సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎస్సీ-ఎస్టీ పారిశ్రామికవేత్తల్లో అవగాహన కల్పించేందుకు జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ మిజోరాంలోని ఐజ్వాల్‌లో మెగా సదస్సు

Posted On: 16 OCT 2022 12:10PM by PIB Hyderabad

వ్యాపార వ్యవస్థాపక సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు జాతీయ ఎస్సీ-ఎస్టీ  హబ్ పథకంపై మంత్రిత్వ శాఖ యొక్క ఇతర పథకాలపై అవగాహన కల్పించడానికి సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME), భారత ప్రభుత్వం జాతీయ ఎస్సీ-ఎస్టీ  హబ్ (NSSH) కాన్‌క్లేవ్‌ను 15 అక్టోబర్ 2022న మిజోరాంలోని ఐజ్వాల్‌లోని దావ్‌పుయ్ మల్టీపర్పస్ సెంటర్‌లో నిర్వహించింది. మిజోరాం ప్రభుత్వ ఆరోగ్య & కుటుంబ సంక్షేమం, ఉన్నత & సాంకేతిక విద్య, వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి డా. ఆర్ లాల్తాంగ్లియానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు, ఈ కార్యక్రమానికి వాణిజ్య & పరిశ్రమలు శాఖ, మిజోరం ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి ఎస్తేర్ లాల్రుత్కిమి తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా ఎస్సీ-ఎస్టీ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మెర్సీ ఎపావో, జాయింట్ సెక్రటరీ, ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులకు మరియు ప్రతినిధులందరికీ  స్వాగతం పలికారు.  ఎస్సీ-ఎస్టీ వ్యవస్థాపకులకు సుస్థిర అభివృద్ధి,  సమ్మిళిత వృద్ధి కోసం, వ్యాపార అనుకూల ఆవరణ వ్యవస్థను సృష్టించడం మరియు ప్రభుత్వ కొనుగోలు విధానం అమలు లో భాగంగా  4% కొనుగోలు ఆదేశాన్ని చేరుకోవడానికి ప్రభుత్వ కొనుగోలులో పాల్గొనడానికి వారికి చేయూత నివ్వడం  లక్ష్యంతో జాతీయ ఎస్సీ-ఎస్టీ హబ్ పథకాన్ని ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుందని ఆమె చెప్పారు. స్వాగత ప్రసంగం అనంతరం ప్రభుత్వ ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ బి బి స్వైన్ కీలకోపన్యాసం చేశారు.  శ్రీ స్వైన్ తన ప్రసంగంలో, భారతదేశంలో  వ్యవస్థాపకత సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు ఎం ఎస్ ఎం ఈ ల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ యొక్క సమిష్టి ప్రయత్నాల గురించి మాట్లాడారు.

 

ముఖ్య అతిథి డాక్టర్ లాల్తాంగ్లియానా, ఎన్‌ఎస్‌ఎస్‌హెచ్ పథకం లబ్ధిదారులను సత్కరించడం ద్వారా వారిని ప్రోత్సహించారు మరియు కార్యక్రమానికి హాజరైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా డాక్టర్ లాల్తాంగ్లియానా మాట్లాడుతూ, “ఎన్‌ఎస్‌ఎస్‌హెచ్ మరియు ఎంఎస్‌ఎంఇ మంత్రిత్వ శాఖకు చెందిన అనేక ఇతర పథకాల కింద మిజోరాం అందజేస్తున్న ప్రయోజనాలను  ఎస్సీ-ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకొని లబ్ది పొందడం చూడటం సంతోషదాయకమని అన్నారు. సదస్సు లో పాల్గొనే వివిధ సంస్థల ప్రతినిధులతో కలసి మెలసి ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకునే అవకాశాల గురించి చర్చించాలని ఆయన పాల్గొనేవారిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ రంగం వృద్ధిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖతో చేతులు కలిపి పనిచేయడం తప్పనిసరి అని కూడా ఆయన అన్నారు. .

 

ఈ కార్యక్రమం ఔత్సాహిక ఎస్సీ-ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రుణ సంస్థలు, జీ ఈ ఎం, ఆర్ ఎస్ టీ ఐ మొదలైన వాటితో పరస్పర అనుసంధానం కోసం ఒక ఉబయతారక వేదికను అందించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో వెండర్ ఎంప్యానెల్‌మెంట్ ప్రక్రియ మరియు సేకరించాల్సిన ఉత్పత్తులు/సేవల వివరాలపై ప్రదర్శనలకు  వేదిక అయ్యింది.

 

ఈ కార్యక్రమంలో యూకో బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (NEDFI) వంటి ఆర్థిక సంస్థలు కూడా ఉన్నాయి, ఇవి ఎం ఎస్ ఎం ఈ రంగానికి సంబంధించిన వివిధ రుణ పథకాలను వివరించాయి. జీఈఎం, ఆర్ ఎస్ టీ ఐ  మొదలైన ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎం ఎస్ ఎం ఈ లకు సహాయం చేయడానికి తమ వివిధ పథకాల వివరాలను అందించాయి.  ఎస్సీ-ఎస్టీ ఎం ఎస్ ఎం ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి రిజిస్ట్రేషన్‌లను అక్కడికక్కడే సులభతరం చేయడానికి ఉద్యం రిజిస్ట్రేషన్ మరియు జీ ఈ ఎం యొక్క ఫెసిలిటేషన్ డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశారు.

 

దేశ ఆర్థిక శ్రేయస్సు కోసం ఎం ఎస్ ఎం ఈ రంగ అభివృద్ధి చాలా ముఖ్యం. స్థిరమైన వృద్ధి కోసం ఎం ఎస్ ఎం ఈ లను శక్తివంతం చేయడానికి మరియు ప్రపంచ వాల్యూ చైన్ కు  అనుకూలంగా మారడానికి ప్రభుత్వం స్థిరంగా కృషి చేస్తోంది. ఈ రకమైన  ఎస్సీ-ఎస్టీ ఎం ఎస్ ఎం ఈ రాష్ట్ర స్థాయి సమావేశాలు ప్రభుత్వం అందించే వివిధ పథకాల గురించి తెలుసుకున్నప్పుడు వారిలో ఉదయించే కొత్త ఆలోచనల ద్వారా వారి పరిధులను విస్తరించుకోవడానికి సహాయపడతాయి.

***



(Release ID: 1868351) Visitor Counter : 208