రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

600 ప్రదాన్ మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి


వ్యవసాయ రంగానికి సంబంధించిన ‘ సమగ్ర కార్యాచరణ ’తో ప్రధాని ఎల్లప్పుడూ పని చేశారని,ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన - ఒక దేశం ఒక ఎరువు అనే లక్ష్యంతో ప్రారంభించబడిందని డాక్టర్ మన్సుఖ్ మాండవియా చెప్పారు

ప్రపంచంలోని నానో యూరియా యొక్క వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన మొట్టమొదటి దేశంగా భారతదేశం అవతరించింది: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

Posted On: 17 OCT 2022 3:48PM by PIB Hyderabad

రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 600 ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను (PMKSK) కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇంకా, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన - ఒక దేశం ఒక ఎరువు అనే పధకం కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద 16,000 కోట్ల12వ విడత మొత్తాన్ని కూడా విడుదల చేశారు.  అగ్రి స్టార్టప్ సదస్సు మరియు ప్రదర్శనను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా, ప్రధాన మంత్రి ఎరువులపై ఈ-మ్యాగజైన్‌ ఇండియన్ ఎడ్జ్ ను కూడా ప్రారంభించారు. స్టార్టప్ ఎగ్జిబిషన్ యొక్క థీమ్ పెవిలియన్‌ను శ్రీ మోదీ సందర్శించి ప్రదర్శనలో ఉన్న ఉత్పత్తులను పరిశీలించారు.

స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, జై జ‌వాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ మరియు జై అనుసంధాన్‌ మంత్రం స్ఫూర్తి ఒక ఆవరణలో నెలవై ఉండటాన్ని ఈ రోజు మనం ఇక్కడ చూడవచ్చు అని అన్నారు. రైతుల జీవితాలను సులభతరం చేయడానికి, వారి సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు అధునాతన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి కిసాన్ సమ్మేళన్ ఒక సాధనమని ఆయన వివరించారు.

 

"ఈ రోజు 600 కంటే ఎక్కువ ప్రదాన్ మంత్రి సమృద్ధి కేంద్రాలు ప్రారంభించబడ్డాయి" అని శ్రీ మోదీ చెప్పారు. ఈ కేంద్రాలు కేవలం ఎరువుల విక్రయ కేంద్రాలు మాత్రమే కాదని, దేశంలోని రైతులతో లోతైన బంధాన్ని ఏర్పరచుకునే యంత్రాంగమని ఆయన వివరించారు. ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి (PM-KISAN) యొక్క ప్రత్యక్ష ప్రయోజన బదిలీ  తాజా విడత గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, మ‌ధ్య‌వ‌ర్త‌ల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల‌కు డబ్బు చేరుతోందని అన్నారు. “ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిగా కోట్లాది రైతు కుటుంబాలకు మరో విడత రూ. 16,000 కోట్లు కూడా విడుదల చేశారు”, దీపావళికి ముందే ఈ విడత రైతులకు చేరుతున్నందుకు శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన - ఒక దేశం ఒక ఎరువు అనే పధకం కూడా ప్రారంభించబడిందని, ఇది రైతులకు భారత్ బ్రాండ్‌తో కూడిన నాణ్యమైన ఎరువులను సరసమైన ధరకు అందజేసే పథకమని ప్రధాన మంత్రి అన్నారు.

 

కష్టపడి పనిచేసే రైతులకు ఎంతో మేలు చేకూర్చిన చర్యలను ఎత్తిచూపుతూ, ద్రవ నానో యూరియా ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. “తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయడానికి నానో యూరియా ఒక మాధ్యమం” అని శ్రీ మోదీ సూచించారు. దాని ప్రయోజనాలను ప్రస్తావిస్తూ, యూరియా బస్తాను ఇప్పుడు ఒక బాటిల్ నానో యూరియాతో భర్తీ చేయవచ్చని ప్రధాన మంత్రి చెప్పారు తద్వారా యూరియా రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆయన అన్నారు.

 

భారతదేశ ఎరువుల సంస్కరణలలో ప్రధాన మంత్రి రెండు కొత్త చర్యలను ప్రస్తావించారు. ముందుగా, దేశవ్యాప్తంగా 3.25 లక్షలకు పైగా ఎరువుల దుకాణాలను ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఈరోజు ప్రయత్నం ప్రారంభించబడుతోంది. ఇవి రైతులు ఎరువులు మరియు విత్తనాలు  కొనుగోలు కేంద్రాలుగా మాత్రమే కాకుండా  భూసార పరీక్షలను అమలు చేస్తాయి మరియు వ్యవసాయ పద్ధతుల గురించి ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తాయి. రెండవది, ఒక దేశం ఒక ఎరువు అనే పధకం కూడా ప్రారంభించబడింది, ఇది ఎరువుల నాణ్యత మరియు దాని లభ్యత గురించి రైతు అన్ని రకాల గందరగోళాన్ని తొలగించనున్నది. “ఇప్పుడు దేశంలో భారత్ బ్రాండ్ పేరు తో విక్రయించే యూరియా అదే పేరుతో, అదే బ్రాండ్ మరియు అదే నాణ్యతతో ఉంటుంది. ఇప్పుడు యూరియా  దేశం మొత్తంలో ‘భారత్’ బ్రాండ్ పేరుతో మాత్రమే అందుబాటులో ఉంటుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దీనివల్ల ఎరువుల ధర తగ్గుతుందని, వాటి లభ్యత పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రసంగిస్తూ, ఈ సందర్భంగా ప్రధాని హాజరు కావడం రైతుల పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి సమర్థ నాయకత్వంలో కొత్త కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ‘సమగ్ర ప్రణాళిక’తో ప్రధాని ఎల్లప్పుడూ పని చేశారని, రైతులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని డాక్టర్ మాండవ్య అన్నారు. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని అవలంబించినా, 'స్మార్ట్ టెక్నాలజీ'ని ప్రోత్సహించినా, రైతుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్‌ను అందించినా, ప్రధాని నాయకత్వంలో చాలా సాధించామని కేంద్ర మంత్రి అన్నారు.

 

డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఇంకా మాట్లాడుతూ వ్యవసాయంలో పరిశోధనలు కూడా ప్రోత్సహించబడ్డాయి మరియు దీని కారణంగా, నానో యూరియా యొక్క వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన ప్రపంచంలోనే  మొదటి దేశంగా భారత్ అవతరించింది. 600 కిసాన్ సమృద్ధి కేంద్రాలు రైతులను అనేక విధాలుగా బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు.

 

ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం (PMKSK) దేశంలోని రైతుల అవసరాలను తీరుస్తుందని. భూసారం, విత్తనాలు మరియు ఎరువుల కోసం పరీక్షా సౌకర్యాలతో సహా వ్యవసాయ-ఇన్‌పుట్‌లను (ఎరువులు, విత్తనాలు, పనిముట్లు) అందజేస్తుందని మంత్రి తెలియజేశారు. రైతులకు అవగాహన కల్పించేందుకు కూడా ఈ కేంద్రాలు దోహదపడతాయి.

 

నేపథ్య సమచారం 

 

ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 13,500 మంది రైతులు మరియు దాదాపు 1500 అగ్రి స్టార్టప్‌లు పాల్గొన్నారు. వివిధ సంస్థల నుండి 1 కోటి మందికి పైగా రైతులు  దూర మాధ్యమాల ద్వారా పరోక్షంగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సదస్సు పరిశోధకులు, విధాన రూపకర్తలు మరియు ఇతర లబ్దిదారుల భాగస్వామ్యానికి వేదిక అయ్యింది.

 

రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 600 ప్రదాన్ మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను (PMKSK) ప్రధాని ప్రారంభించారు. ఈ పథకం కింద, దేశంలోని రిటైల్ ఎరువుల దుకాణాలు దశలవారీగా పీ ఎం కే ఎస్ కే గా మార్చబడతాయి. పీ ఎం కే ఎస్ కే రైతుల యొక్క అనేక రకాల అవసరాలను తీరుస్తుంది మరియు వ్యవసాయ-ఇన్‌పుట్‌లు (ఎరువులు, విత్తనాలు, పనిముట్లు), భూసారం, విత్తనాలు మరియు ఎరువుల కోసం పరీక్షా సౌకర్యాలను అందిస్తుంది; రైతులకు అవగాహన కల్పించడం; వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందించండి మరియు బ్లాక్/జిల్లా స్థాయి అవుట్‌లెట్‌లలో రిటైలర్‌ల క్రమబద్ధమైన సామర్థ్యాన్ని పెంచేలా చూస్తుంది. 3.3 లక్షలకు పైగా రిటైల్ ఎరువుల దుకాణాలను పీ ఎం కే ఎస్ కే లు గా మార్చడానికి ప్రణాళిక రూపొందించారు.

 

ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన - ఒక దేశం ఒక ఎరువు అనే పధకం కూడా కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ పథకం కింద, ప్రధాన మంత్రి భారత్ యూరియా బ్యాగ్‌లను ప్రారంభించారు, ఇది కంపెనీలకు 'భారత్' అనే ఒకే బ్రాండ్ పేరుతో ఎరువులను విక్రయించడంలో సహాయపడుతుంది.

 

****



(Release ID: 1868647) Visitor Counter : 438