విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఉదయపూర్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్ మరియు కొత్త & పునరుత్పాదక ఇంధన మంత్రుల సమావేశం
Posted On:
15 OCT 2022 4:39PM by PIB Hyderabad
• పంపిణీ రంగం ఆర్థిక సాధ్యత & సుస్థిరతపై చర్చలు
• పవర్ సిస్టమ్స్ యొక్క ఆధునికీకరణ మరియు అప్‌గ్రేడేషన్ పైన సమాలోచనలు
• పెట్టుబడి అవసరం & పవర్ సెక్టార్ సంస్కరణలతో సహా 24x7 విద్యుత్ సరఫరాను నిర్ధారించేలా పవర్ సిస్టమ్స్ అభివృద్ధి
2022 అక్టోబరు 14 మరియు 15 తేదీలలో రాజస్థాన్లోని ఉదయపూర్లో విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన శాఖల రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంత మంత్రుల సమావేశం జరిగింది. కేంద్ర విద్యుత్ మరియు నూతన పునరుత్పాదక ఇంధన వనరుల (ఎన్ఆర్ఈ) శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ సదస్సుకు అధ్యక్షత వహించారు. విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్ గుర్జార్, పలు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు / విద్యుత్ శాఖ, ఎన్ఆర్ఈ శాఖల రాష్ట్రాల మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యుత్ రంగంలో పెట్టుబడి అవసరాలు & విద్యుత్ రంగ సంస్కరణలతో సహా నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి పంపిణీ రంగం, ఆర్థిక సాధ్యత & స్థిరత్వం, విద్యుత్ వ్యవస్థల ఆధునికీకరణ, అప్గ్రేడేషన్ పవర్ సిస్టమ్స్ అభివృద్ధిపై దృష్టి సారించి వివరణాత్మక చర్చలు ఈ సదస్సులో జరిగాయి.
వాస్తవ నియోగంపై యూనిట్ ప్రాతిపదికనే సబ్సిడీ
ఈ రంగం సంబంధిత సమస్యలపై రాష్ట్రాలు తమ ఇన్పుట్లు మరియు సూచనలను అందించాయి. విద్యుత్ రంగం విలువ గొలుసు అంతటా ఆర్థిక మరియు కార్యాచరణ సుస్థిరతను నిర్ధారించడంలో పంపిణీ రంగం యొక్క కీలక పాత్రను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం సాంకేతిక మరియు వాణిజ్య (ఏటీ&సీ) నష్టాలను తగ్గించడం, ఖర్చును ప్రతిబింబించే సుంకాలు, సబ్సిడీ మరియు సకాలంలో చెల్లింపులను నిర్ధారించడం వంటి వాటిపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ సదస్సులో పేర్కొనబడింది. రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వ శాఖల బకాయిల క్లియరెన్స్ మరియు విద్యుత్ (ఆలస్య చెల్లింపు సర్చార్జ్ మరియు సంబంధిత విషయాలు) రూల్స్, 2022 (ఎల్పీఎస్ రూల్స్)కు కట్టుబడి ఉత్పత్తి కంపెనీలకు బకాయిలను సకాలంలో చెల్లించడం మొదలైవాటిని గురించి ఈ సదస్సులో చర్చించడం జరిగింది. ఏటీ&సీ నష్టాల తగ్గింపు కోసం, వినియోగదారుల కోసం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్ మరియు ఎనర్జీ అకౌంటింగ్ సిస్టమ్లను ఏర్పాటు , సిస్టమ్ మీటరింగ్ని వేగవంతం చేయడానికి కూడా అంగీకరించబడింది. వివిధ వర్గాలకు చెందిన వినియోగదారులకు వాస్తవ ఇంధన వినియోగంపై యూనిట్ ప్రాతిపదికన మాత్రమే సబ్సిడీ అందించాలని కూడా అంగీకరించారు. మొత్తంమీద విద్యుత్ వ్యవస్థల సాధ్యతను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఈ సదస్సులో గుర్తించడమైంది. చాలా వరకు రాష్ట్రాలు తమ పంపిణీ కంపెనీల (డిస్‌కామ్‌లు) ఆర్థిక మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (ఆర్.డి.ఎస్.ఎస్) కింద తమ సంబంధిత కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే సమర్పించాయి. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి దృష్టి పెట్టే దిశగా ఈ సదస్సులో ప్రయత్నాలు , విధానాలు సాగాయి.
సోలార్ రూఫ్టాప్ సిస్టమ్లను త్వరితగతిన అమలు..
వాతావరణ మార్పుల లక్ష్యాలను సాధించే దిశగా దేశం యొక్క నిబద్ధత ప్రకారం 2070 నాటికి నికర ఉద్గారాలను సున్నా లక్ష్యాన్ని చేర్చాడానికి మరియు 2030 నాటికి 500 జీడబ్ల్యు నాన్-ఫాసిల్ ఇన్‌స్టాల్ కెపాసిటీని చేరుకోవడానికి పునరుత్పాదక ఇంధన విస్తరణ ప్రధానమైనది. పునరుత్పాదక ఇంధన రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా సాధించిన విజయాలను ఎత్తిచూపుతూ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు అవసరమైన విధానం, నియంత్రణ మరియు సంస్థాగత జోక్యాలపై చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ యొక్క శిలాజ రహిత సామర్థ్య లక్ష్యాలను సాధించడానికి రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలి. వివిధ ప్రోత్సాహక చర్యల ద్వారా ఆర్ఈ రంగంలో దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎనేబుల్ ఫ్రేమ్వర్క్ను రూపొందించడంపై కూడా సదస్సు దృష్టి సారించింది. దేశంలోని రాష్ట్రాలు 40 జీడబ్ల్యూ మొత్తం లక్ష్యాన్ని చేరుకోవడానికి సోలార్ రూఫ్టాప్ సిస్టమ్లను త్వరితగతిన అమలు చేయడానికి ప్రయత్నించాలని ప్రతిపాదించడమైంది. పీఎం కుసుమ్్ పథకం కింద సోలారైజేషన్ను వేగవంతం చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహించబడినాయి. భవిష్యత్ ఇంధన భద్రతను నిర్ధారించడానికి, బీఈఎసెఎస్ మరియు పంప్డ్ స్టోరేజీ హైడ్రో ప్రాజెక్టులతో సహా ఇంధన నిల్వను అమలు చేయడం ప్రాధాన్యతపై తీసుకోవాలి. గ్రీన్ హైడ్రోజన్, ఆఫ్ షోర్ విండ్, ఆఫ్ గ్రిడ్ మరియు డీసెంట్రలైజ్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ (డీఆర్ఈ) అప్లికేషన్లతో సహా భవిష్యత్ సాంకేతికతలను స్వీకరించడం అవసరం. దేశం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధిని నిర్ధారించడానికి నిరంతర నమ్మకమైన విద్యుత్ సరఫరాను నిర్ధారించడం చాలా కీలకం. దేశంలో విద్యుత్ డిమాండ్ వచ్చే దశాబ్దంలో రెట్టింపు కానుంది మరియు అటువంటి డిమాండ్ను తీర్చడానికి విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం మరియు పంపిణీకి రూ.50 లక్షల కోట్లకు పైగా అవసరమైన మూలధన పెట్టుబడి అవసరం. అందువల్ల ఈ పెట్టుబడులకు బహుళ మూలాల నుండి నిధులు సమకూర్చడం చాలా అవసరం.
విద్యుత్ రంగం లక్ష్యాల సాధనలో రాష్ట్రాలు సహకరించాలి..
పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభావవంతమైన ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కోసం దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడం అవసరం. ఈ దిశగా ముందుకు సాగుతూ కేంద్ర ప్రభుత్వం ఎల్పీఎస్ నియమాలు-2022, విద్యుత్ (చట్టంలో మార్పు కారణంగా ఖర్చులను సకాలంలో రికవరీ చేయడం) నియమాలు 2021, విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ద్వారా ఆర్ఈని ప్రోత్సహించడం) నియమాలు, 2022, ఆర్టీఎం, జీటీఏఎం మరియు జీడీఏఎం వంటి పలు కార్యక్రమాలను చేపట్టింది. విద్యుత్ రంగం ముందున్న ప్రతిష్టాత్మక లక్ష్యాల సాధనలో రాష్ట్రాలు సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు.
***
(Release ID: 1868122)
Visitor Counter : 160