ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ఆర్థిక మంత్రి "అభ్యాస నష్టాలు: పిల్లలు, యువత మరియు భవిష్యత్తు ఉత్పాదకతపై కోవిడ్ పెనుభారం గురించి ఏమి చేయాలి" అనే అంశంపై వాషింగ్టన్ డీ సీ లో ప్రపంచ బ్యాంకు డెవలప్‌మెంట్ కమిటీ డిన్నర్ సమావేశంలో చర్చలో పాల్గొన్నారు


కోవిడ్ 19 కారణంగా అభ్యాస నష్టాలు మరియు వాటిని అధిగమించే మార్గాలపై ఆర్థిక మంత్రి భారతదేశ నిర్దిష్ట అనుభవాన్ని పంచుకున్నారు

Posted On: 15 OCT 2022 10:01AM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి.నిర్మలా సీతారామన్ ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాలు 2022  సందర్భంగా నిన్న సాయంత్రం వాషింగ్టన్ డీ సీ  అభివృద్ధి కమిటీ విందు సమావేశంలో  “అభ్యాస నష్టాలు: పిల్లలు, యువత మరియు భవిష్యత్తు ఉత్పాదకతపై కోవిడ్ పెనుభారం గురించి ఏమి చేయాలి” అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. 

 

కోవిడ్ 19 నేపథ్యంలో పాఠశాలలు మూసివేత విద్యాభ్యాస పునరుద్ధరణ మరియు నైపుణ్యం మెరుగుదలపై ఎడతెగని దృష్టి తప్పనిసరి అని పాల్గొనే ప్రతి దేశం అంగీకరిస్తుందని ఆర్థిక మంత్రి తన ప్రారంభ వ్యాఖ్యలలో తెలిపారు.

 

భారతదేశ ప్రత్యేక అనుభవాన్ని పంచుకుంటూ, శ్రీమతి. నిర్మలా సీతారామన్ కోవిడ్ 19 మహమ్మారి ప్రభావంతో జరిగిన విద్యాభ్యాస నష్టంపై  భారతదేశం చేపట్టిన రెండు దశలను సీతారామన్ పంచుకున్నారు:

 

భారతదేశం 3.4 మిలియన్ల III, V, VII మరియు X తరగతుల విద్యార్థుల అభ్యసించే సామర్థ్యాలను అంచనా వేయడానికి నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (NAS)ని నవంబర్ 2021లో నిర్వహించింది. పోల్చదగిన గ్రేడ్‌ల కోసం ఎన్ ఏ ఎస్ 2017తో పోలిస్తే జాతీయ సగటు పనితీరు 9%కి పడిపోయిందని ఇది చూపించింది.

మార్చి 2022లో, భారతదేశం గ్రేడ్ III విద్యార్థుల కోసం నేషనల్ ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీని చేపట్టింది. ఇది మొదటిసారి వ్యక్తిగత విద్యాభ్యాస ప్రమాణాలను సంఖ్యా మరియు గ్రహణ ప్రమాణాలు  భారతదేశంలో బోధనా మాధ్యమంగా ఉపయోగించే 20 భాషలలో ప్రపంచ ప్రావీణ్యం ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా అంచనా వేయడానికి ప్రపంచంలోనే నిర్వహించిన అతిపెద్ద నమూనా అధ్యయనం.   ఈ రెండు ప్రయత్నాలు సమస్య యొక్క పరిమాణాన్ని ప్రామాణికంగా అంచనా వేయడమే కాకుండా వ్యవస్థాగత ప్రయత్నాలు సాక్ష్యం-ఆధారిత ప్రణాళికను   కూడా అందజేస్తాయని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. ఆర్థిక మంత్రి ఈ ఉదాహరణలను ప్రపంచ బ్యాంకుతో పంచుకున్నారు, తద్వారా వారు ఈ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవచ్చు.

 

భారతదేశం యొక్క 12 డిజిటల్ గ్లోబల్ గూడ్స్‌లో ఒకటిగా గుర్తించబడిన భారతదేశ డిజిటల్ ప్లాట్‌ఫారమ్, దీక్షా ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లో ఉందని ఆర్థిక మంత్రి  పేర్కొన్నారు.  శ్రీమతి. సీతారామన్ మాట్లాడుతూ, ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రాథమిక పాఠశాల పిల్లలకు క్యూ ఆర్ కోడ్ పాఠ్యపుస్తకాలను గత సంవత్సరం లోనే అందించి ప్రపంచంలోనే భారతదేశం మొదటి దేశంగా అవతరించింది. ఆర్థిక మంత్రి ఆసక్తిగల అన్ని దేశాలకు దీక్ష డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కూడా అందుబాటులో ఉంటుంది అని మరియు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్యను విస్తరించడానికి ప్రపంచ బ్యాంక్ ఈ అవకాశాన్ని పరిగణించవచ్చని పేర్కొన్నారు.

5 సంవత్సరాల పాటు అత్యంత భాగస్వామ్య స్ఫూర్తి తో మరియు బహుముఖ సంప్రదింపుల ఆధారంగా భారతదేశం జాతీయ విద్యా విధానం ముసాయిదాను రూపొందించి అప్లోడ్ చేసిందని ఆర్థిక మంత్రి తెలిపారు.  విద్యపై మహమ్మారి ప్రభావం గురించిన అనుభవం ఆధారం గా కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌  పాలసీ జూలై 2020లో విడుదలయింది. 

ఇటువంటి అత్యంత భాగస్వామ్య సంప్రదింపుల ప్రక్రియ నాణ్యమైన అభ్యాసం, పునాది నైపుణ్యాల అవసరం, బోధన మరియు అభ్యాస వనరుల యొక్క మెరుగైన నాణ్యత మరియు ప్రతి అభ్యాసకుడికి విద్యార్థి కి నైపుణ్యం ఆధారిత విద్య ప్రక్రియ తో అందరికీ పాలసీ పై ఆసక్తి  పెరిగిందని శ్రీమతి సీతారామన్ అన్నారు. వాలంటీర్లను నేరుగా వారికి నచ్చిన పాఠశాలలతో అనుసంధానం చేయడానికి మరియు విద్యాభ్యాసం త్వరగా కోలుకోవటాన్ని వేగవంతం చేయడంలో సహాయపడటానికి భారతదేశం ఇటీవల విద్యాంజలి 2.0 ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.

 

పునాది నైపుణ్యాలను పెంపొందించడం కోసం సాంకేతికత ఆధారిత పరిష్కార కార్యక్రమాన్ని  అమలు చేయడంలో సహాయపడే భారతదేశ గోల్ ప్రోగ్రామ్‌ గురించి సంబంధించిన పేపర్‌లో ప్రస్తావించినందుకు  శ్రీమతి సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు.

 

పిల్లల వయస్సు లేదా గ్రేడ్ కాకుండా అభ్యసన అవసరాల ఆధారంగా బోధనా సమూహాలుగా విభజించబడిన భారతదేశం యొక్క "సరైన స్థాయిలో బోధించు" చొరవను కూడా పేపర్‌లో ప్రస్తావించినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

 

సిలబస్ ఆధారిత అభ్యాస ఫలితాలను విడుదల చేసే వారం వారీ ప్రణాళికతో కూడిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను భారతదేశం కూడా ప్రవేశపెట్టిందని శ్రీమతి.సీతారామన్ ప్రతినిధులకు తెలియజేశారు. అదేవిధంగా, ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడానికి భారతదేశం ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిష్ఠ (జాతీయ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ ఫర్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్) ప్రారంభించింది.

 

తక్కువ ఉత్పాదకత, ఆదాయాలు మరియు పెరిగిన సామాజిక అశాంతి కారణంగా భవిష్యత్తులో కోల్పోయే తరం, సంచిత భవిష్యత్ ఆర్థిక నష్టాలను నివారించడానికి దేశాలు విద్యాభ్యాస నష్ట నివారణ త్వరగా కోలుకొనే ఆచరణ ప్రణాళిక (లెర్నింగ్ లాస్ రికవరీ యాక్షన్ ప్లాన్‌) ను రూపొందించడంలో సహాయపడటానికి ప్రపంచ బ్యాంక్ తన విజ్ఞాన శక్తిని ఉపయోగించాలని శ్రీమతి.సీతారామన్ ఉద్బోధించారు.

 

 

****

RM/PPG/KMN

 

 

 


(Release ID: 1868063) Visitor Counter : 155