరీ తెలిపారు. తగిన సంఖ్యలో సొరంగ మార్గాలను, దిగువ రహదారులను నిర్మించడం అన్న రోడ్డు ప్రమాదాలకు అవకాశాలను తగ్గించి రహదారి భద్రతకు భరోసా ఇస్తుందని అన్నారు. సొరంగ నిర్మాణం అన్నది మోహనియా ఘాట్ వద్ద ట్రాఫిక్ రద్దీని, అడ్డంకులను తగ్గించి, ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. మెరుగైన జియోమెట్రిక్స్ (రేఖాగణితం)తో జంట సొరంగాల నిర్మాణం రేవా నుంచి సిద్ధికి మధ్య దూరాన్ని కనీసం 7 కిమీలు తగ్గించడమే కాక ప్రయాణ సమయాన్ని 45 నిమిషాలు తగ్గిస్తుందని మంత్రి వెల్లడించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో నూతన భారతదేశాన్ని సుపరిపాలనతో సుస్థిరతే ప్రధానంగా మారుస్తున్నట్టు శ్రీ గడ్కరీ తెలిపారు.

***.
(Release ID: 1868795)
Visitor Counter : 145