పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుస్థిరమైన మరియు ప్రయోజనకరమైన చమురు మరియు సహజ వాయువు ఉత్పత్తిపై తాజా పరిణామాలను చర్చించనున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నిపుణులు


అక్టోబర్ 14, 2022న ప్రారంభం కానున్న మూడు రోజుల 5వ సౌత్ ఏషియన్ జియోసైన్సెస్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్, జియో ఇండియా

జైపూర్‌లో సదస్సును ప్రారంభించనున్న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మరియు గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి

నాడు పోస్టు చేయడమైనది: 13 OCT 2022 5:05PM by PIB Hyderabad

 

సహజ వాయువు మరియు మెరుగైన చమురు ఉత్పత్తిపై తాజా పరిశోధనలను పంచుకోవడానికి మూడు రోజుల పాటు 5వ సౌత్ ఏషియన్ జియోసైన్స్ కాన్ఫరెన్స్, జియో ఇండియా 2022 రేపు ప్రారంభమవుతుంది.అక్టోబర్ 14 శుక్రవారం నుండి జైపూర్‌లోని జెఇసిసి సీతాపురలో సదస్సు జరుగుతుంది. కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి గ్యాస్ అండ్ అర్బన్ అఫైర్స్ హర్దీప్ ఎస్.పూరి ఈ మూడు రోజుల సదస్సును ప్రారంభించనున్నారు. అసోసియేషన్ ఆఫ్ పెట్రోలియం జియాలజిస్ట్స్ (ఏపిజీ) ఆధ్వర్యంలో జరుగనున్న ఈ సదస్సులో భారతదేశంతో పాటు యునైటెడ్ స్టేట్స్, నార్వే మరియు యూరోపియన్ సెంట్రల్‌తో సహా ఇతర దేశాల నుండి వంద మందికి పైగా నిపుణులు పాల్గొంటారు. ఆయా అంశాలపై చర్చించడంతో పాటు వారి అనుభవాలను పంచుకుంటారు.

భారతదేశంతో పాటు ఇతర దేశాల నుండి వంద మందికి పైగా నిపుణులు పాల్గొంటారు --

అక్టోబర్ 13  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ రాజేష్ కుమార్ శ్రీవాస్తవ, పాట్రన్, ఏపిజి అండ్ సిఎండీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసి) మాట్లాడుతూ.. జియో ఇండియా సదస్సు గత 15 సంవత్సరాలలో అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చెందిందని అన్నారు. “3 రోజుల కాన్ఫరెన్స్‌ను గౌరవనీయులైన పిఎన్‌జీ మరియు హౌసింగ్ & అర్బన్ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్‌.పూరి అక్టోబరు 14 ఉదయం ప్రారంభిస్తారు. సెక్రటరీ ఎంఒపిఎన్‌జీ శ్రీ పంకజ్ జైన్, డైరెక్టర్ జనరల్, డిజిహెచ్ శ్రీ ఎస్‌సిఎల్ దాస్, మరియు సిఎండి, ఆయిల్ ఇండియా లిమిటెడ్ డాక్టర్ రంజిత్ రత్ కూడా ఈ వేడుకకు గౌరవ అతిథిగా విచ్చేయనున్నారు. అంతేకాకుండా ప్రముఖ విధాన నిర్ణేతలు, అంతర్జాతీయ చమురు కంపెనీలు (ఐఓసీలు) మరియు నేషనల్ ఆయిల్ కంపెనీల (ఎస్‌ఓసిలు) నుండి టాప్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, సర్వీస్ ప్రొవైడర్లు మరియు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొంటారు. చార్టర్డ్ ప్లీనరీ సెషన్‌లు మరియు మూడు ప్యానెల్ చర్చలను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ సదస్సుకు భారత్‌తో పాటు అమెరికా, నార్వే, యూకే సహా ఇతర దేశాల నుంచి వంద మందికి పైగా జియోలజీ, జియోఫిజిక్స్ నిపుణులు హాజరుకానున్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ఇంధన పరివర్తన నేపథ్యంలో చమురు మరియు వాయువు పాత్రపై సదస్సు మేధోమథనం చేస్తుంది. అందుకే, ‘ఫాసిల్ ఫ్యూయెల్స్, డీకార్బనైజేషన్ అండ్ ఛేంజింగ్ ఎనర్జీ డైనమిక్స్’ అనే అంశాన్ని కాన్ఫరెన్స్ థీమ్‌గా ఎంచుకున్నా" అని వివరించారు.

1500 మందికి పైగా భూ శాస్త్రవేత్తలు మరియు 600 మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో 200కి పైగా సాంకేతిక పత్రాలను సమర్పించనున్నట్లు ఏపిజీ అధ్యక్షులు శ్రీ ఎస్‌ఎస్ చిట్నిస్ (ఓఎన్‌జీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) తెలియజేశారు. "సాంకేతిక పత్రాల సమర్పణతో పాటు భవిష్యత్తులో భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడానికి హెచ్‌సి ఉత్పత్తి, సున్నా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడానికి ఈ సమావేశంలో ప్రపంచ నిపుణులతో ప్లీనరీ చర్చలు జరుగుతాయి" అని ఆయన చెప్పారు.

అమెరికాకు చెందిన జస్టిన్ మర్ఫీ, జహీర్ ఇబ్రహీం, చార్లెస్ బోయెట్, నార్వేకు చెందిన దేశికన్ సుందరరాజన్ తదితర నిపుణులు, భారత్‌కు చెందిన పరిశ్రమ నిపుణులు తమ అత్యాధునిక పరిశోధనలు, సాంకేతికతలను సదస్సులో పంచుకోనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లోని మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే భౌగోళిక శాస్త్రాల విద్యార్థులు పెట్రోలియం పరిశ్రమ యొక్క వృత్తిపరమైన సూక్ష్మ నైపుణ్యాలను బహిర్గతం చేసి ఇంధన అవసరాలు ఉన్న వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశ భవిష్యత్తు ఇంధన సైనికులుగా వారిని తీర్చిదిద్దుతారు.

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పెట్రోలియం జియాలజిస్ట్స్ (ఏఏపిజి)

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పెట్రోలియం జియాలజిస్ట్స్ (ఏఏపిజి) 129 దేశాలలో 40,000 కంటే ఎక్కువ మంది సభ్యులతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ జియోలాజికల్ సొసైటీలలో ఒకటి. భూగర్భ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏఏపిజి పనిచేస్తుంది. ముఖ్యంగా పెట్రోలియం, సహజ వాయువు, ఇతర ఉపరితల ద్రవాలు మరియు ఖనిజ వనరులకు సంబంధించినవి; ఆర్థికంగా మరియు పర్యావరణపరంగా ఈ పదార్థాలను అన్వేషించడం, కనుగొనడం మరియు ఉత్పత్తి చేసే సాంకేతికతను ప్రోత్సహించడం; మరియు దాని సభ్యుల వృత్తిపరమైన శ్రేయస్సును మెరుగుపరచడానికి సంస్థ పని చేస్తుంది.

అసోసియేషన్ ఆఫ్ పెట్రోలియం జియాలజిస్ట్స్ (ఏపిజి) ఏఏపిజి యొక్క భారతదేశ విభాగం. పెట్రోలియం జియోసైంటిస్ట్‌లు మరియు ఇంజనీర్‌లను ఒక వేదికపైకి తీసుకువచ్చి చర్చించడానికి, ఉద్దేశపూర్వకంగా మరియు జియోసైన్స్‌లకు సంబంధించిన విలువైన విద్యా మరియు శాస్త్రీయ కార్యక్రమాలు లేదా ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇచ్చే మార్గాలను ఇది ప్లాన్ చేస్తుంది. ఇది పెట్రోలియం జియాలజీ శాస్త్ర  పురోగతిపై దృష్టి పెడుతుంది. ఆర్థికంగా మరియు పర్యావరణపరంగా మంచి పద్ధతిలో అన్వేషణ మరియు ఉత్పత్తి కోసం సాంకేతికతను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది.


 

********


(రిలీజ్ ఐడి: 1867787) సందర్శకుల సూచీ సంఖ్య : : 152
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil