రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఐఐటి పాట్నాతో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన ఎన్ హెచ్ ఐ డిసిఎల్
प्रविष्टि तिथि:
14 OCT 2022 11:28AM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా & హైవేల మంత్రిత్వ శాఖ పరిధిలోని సిపిఎస్ఇ అయిన జాతీయ రహదారులు & మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ హెచ్ ఐడిసిఎల్), రూర్కీకి చెందిన సిఎస్ఐార్ - సిఆర్ఆర్ఐ, ఐఐటి కాన్పూర్, ఎన్ ఎస్ డిసితో ప్రస్తుత సంవత్సరం 2022-23లో అవగాహనా పత్రాలపై సంతకాలు చేసింది. అంతకుముందు, జాతీయ రహదారుల ఇంజనీరింగ్ లో నవీన, వినూత్న ాలోచనలు, సాంకేతికతలకు సంబంధించిన జానాన్ని పంచుకోవడం కోసం, ఈశాన్య ప్రాంతం, కేంద్ర పాలిత ప్రాంతాలైన లడాఖ్, జమ్ము కాశ్మీర్, అండమాన్ & నికోబార్ లలో అత్యంత కఠినమైన భౌగోళిక ప్రాంతాలు, హైవేలు, సొరంగాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్న కీలక ఇంజినీరింగ్ వృత్తినైపుణ్యం కలిగిన ఎన్ హెచ్ఐడిసిఎల్ నైపుణ్యాలు, సామర్ధ్యాన్ని తాజా పరచడం కోసం ఐఐటి బాంబే & ఐఐటి గువాహతితో అవగాహనా ొప్పందాలపై సంతకాలు చేసుకుంది.
అవగాహన పత్రాలపై సంతకాలు ఛేసుకునేందుకు ఇతర ఐఐటిలు, ఎన్ఐటిలతో ఎన్ హెచ్ఐడిసిఎల్ చర్చలు ప్రారంభించింది. ఈ ప్రక్రియ ఎన్ హెచ్ ఐడిసిఎల్ కు వినూత్న సాంకేతికతలను పరిచయం చేయడంలో తోడ్పడడమే కాక సవాలుగా ఉన్న కొండలు, సరిహద్దు ప్రాంతాలలో రహదారుల నిర్మాణ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాన్ని కనుగొనేందుకు సహాయపడుతుంది. తాజాగా ఐఐటి, పాట్నాతో 11 అక్టోబర్ 2022న అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంపై ఐఐటి పాట్నా డైరెక్టర్ అయిన డాక్టర్ (ప్రొఫెసర్) టిఎన్ సింగ్, ఎన్ హెచ్ఐడిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ హెచ్. చంచల్ కుమార్ సంతకాలు చేశారు.
***
(रिलीज़ आईडी: 1867922)
आगंतुक पटल : 201