వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాని గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఏటా రూ. 10 లక్షల కోట్లు ఆదా చేసే అవకాశం ఉంది. : శ్రీ పీయూష్ గోయల్


సామాజిక రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాల ప్రణాళిక కోసం గతిశక్తి ఎక్కువగా ఉపయోగించబడుతోంది; సాంకేతికత యొక్క ఫలాలను ప్రతి ఒక్క పౌరునికి అందించడానికి జాతీయ మాస్టర్ ప్లాన్: శ్రీ పీయూష్ గోయల్

ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఒక శక్తివంతమైన చొరవ గా చరిత్రలో స్థానం పొందుతుంది, ఇది దేశంలో వేగవంతమైన ప్రగతి సాధన మరియు అభివృద్ధికి దోహదపడుతుంది: శ్రీ పీయూష్ గోయల్

దేశంలో సమతుల్య, సమానమైన, సమ్మిళిత అభివృద్ధిని తీసుకురావడానికి ప్రధాని గతిశక్తి సహాయం చేస్తుంది; మారుమూల ప్రాంతాలు సమీకృత మౌలిక సదుపాయాల ప్రణాళిక మరియు అభివృద్ధి అంతరాలను తీసివేయడంలో జాతీయ మాస్టర్ ప్లాన్ సహాయం చేస్తుంది: శ్రీ పీయూష్ గోయల్

ప్రధాని జాతీయ గతిశక్తి ద్వారా 197 కీలకమైన మౌలిక సదుపాయాలలో అంతరాలను తొలగించే ప్రాజెక్ట్‌లను గుర్తించారు

వివిధ రాష్ట్రాలలో లాజిస్టిక్స్ ఈజ్ (లీడ్స్) 2022 సర్వే నివేదికను ప్రారంభించిన వాణిజ్య మంత్రి

Posted On: 13 OCT 2022 3:50PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా రూ. ఏటా 10 లక్షల కోట్లు  ఆదా అవుతుంది.  జాతీయ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించిన అనంతరం మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని గతిశక్తిపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. ఈ వర్క్‌షాప్ ఇప్పటి వరకు ప్రధాని గతిశక్తి సాధించిన పురోగతి మరియు విజయాలు మరియు ముందుకు సాగే మార్గాలపై దృష్టి సారించింది.

 

సామాజిక రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పీఎం గతిశక్తిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, తద్వారా దేశంలోని ప్రతి పౌరుడికి సాంకేతిక ఫలాలను అందజేస్తున్నారని, సామాన్యుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తున్నామని శ్రీ గోయల్ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ భవిష్యత్తును పీఎం గతిశక్తి పునర్నిర్వచించనుందని మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలను ఉటంకిస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో దేశం చేస్తున్న కృషికి ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ 'గతి' మరియు 'శక్తి' రెండింటినీ కలిపి అందిస్తుందని ఆయన అన్నారు.

 

జాతీయ మాస్టర్ ప్లాన్ మనం పని చేసే విధానాన్ని మరియు మన పని ఫలితాలను మారుస్తుంది మరియు ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని శ్రీ గోయల్ అన్నారు. పీఎం గతిశక్తిని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకునేందుకు రాజకీయ విభేదాలకు అతీతంగా దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చిందని ఆయన గమనించారు. దేశంలో వేగవంతమైన అభివృద్ధి మరియు ప్రగతి ని ప్రోత్సహించే శక్తివంతమైన చొరవ గా చరిత్రలో ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ స్థానం పొందగలదని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పీఎం గతిశక్తి దేశానికి మరియు సమాజానికి చేసిన సేవగా మేము భావిస్తున్నామని ఆయన అన్నారు.

 

వార్షికోత్సవ వేడుకలను భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవడానికి మరియు సృజించుకోవడానికి అవకాశంగా ఉపయోగించుకోవాలని శ్రీ గోయల్ అభిప్రాయపడ్డారు. మెరుగైన, మరింత పొదుపుగా మరియు సమయానుకూలమైన  ప్రణాళిక కోసం ప్రధానమంత్రి గతిశక్తిని ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించాలని లబ్దిదారులందరినీ ఆయన కోరారు.

పైప్‌లైన్‌లు, 29,040 సర్క్యూట్‌లు కిలోమీటర్లు, మరియు భారతదేశ రైల్వే నెట్‌వర్క్ ద్వారా నిర్వహించబడుతున్న 200 మిలియన్ టన్నుల వస్తు రవాణా ప్రధానమంత్రి గతిశక్తి విధానాన్ని అనుసరించి నిర్మించబడింది.

 

ప్రధాని జాతీయ మాస్టర్ ప్లాన్  యొక్క యంత్రాంగం ద్వారా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రధాని గతిశక్తి కింద ఉక్కు, బొగ్గు, ఎరువులు అలాగే ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వంటి రంగాలలో క్లిష్టమైన మౌలిక సదుపాయాల అంతరాలను తొలగించే 197 ప్రాజెక్ట్‌లను గుర్తించి పరిశీలించారు. నేషనల్ మాస్టర్ ప్లాన్‌తో అనుసంధానించబడిన పి ఎం జి పోర్టల్ ద్వారా 11 నెలల్లో 1300 అంతర్-మంత్రిత్వ సమస్యలు పరిష్కరించబడ్డాయి.

 

లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్) 2022 సర్వే నివేదికను కూడా మంత్రి ఆవిష్కరించారు. లీడ్స్ అనేది మొత్తం 36 రాష్ట్రాలు మరియు యూ టీ లలో లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, సేవలు మరియు మానవ వనరులను అంచనా వేయడానికి స్వదేశీ డేటా-ఆధారిత సూచిక.

 

లీడ్స్ ఇప్పటికే ఉన్న లాజిస్టిక్ సామర్థ్యాలపై వివిధ తుది-వినియోగదారు లబ్దిదారులతో అనుసంధానం ద్వారా ప్రజాభిప్రాయాన్ని  తెలుసు కోవడానికి పనిచేస్తుంది మరియు మరింత మెరుగుదల కోసం సిఫార్సులను అందజేస్తుంది. లీడ్స్ రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న లాజిస్టిక్స్ సౌలభ్యం యొక్క పనితీరు పై  ప్రజాభిప్రాయాన్ని  తెలుసు కోవడానికి ఉపయోగిస్తుంది.

 

లీడ్స్ 2022 దేశవ్యాప్తంగా 2100 కంటే ఎక్కువ మంది లబ్ధిదారులనుండి 6500 కంటే ఎక్కువ ప్రతిస్పందనలను స్వీకరించింది. మునుపటి సంస్కరణల వలె కాకుండా, అన్ని రాష్ట్రాలకు ర్యాంకింగ్ సిస్టమ్‌లపై ఆధారపడిన లీడ్స్ యొక్క   వర్గీకరణ-ఆధారిత గ్రేడింగ్‌ను లీడ్స్ 2022 స్వీకరించింది.  నిర్దిష్ట క్లస్టర్‌లోని అగ్ర రాష్ట్రం/ యూ టీ తో పోల్చితే రాష్ట్రం లేదా యూ టీ ఎంత బాగా పనిచేసింది అనే అంచనా కోసం భూభాగాలను రాష్ట్రాలను ఇప్పుడు తీరప్రాంత రాష్ట్రాలు, లోతట్టు ప్రాంతాలు/భూపరివేష్టిత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు మరియు యూనియన్ అనే నాలుగు వర్గాల క్రింద వర్గీకరించారు. 

 

పనితీరు ఆధారంగా చేసుకుని రాష్ట్రాలను 90% లేదా అంతకంటే ఎక్కువ శాతం సాధించిన రాష్ట్రాలు/ యూ టీ లు, ఫాస్ట్ మూవర్స్: 80% నుండి 90% మధ్య శాతం స్కోర్‌లను సాధించిన రాష్ట్రాలు/ యూ టీలు, మరియు ఆస్పైరర్లు: 80% కంటే తక్కువ శాతం స్కోర్‌లను సాధించిన రాష్ట్రాలు/యూ టీ  లు అచీవర్‌లు అనే మూడు  కేటగిరీలుగా  రూపొందించారు.

 

లీడ్స్ 2022 సర్వే రిపోర్ట్ ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (PMGS-NMP) మరియు నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (NLP) లకు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు సేవలు మరియు రెగ్యులేటరీ  నెట్‌వర్క్ మ్యాపింగ్ చేయడానికి డేటా ఆధారిత మల్టీమోడల్ రవాణా కనెక్టివిటీ లో అంతరాలను తొలగించే ప్రాజెక్టుల నిర్మాణం లో సహాయం చేస్తుంది. లీడ్స్ రాష్ట్రం/ యూ టీ లలో రవాణా సామర్థ్యాన్ని పెంచే విధంగా రవాణా కనెక్టివిటీ లో అంతరాలను తొలగించే ప్రాజెక్టుల ను గుర్తించడం లో వాటి నిర్మాణం లో అనుసంధాన వేదిక గా పని చేస్తూనే ఉంది.

 

***


(Release ID: 1867792) Visitor Counter : 202