ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిమాచల్ప్రదేశ్ లోని ఊనా నుండి న్యూ ఢిల్లీ కి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ఆకుపచ్చ జెండా ను చూపిన ప్రధాన మంత్రి 

Posted On: 13 OCT 2022 10:47AM by PIB Hyderabad
ఊనా లోని అంబ్ అందౌరా నుండి న్యూ ఢిల్లీ కి వెళ్లే కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభిక ప్రయాణాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఆకుపచ్చటి జెండా ను చూపెట్టడం ద్వారా ఆ రైలు ను బయలుదేరదీశారు.
 
ప్రధాన మంత్రి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పెట్టెల ను పరిశీలించి, ఆ రైలు లో సదుపాయాలను గమనించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇంజిను కు చెందిన కంట్రోల్ సెంటరు ను కూడా శ్రీ నరేంద్ర మోదీ పరిశీలించారు. అలాగే ఊనా రైల్ వే స్టేశన్ లో ఆయన కలియదిరిగారు.
 
ప్రధాన మంత్రి హిమాచల్ ప్రదేశ్ లోని ఊనా జిల్లా లో గ అంబ్ అందౌరా రైల్ వే స్టేశను కు చేరుకొన్నప్పుడు ఆయన వెంట హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రాం ఠాకుర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్ లేకర్, రైల్వే శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మరియు సమాచార- ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ లు ఉన్నారు.
 
ఈ రైలు ఆ ప్రాంతం లో పర్యాటకాని కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం తో పాటుగా యాత్ర ను హాయి గాను, వేగం గాను పూర్తి చేసుకోనిస్తుంది. ఊనా నుండి న్యూఢిల్లీకి ప్రయాణ కాలం రెండు గంటల మేరకు తగ్గుతుంది. అంబ్ అందౌరా నుండి న్యూ ఢిల్లీ కి రాక పోక లు జరిపే ఈ రైలు దేశం లో మొదలుపెట్టిన నాలుగో వందే భారత్ రైలు అని చెప్పాలి. మరి ఇది మునుపటి వందే భారత్ రైళ్ల తో పోలిస్తే ఒక ఆధునిక వర్షన్ గా ఉంది. ఇది చాలా తేలికైంది. తక్కువ వ్యవధి లో అధిక వేగాన్ని అందుకొనే సామర్థ్యాన్ని కలిగివుంది. వందే భారత్ 2.0 లో మరిన్ని అదనపు సౌకర్యాల ను జతపరచడమైంది. ఈ రైలు కు కేవలం 52 సెకన్ లలో గంట కు 100 కిలోమీటర్ వేగాన్ని అందుకోగలగడం వంటి మెరుగైన లక్షణాల ను సంతరించడమైంది. ఈ రైలు గంట కు 180 కి.మీ. గరిష్ఠ వేగాన్ని అందిపుచ్చుకొంటుంది. ఈ సరికొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ బరువు ను ఇదివరకటి 430 టన్నుల వర్శన్ తో పోల్చి చూసినప్పుడు 392 టన్నుల బరువే ఉంటుంది. దీనిలో వై- ఫై కంటెంట్ ఆన్- డిమాండ్ సౌకర్యం సైతం లభిస్తుంది. ప్రతి ఒక్క రైలు పెట్టె లో 32 అంగుళాల తెర లు ప్రయాణికులకు సమాచారం తో పాటు వినోదాన్ని కూడా అందిస్తాయి. మునుపటి వర్శన్ లో 24 అంగుళాల తెర లు అమర్చడమైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ పర్యావరణ పరం గా చూసినప్పుడు ప్రయాణికుల కు అనుకూలం గా ఉంటుంది. ఎలాగంటే దీని లోని ఏసీ లు శక్తి ని 15 శాతం అధికం గా ఆదా చేయగలుగుతాయి. దీని లోని ట్రాక్శన్ మోటారు కు ధూళి రహిత స్వచ్ఛ శీత గాలి ని వెలువరించే సదుపాయం కల్పించడం తో దీనిలో ప్రయాణించడం మరింత సుఖప్రదం గా ఉంటుంది. ఇదివరకటి వందే భారత్ రైలు లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణించే వారికి మాత్రమే అందించిన సైడ్ రిక్లైనర్ సీట్ సౌకర్యాన్ని ఇప్పుడు అన్ని క్లాసుల కు అందుబాటు లోకి తీసుకురావడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ రైలు పెట్టెల కు 180 డిగ్రీ లు వంపు తిరిగే సీట్ ల సౌకర్యాన్ని కూడా కల్పించడమైంది.
 
వందే భారత్ ఎక్స్ ప్రెస్ యొక్క కొత్త రూపు రేఖల లో భాగం గా గాలి ని శుభ్రపరచడం కోసం రూఫ్ మౌంటెడ్ పేకేజ్ యూనిటు (ఆర్ఎంపియు) లో ఒక ఫోటో కేటలిటిక్ అల్ట్రా వాయ్ లెట్ ఎయర్ ప్యూరిఫికేశన్ సిస్టమ్ ను నెలకొల్పడమైంది. చండీగఢ్ లోని సెంట్రల్ సైంటిఫిక్ ఇన్ స్ట్రుమెంట్స్ ఆర్గనైజేశన్ (సిఐఎస్ఒ) సిఫారసు చేసిన ప్రకారం ఈ వ్యవస్థ ను రూపుదిద్దడమైంది. ఆర్ఎమ్ పియు యొక్క రెండు చివరల లోను దీనిని అమర్చడమైంది. వీచే గాలి లో మరియు తిరిగి బయటకు పోయే గాలి లో రోగకారక క్రిములు, కీటకాలు, సూక్ష్మ జీవులు, వైరస్ లు వంటి వాటి ని వడగట్టి, స్వచ్ఛమైన వాయువు ను అందించడానికే ఈ ఏర్పాటు ను చేయడమైంది.
 
వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 లో ప్రయాణికుల కు విమానం లో లభ్యం అయ్యేటటువంటి అనేక ఉన్నతమైన సౌకర్యాలు అందుబాటు లో ఉంటాయి. దేశీయం గా రూపొందించిన అటువంటి ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టం అయిన కవచ్సహా అత్యాధునిక సురక్ష సంబంధి పరికరాల ను ఈ రైలు కు జోడించడమైంది.
 

***


(Release ID: 1867378) Visitor Counter : 194